26
October, 2026

A News 365Times Venture

26
Monday
October, 2026

A News 365Times Venture

Kharge Controversy: ‘‘మోడీ తండ్రి కూడా వెళ్తారు’’.. ఖర్గే వ్యాఖ్యలపై అమిత్ షా తీవ్ర విమర్శలు..

Date:

Kharge Controversy:  కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర వివాదాస్పదంగా మారాయి. పాట్నాలో జరిగిన ఒక కార్యక్రమంలో ‘‘మోడీ తండ్రి కూడా వెళ్తారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీ నేతలు కాంగ్రెస్, రాహుల్ గాంధీ, ఖర్గేలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రధాని కుటుంబంపై అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా ఖర్గే అన్ని మర్యాద హద్దులు దాటారని విమర్శించారు. కాంగ్రెస్ విధానపరమైన అంశాలపై మాట్లాడేందుకు ఏమీ లేకపోవడంతో తిట్ల రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రజలే బుద్ధి చెబుతారు..

సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో స్పందించిన అమిత్ షా.. ప్రధాని మోడీని, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ గతంలో కూడా వ్యాఖ్యలు చేసిందని, గతంలో మోడీని ‘‘మృత్యు వ్యాపారి’’ అని, ఆయన పేదరికాన్ని ప్రస్తావిస్తూ ‘‘టీ అమ్మేవాడు’’ అంటూ ఎగతాళి చేశారని ఆరోపించారు. వరస ఎన్నికల్లో ఓటములతో కాంగ్రెస్ నిరాశకు గురైందని, ప్రధాని కుటుంబంపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలకు ప్రతీసారి ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పారని అన్నారు.

కాంగ్రెస్ వైఖరికి నిదర్శనం..

బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా ఖర్గే వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. బహిరంగ వేదికపై మర్యాదకు విరుద్ధమైన భాషను వాడారని, ఇది కాంగ్రెస్ రాజకీయ సంస్కృతిని ప్రతిబింబిస్తోందని విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేసేటప్పుడు హుందాతనం, సంయమనం పాటించాలని అన్నారు. మరణించిన వ్యక్తుల్ని రాజకీయ ప్రసంగాల్లోకి లాగడం సరైన పద్ధతి కాదని, ఖర్గే వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిదర్శనమని ఆరోపించారు. మాజీ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఖర్గే వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి పట్ల గౌరవం, మర్యాద పాటించాల్సిన అవసరం ఉందని అన్నారు. విధానాలు, ఆలోచనల ఆధారంగా రాజకీయంగా పోటీపడలేక కాంగ్రెస్ వ్యక్తిగత విమర్శలకు దిగుతోందని ఆరోపించారు.

వివాదం ఏమిటి..?

అంతకుముందు ఆదివారం పాట్నాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఓ వ్యక్తి ‘‘మోడీ వెళ్లరు’’ అని ఆయన అధికారంలోనే ఉంటారనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహించుకున్న ఖర్గే..‘‘మోడీ తండ్రి కూడా వెళ్తారు’’ అని వ్యాఖ్యానించారు. ఇదే కాకుండా ఎస్‌ఐఆర్ ప్రక్రియపై విమర్శలు చేశారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు ఆపార్టీ కార్యకర్తలు యువకుడిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

വിദ്യാര്‍ത്ഥി സര്‍ക്കാരുമായി സഹകരിക്കാന്‍ തയ്യാര്‍; സെര്‍ബിയന്‍ തെരഞ്ഞെടുപ്പ് ഫലത്തില്‍ റഷ്യ

മോസ്‌കോ: സെര്‍ബിയയില്‍ നടന്ന തിരഞ്ഞെടുപ്പില്‍ ‘സ്റ്റുഡന്റ് ലിസ്റ്റ്’ വിജയം നേടി പുതിയ...

''நீதிமன்றத்தில் ஆஜர்படுத்தப்பட உள்ளார்'' – அன்பில் மகேஸ் கைது குறித்து காவல்துறை விளக்கம்!

முன்னாள் அமைச்சர் அன்பில் மகேஸ் பொய்யாமொழி கைது செய்யப்பட்ட செய்தி இப்போது...

Dool In-Depth: ഇന്ത്യന്‍ ഇടതുപക്ഷത്തിന് പഠിക്കാനുണ്ട് ലുല ഡ സില്‍വയില്‍ നിന്ന്

ഒരുവശത്ത് അമേരിക്കന്‍ പ്രസിഡന്റ് ഡൊണാള്‍ഡ് ട്രംപിന്റെ പിന്തുണയുള്ള തീവ്രവലതുപക്ഷം. മറുവശത്ത്, രാഷ്ട്രീയ...

`எல்லோரும் எம்.ஜி.ஆர், விஜய் ஆகிவிட முடியாது’ – தனுஷ், சிவகார்த்திகேயன் பற்றி துரைமுருகன் கருத்து!

வேலூர் காட்பாடியில் உள்ள தனது வீட்டில் தி.மு.க பொதுச்செயலாளரும் முன்னாள் அமைச்சருமான...