21
September, 2026

A News 365Times Venture

21
Monday
September, 2026

A News 365Times Venture

Killer: జగతి ఆంటీ ‘కిల్లర్’ గ్లింప్స్ రిలీజ్

Date:

‘శుక్ర’, ‘మాటరాని మౌనమిది’, ‘ఏ మాస్టర్ పీస్’ వంటి విభిన్న చిత్రాలతో సినీ ప్రేమికులను ఆకట్టుకున్న దర్శకుడు పూర్వాజ్, ఇప్పుడు సరికొత్త సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ **‘కిల్లర్’**తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో పూర్వాజ్ స్వయంగా హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. హీరోయిన్‌గా జ్యోతి రాయ్ నటిస్తుండగా, విశాల్ రాజ్, దశరథ, చందూ, గౌతమ్ లాంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏయు అండ్ ఐ, మెర్జ్ ఎక్స్‌ఆర్ సంస్థలతో కలిసి థింక్ సినిమా బ్యానర్‌పై పూర్వాజ్, ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 30, 2025న ‘కిల్లర్’ మూవీ గ్లింప్స్ తెలుగు, కన్నడ భాషల్లో విడుదలైంది. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో ఎలిమెంట్స్‌తో కూడిన ఈ గ్లింప్స్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. హై-క్వాలిటీ వీఎఫ్‌ఎక్స్, గ్రిప్పింగ్ విజువల్స్ సినిమా స్థాయిని మరో లెవెల్‌కి తీసుకెళ్లాయి.

Read More: Kingdom: ‘హృదయం లోపల’ ఏదోలా ఉందంటున్న దేవరకొండ

“ప్రాచీన వైమానిక శాస్త్రంలో ఆశ్చర్యకరమైన మానవ మేధస్సు రహస్యాలు… ఆత్మ కలిగిన యంత్రాలు నిజమవుతాయా?” అనే ఆకర్షణీయమైన వాయిస్‌ఓవర్‌తో గ్లింప్స్ ప్రారంభమవుతుంది. హీరోయిన్ జ్యోతి రాయ్ ‘డీ బౌండ్’ అనే అరుదైన డిజార్డర్‌తో బాధపడుతూ, దాన్ని జయిస్తే పునర్జన్మ లాంటిదని, అప్పుడు ఆమెను ఎదురించడం ఎవరి తరం కాదని చెప్పే సన్నివేశాలు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. జ్యోతి రాయ్ సూపర్ షీ క్యారెక్టర్‌లో చేసిన స్టన్నింగ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, ఆమె సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ గ్లింప్స్‌లో హైలైట్‌గా నిలుస్తాయని టీం చెబుతోంది. లవ్, రొమాన్స్, రివేంజ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, థ్రిల్లర్ అంశాల మేళవింపుతో ఈ సినిమా రూపొందినట్లు గ్లింప్స్ హింట్ ఇస్తోంది. చివర్లో హీరోగా, దర్శకుడిగా పూర్వాజ్ చెప్పిన “మొదలెడదామా?” అనే పవర్‌ఫుల్ డైలాగ్ సినిమాపై ఉత్కంఠను రెట్టింపు చేస్తుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..

భారతీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త స్మార్ట్‌ఫోన్ లావా విరాట్ కర్వ్...

ಪೌರಕಾರ್ಮಿಕರ ಬೇಡಿಕೆ ಈಡೇರಿಕೆಗೆ ಪತ್ರಕರ್ತರಿಂದ ಒತ್ತಾಯ

ಬೆಂಗಳೂರು,ಸೆಪ್ಟಂಬರ್‌,21,2026 (www.justkannada.in):  ರಾಜ್ಯದ ಪೌರಕಾರ್ಮಿಕರನ್ನು ಖಾಯಂಗೊಳಿಸುವುದು ಸೇರಿದಂತೆ ವಿವಿಧ ಬೇಡಿಕೆಗಳನ್ನು...

ബ്രാഹ്‌മണ്യത്തെ ഹൃദയത്തില്‍ കൊണ്ടുനടക്കുന്നവരാണ് ഈഴവര്‍: ജി.സുധാകരന്‍

ആലപ്പുഴ: ബ്രാഹ്‌മണ്യത്തെ ഹൃദയത്തില്‍ കൊണ്ടുനടക്കുന്ന ബ്രാഹ്‌മണരല്ലാത്ത വിഭാഗമാണ് കേരളത്തിന്റെ 33 ശതമാനം...

“தொழிலதிபர் வீரமணி தப்பியது எப்படி? ஸ்டாலின் பதில்சொல்ல வேண்டும்" – அமைச்சர் நிர்மல் குமார்

திமுக ஆட்சிக் காலத்தில் சிறுமிகள் மீதான பாலியல் குற்றச்சாட்டில் சிக்கிய ஜெம்...