21
September, 2026

A News 365Times Venture

21
Monday
September, 2026

A News 365Times Venture

Iran-US: దిగొచ్చిన ఇరాన్.. అణు ఒప్పందంపై అమెరికాతో చర్చలు

Date:

ఎట్టకేలకు ఇరాన్ దిగొచ్చింది. అమెరికాతో అణు ఒప్పందం చేసుకొనేందుకే సిద్ధపడింది. అమెరికాతో న్యాయమైన అణు ఒప్పందం చేసుకోవడానికి ఎదురుచూస్తున్నట్లు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సన్నిహితుడు అలీ షమ్ఖానీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అమెరికాతో చర్చలు జరిపేందుకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చిని ఒమన్‌కు పంపుతున్నట్లు పేర్కొన్నారు. చర్చలు సానుకూలంగా ఉంటే.. అమెరికాతో అణు ఒప్పందం చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు.

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి, అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ నాయకత్వంలో అణు చర్చలు జరగనున్నట్లు తెలిపాయి.

ఇది కూడా చదవండి: Shalini Pandey: ఆ హీరోతో రొమాన్స్ చేయాలనేది నా కోరిక..

అమెరికాతో ఇరాన్ అణు ఒప్పందం చేసుకోకపోతే తీవ్రమైన బాంబు దాడులు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దీంతో ఇరు దేశాల మధ్య పరిస్థితి తీవ్రమైంది. దీనిపై ఇరాన్ కూడా స్పందిస్తూ.. అందుకు ధీటుగా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మొత్తానికి చర్చలకు శ్రీకారం జరిగింది.

ఇది కూడా చదవండి: Venkaiah Naidu: నేతల భూతులు వినలేక‌.. గత ఎన్నికల్లో ఓట్లు వేసి ఓడించారు..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

"முதல்வர் தனது வேலையைப் பார்க்கத்தான் தலைமைச் செயலகம்; கடலைப் பார்ப்பதற்கல்ல"- ஸ்டாலின் சாடல்

நடந்து முடிந்த சட்டமன்றக் கூட்டத்தொடரின்போது, 110-வது விதியின் கீழ் ரூ.1,200 கோடி...

CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..

ఏపీలో ఎల్ నినో ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలు, యాక్షన్ ప్లాన్ అమలుపై...

ಮೈಸೂರು ದಸರಾ ಗೋಲ್ಡ್ ಕಾರ್ಡ್ ಬುಕ್ಕಿಂಗ್ ಆರಂಭ: 6,500 ರೂ ದರ ನಿಗದಿ

ಮೈಸೂರು,ಸೆಪ್ಟಂಬರ್‌,21,2026 (www.justkannada.in):  ವಿಶ್ವವಿಖ್ಯಾತ ಮೈಸೂರು ದಸರಾ ಮಹೋತ್ಸವಕ್ಕೆ ದಿನಗಣನೆ ಆರಂಭವಾಗಿದ್ದು,ಸಿದ್ದತೆ...