14
February, 2025

A News 365Times Venture

14
Friday
February, 2025

A News 365Times Venture

Ragging: ‘‘టాయ్‌లెట్ సీటుని నాకించారు’’.. ర్యాగింగ్ భూతానికి 15 ఏళ్ల విద్యార్థి బలి..

Date:

Ragging: ర్యాగింగ్ భూతానికి 15 ఏళ్ల బాలుడు బలయ్యాడదు. కేరళలోని టీనేజర్ మిహిర్ ఆత్మహత్య సంచలనంగా మారింది. స్కూల్‌లో ర్యాగింగ్, బెదిరింపులతో ప్రాణం తీసుకున్నాడు. కేరళలోని ఎర్నాకుళంలోని త్రిప్పునితురలో జనవరి 15న మిహిర్ తన అపార్ట్‌మెంట్ భవనంలోని 26వ అంతస్తు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కుమారుడు ఎదుర్కొన్న భయంకరమైన అనుభవాలను అతడి తల్లి రజ్నా పీఎం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

Read Also: Mamta Kulkarni: సన్యాసిగా మారిన బాలీవుడ్ యాక్టర్ “మమతా కులకర్ణి” బహిష్కరణ..

‘‘మిహిర్‌ని కొట్టారు. తిట్టారు. అతడి చివరి రోజు ఎవరూ ఊహించలేని అవమానాన్ని భరించాడు. అతడిని బలవంతంగా వాష్‌రూమ్‌లోకి తీసుకెళ్లారు. టాయిలెట్ సీటను బలవంతంగా నాకించారు. టాయిలెట్ ఫ్లష్ చేసిన తర్వాత అతడి తలను టాయిలెట్‌లో పెట్టారు. ఈ క్రూరమైన చర్యలు అతడి జీవితాన్ని విచ్ఛిన్నం చేశాయి.’’ ఆమె చెప్పింది. తన కొడుకు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని తెలుసుకునేందుకు తాను, తన భర్త సమాచారాన్ని సేకరించామని రజ్నా చెప్పారు. స్నేహితులు, పాఠశాల సహచరులతో మాట్లాడిన తర్వాత, తన కొడుకు ఎంతటి బాధల్ని అనుభవించాడో తెలుసుకున్నామని, పాఠశాలలో, స్కూల్ బస్సులో విద్యార్థులు మిహిర్‌ని క్రూరంగా ర్యాగింగ్ చేశారని, కొట్టారని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

కేవలం శారీరక వేధింపులే కాకుండా, అతడి చర్మం రంగుని ఆధారంగా చేసుకుని దూషించారని, ఎగతాళి చేశారని చెప్పారు. తన కొడుకు మరణించడాన్ని కొందరు సెలబ్రేట్ చేసుకున్నారని ఆమె పేర్కొంది. తన కొడుకు మరణంపై నిష్పాక్షిక దర్యాప్తుని కోరుతూ, సేకరించిన ఆధారాలను సీఎం ఆఫీస్, డీజీపీ ఆఫీస్‌కి సమర్పించినట్లు తెలిపారు. త్రిప్పునితురలోని హిల్ ప్యాలెస్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే, డిజిటల్ ఆధారాలు సేకరించడంలో జాప్యం నేరస్తుల ఆధారాలు చెరిపేసే వీలుందని మిహిర్ తల్లి ఆందోళన వ్యక్తం చేశారు. తన కొడుకుకి న్యాయం చేయాలని, మిహిర్‌ల మరో బిడ్డ బాధపడకూదని ఆమె అన్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಹೂಡಿಕೆದಾರರ ಸಮಾವೇಶ: ಉತ್ಸಾಹದಿಂದ ಓಡಾಡಿದ ಎಂ ಬಿ ಪಾಟೀಲ

ಬೆಂಗಳೂರು, Feb.12,2025: ಜಾಗತಿಕ ಹೂಡಿಕೆದಾರರ ಸಮಾವೇಶದಲ್ಲಿ ಬುಧವಾರ ದಿನವಿಡೀ ಬೃಹತ್...

മലയോര ഹൈവേ; 250 കി.മീ പണി പൂര്‍ത്തിയായി, ഒരു വര്‍ഷത്തിനകം 200 കി.മീ കൂടി; ആദ്യ റീച്ചിന്റെ ഉദ്ഘാടനം നാളെ

തിരുവനന്തപുരം: കാസര്‍ഗോഡ് ജില്ലയിലെ നന്ദാരപ്പടവ് മുതല്‍ തിരുവനന്തപുരം ജില്ലയിലെ പാറശ്ശാലവരെ നീളുന്ന...

`மனைவி கணவரை தவிர்த்து வேறொருவர் மீது காதலும், நெருக்கமும் கொண்டிருப்பது தகாத உறவாகாது'- MP ஹைகோர்ட்

மத்தியப் பிரதேசத்தைச் சேர்ந்த ஒருவர் தன்னுடைய மனைவிக்கு வேறு ஒருவருடன் தொடர்பு...

Lalu Prasad Yadav: “మా బావకు కిడ్నాపర్లలో సంబంధం”.. లాలూ బావమరిది సంచలన ఆరోపణ..

Lalu Prasad Yadav: లాలూ ప్రసాద్ యాదవ్‌పై ఆయన బావమరిది,...