14
February, 2025

A News 365Times Venture

14
Friday
February, 2025

A News 365Times Venture

Rohit Sharma: ఆ ఊహ కూడా నన్నెంతో బాధిస్తుంది.. అభిమాని ఎమోషనల్ లేఖ

Date:

Rohit Sharma: ప్రస్తుతం ఫామ్ కోసం తెగ కష్టపడుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఓ పదిహేనేళ్ల అభిమాని రాసిన భావోద్వేగభరితమైన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ లేఖ క్రికెట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. టెస్టు, వన్డేల్లో టీమిండియా సారథిగా ఉన్న హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఇటీవల జరిగిన బోర్డర్-గావస్కర్ టోర్నీలో టీమిండియా ప్రదర్శన నిరాశజనకంగా ఉండటంతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రోహిత్ శర్మ ఆటతీరు తగ్గిందని, క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తన ఫామ్‌ను తిరిగి పొందే ప్రయత్నంలో రంజీ మ్యాచ్‌లోనూ బరిలోకి దిగినా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.

Also Read: Prabhas: ‘కల్కి 2898 ఎడి 2’ కి సర్వం సిద్ధం..నాగ్ అశ్విన్ నుండి ఎగ్జైటింగ్ అప్‌డెట్ 

ఇకపోతే, మరోవైపు రోహిత్ శర్మపై విపరీతంగా ప్రేమను కలిగిన ఓ 15 ఏళ్ల బాలుడు రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ లేఖలో బాలుడు రోహిత్ శర్మపై ఉన్న తన అభిమానాన్ని, విశ్వాసాన్ని అద్భుతంగా వ్యక్తం చేశాడు. “నా ఆరాధ్య దేవుడు, నా ఫేవరెట్ క్రికెటర్, గ్రేటెస్ట్ బ్యాటర్ ఆఫ్ ఆల్ టైమ్! మీరు ఆడిన ప్రతి మ్యాచ్ నాకు ప్రత్యేకం. మీరే మా కలల హిట్‌మ్యాన్. లక్షలాది మంది అభిమానుల మనసులో మీకున్న ప్రేమను నేను ఈ లేఖ ద్వారా వ్యక్తం చేస్తున్నాను. ఫామ్ అనేది తాత్కాలికం, కానీ క్లాస్ పర్మనెంట్… మీ ఫామ్ తగ్గిందని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో మీరు అద్భుతంగా రాణిస్తారు. రంజీ మ్యాచ్‌లో మీరు కొట్టిన మూడు సిక్సర్లు అద్భుతమైనవి. మీ మ్యాచ్‌ను చూడటానికి నేను నా మ్యాథ్స్ క్లాస్‌ను ఎగ్గొట్టాను కూడా. ఎందుకంటే, మీ ఆట చూడటం నాకు ముఖ్యం. మీ నాయకత్వం అన్నిటికంటే గొప్పది. ప్రతి ఫార్మాట్‌లోనూ మీరు ప్లేయర్‌గా, కెప్టెన్‌గా విజయవంతం అయ్యారని, మీరే మైదానంలోకి ఓపెనింగ్ చేయకపోతే నేను టీవీ ఆన్ చేయలేనని తన ఆవేదనను తెలిపాడు. అది ఊహించడం కూడా నాకు బాధగా అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు.

Also Read:Daaku Maharaaj : స్పీకర్లు జాగ్రత్త.. డాకు మహారాజ్ OST వస్తుంది

నేను 15 ఏళ్ల అబ్బాయిని. స్పోర్ట్స్ అనలిస్ట్ కావాలని నా కల. రాజస్థాన్ రాయల్స్‌తో ఇంటర్న్‌షిప్ పూర్తి చేశాను. మీరు నాకు ఏదైనా సహాయం చేస్తారంటే దయచేసి నాకు తెలియజేయండి. ఐ లవ్ యూ రోహిత్! మీరు మళ్లీ ఫామ్‌లోకి వస్తారని నాకు నమ్మకం ఉందని లేఖలో రాసుకొచ్చాడు. ఈ అద్భుత లేఖ క్రికెట్ అభిమానుల గుండెలను హత్తుకుంది. రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్లపై అభిమానుల ప్రేమ ఎలా ఉంటుందో ఈ లేఖ వెల్లడించింది. ఎవరైనా తాత్కాలికంగా ఫామ్ కోల్పోయినా, వారి అసలు ప్రతిభ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. రోహిత్ శర్మ తన అభిమానుల ప్రేమను తగిలించుకుని తిరిగి మళ్లీ ఫామ్‌లోకి వస్తారని అందరూ ఆశిస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಹೂಡಿಕೆದಾರರ ಸಮಾವೇಶ: ಉತ್ಸಾಹದಿಂದ ಓಡಾಡಿದ ಎಂ ಬಿ ಪಾಟೀಲ

ಬೆಂಗಳೂರು, Feb.12,2025: ಜಾಗತಿಕ ಹೂಡಿಕೆದಾರರ ಸಮಾವೇಶದಲ್ಲಿ ಬುಧವಾರ ದಿನವಿಡೀ ಬೃಹತ್...

മലയോര ഹൈവേ; 250 കി.മീ പണി പൂര്‍ത്തിയായി, ഒരു വര്‍ഷത്തിനകം 200 കി.മീ കൂടി; ആദ്യ റീച്ചിന്റെ ഉദ്ഘാടനം നാളെ

തിരുവനന്തപുരം: കാസര്‍ഗോഡ് ജില്ലയിലെ നന്ദാരപ്പടവ് മുതല്‍ തിരുവനന്തപുരം ജില്ലയിലെ പാറശ്ശാലവരെ നീളുന്ന...

`மனைவி கணவரை தவிர்த்து வேறொருவர் மீது காதலும், நெருக்கமும் கொண்டிருப்பது தகாத உறவாகாது'- MP ஹைகோர்ட்

மத்தியப் பிரதேசத்தைச் சேர்ந்த ஒருவர் தன்னுடைய மனைவிக்கு வேறு ஒருவருடன் தொடர்பு...

Lalu Prasad Yadav: “మా బావకు కిడ్నాపర్లలో సంబంధం”.. లాలూ బావమరిది సంచలన ఆరోపణ..

Lalu Prasad Yadav: లాలూ ప్రసాద్ యాదవ్‌పై ఆయన బావమరిది,...