27
August, 2026

A News 365Times Venture

27
Thursday
August, 2026

A News 365Times Venture

TGPSC : సీడీపీవో అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల

Date:

TGPSC : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గురువారం ఓ ముఖ్య ప్రకటనను విడుదల చేసింది. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (CDPO), అదనపు చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ఐసీడీఎస్ వెర్హౌస్ మేనేజర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 23వ తేదీన సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ ప్రక్రియ సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం (పాత క్యాంపస్), పబ్లిక్ గార్డెన్ రోడ్, నాంపల్లి, హైదరాబాద్లో జరగనుంది. అభ్యర్థులు విధిగా హాజరై, తాము అర్హత పొందిన అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లను వెంట తీసుకురావాలని కమిషన్ సూచించింది.

వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా మరియు సమగ్ర సమాచారం కోసం TSPSC అధికార వెబ్‌సైట్ https://www.tspsc.gov.in ను సందర్శించవచ్చు. అభ్యర్థులు తమ పేరు లిస్టులో ఉందో లేదో ధృవీకరించుకోవాలి. అభ్యర్థులు ఏప్రిల్ 21 నుండి 24 మధ్య వెబ్ ఆప్షన్స్ నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో తప్పకుండా ఆప్షన్లను ఎంచుకోవాలని స్పష్టం చేసింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ డేకు హాజరుకాలేకపోతే, లేదా అవసరమైన ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకురాకపోతే, తదుపరి అవకాశం ఇచ్చే ఉద్దేశం లేదని TSPSC ఖచ్చితంగా తెలిపింది. కనుక అభ్యర్థులు పూర్తిగా సిద్ధంగా ఉండాలి.

Bangladesh: భారత్ నిర్ణయం వల్ల మాపై ఎలాంటి ప్రభావం ఉండదు.. బంగ్లా మేకపోతు గాంభీర్యం..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ರಾಯಚೂರು ಐ.ಐ.ಐ.ಟಿಯಲ್ಲಿ 12 ಕೋಟಿ ರೂ. ವೆಚ್ಚದಲ್ಲಿ AI ಉತ್ಕೃಷ್ಟತಾ ಕೇಂದ್ರ ಸ್ಥಾಪನೆ-ಸಚಿವ ಎಂ.ಬಿ ಪಾಟೀಲ್

ಬೆಂಗಳೂರು,ಆಗಸ್ಟ್,26,2026 (www.justkannada.in):  ರಾಜ್ಯದಲ್ಲಿ ಪರಿಪೂರ್ಣ ಕೈಗಾರಿಕಾ ಬೆಳವಣಿಗೆ ಸಾಧಿಸಲು ಸರಕಾರ...

മാഡിസണ്‍ സ്‌ക്വയറില്‍ ആര്‍.എസ്.എസ് വേണ്ട; ന്യൂയോര്‍ക്കിൽ 48 സംഘടനകളുടെ സംയുക്ത യോഗം

ന്യൂയോര്‍ക്ക്: ന്യൂയോര്‍ക്കില്‍ ആര്‍.എസ്.എസ് തലവന്‍ മോഹന്‍ ഭാഗവത് പങ്കെടുക്കുന്ന പരിപാടി നിര്‍ത്തിവയ്ക്കണമെന്ന്...

குப்பை இருக்கும் இடம் தேடி… மதுரையை மாற்ற, களத்தில் இறங்கிய மாநகராட்சி ஆணையர் | Photo Album

மதுரை: விபத்தில் உயிரிழந்த காவலர்; குடும்பத்துக்காக ஒன்றிணைந்து ரூ.22 லட்சம் திரட்டிய...

Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్‌ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు

Nepal Floods: నేపాల్‌లో వరదలకు సంబంధించిన దృశ్యాలు చూస్తేనే షాక్‌ అయ్యే...