19
November, 2026

A News 365Times Venture

19
Thursday
November, 2026

A News 365Times Venture

The Muslim 500 List 2027: ప్రపంచంలో టాప్-500 ముస్లింల జాబితా.. షారూఖ్‌తో సహా భారత్ నుంచి 22 మంది!

Date:

The Muslim 500 List 2027: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన ముస్లింల జాబితా ‘ది ముస్లిం 500’ విడుదలైంది. 2027 సంవత్సరానికి గానూ విడుదలైన ఈ లిస్టులో భారత్ నుంచి 22 మందికి చోటు దక్కింది. ఈ జాబితాలో మత నాయకులు, సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు ఉన్నారు. జమియత్ ఉలేమా ఏ హింద్ అధ్యక్షుడు మౌలానా మహమూద్ మదానీ భారతీయుల్లో అగ్రస్థానంలో నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభావవంతులైన ముస్లింలలో ఈయన 18వ స్థానంలో ఉన్నారు.

ఈ జాబితాలో తొలిసారిగా బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్‌కు కూడా చోటు దక్కింది. షారుఖ్‌తో పాటు అమీర్ ఖాన్, నటి షబానా అజ్మీ, సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు.

జాబితాలో ఉన్న భారతీయు ప్రముఖులు వీరే..

1. షేక్ అబూ బకర్ అహ్మద్
2. మౌలానా ఖమరుజ్జమాన్ అజ్మీ
3. షబానా అజ్మీ
4. సయ్యద్ ఇబ్రహీముల్ ఖలీల్ అల్-బుఖారీ
5. మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్
6. డాక్టర్ హసీమా హసన్
7. మౌలానా సాద్ కంధల్వీ
9. మౌలానా ఝునాహల్వి
8. మౌలానా
10. డాక్టర్ సానియా సనైన్ ఖాన్
11. షారుఖ్ ఖాన్
12. మౌలానా మహమూద్ మదానీ
13. మౌలానా సయ్యద్ అర్షద్ మదానీ
14. డాక్టర్ బహౌద్దీన్ ముహమ్మద్ జమాలుద్దీన్ నద్వీ
15. డాక్టర్ జాకీర్ అబ్దుల్ కరీం నాయక్
16. ముఫ్తీ అబుల్ ఖాసిం నాయక్
18. అస్లీ నొమానీ
17. ఒవైసీ
19. అజీమ్ ప్రేమ్ జీ
20. మౌలానా బద్రుద్దీన్ అజ్మల్
21. ఎ.ఆర్. రెహమాన్
22. సయ్యద్నా ముఫద్దల్ సైఫుద్దీన్

తొలిస్థానంలో ఉన్నది వీరే..

ప్రపంచంలో టాప్ -500 అత్యంత ప్రభావవంతమైన ముస్లిం జాబితాను జోర్డాన్ సంస్థ అయిన రాయల్ ఇస్లామిక్ స్ట్రాటజిక్ స్టడీస్ సెంటర్ ప్రచురిస్తుంది. దీనిని 2009లో ప్రారంభించగా, 2027 సంచిక దీని 18వ వార్షిక సంచిక. ఈ సంవత్సరం నివేదికలో 82 దేశాల నుండి 509 పేర్లు ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన ముస్లింల జాబితాలో పాకిస్తాన్ ప్రధాని షాహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ మొదటిస్థానంలో నిలిచారు. సౌదీ అరేబియా రాజు సల్మాన్, యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌లతో కలిసి వారు ఈ అగ్రస్థానాన్ని పంచుకున్నారు .


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

സൗദി അറേബ്യയിലേക്കുള്ള വിമാന സര്‍വീസുകള്‍ റദ്ദാക്കി ഇന്‍ഡിഗോ; യാത്രക്കാരുടെയും ജീവനക്കാരുടെയും സുരക്ഷയ്ക്ക് മുന്‍ഗണന

ന്യൂദല്‍ഹി: സുരക്ഷാ സാഹചര്യം കണക്കിലെടുത്ത് സൗദി അറേബ്യയിലെ നാല് പ്രധാന നഗരങ്ങളിലേക്കുള്ള...

திருப்பரங்குன்றம்: அதிரடி வாதங்களும் ஆட்சியர் தரப்பின் தடுமாற்றமும்! – நீதிமன்றத்தில் என்ன நடந்தது?

மதுரை திருப்பரங்குன்றம் மலை உச்சியில் கார்த்திகை தீபம் ஏற்றுவது தொடர்பான வழக்கு...

OTR: కౌశిక్‌పై ఫిర్యాదు.. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలన్న స్పీకర్!

OTR: తెలంగాణ అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ ఏమైంది..? మొదట్లో వరుస సమావేశాలు...

വിദ്വേഷ രാഷ്ട്രീയം തള്ളിക്കളയണം; യു.എസിലെ ഹിന്ദു ക്ഷേത്രങ്ങൾക്കു നേരെയുള്ള ആക്രമണങ്ങളിൽ ആശങ്കയറിയിച്ച് സൊഹ്‌റാൻ മംദാനി

ന്യൂയോർക്ക്: അമേരിക്കയിൽ അടുത്ത മാസങ്ങളിലായി ഹിന്ദു ക്ഷേത്രങ്ങൾക്കു നേരെയുണ്ടാകുന്ന ആക്രമണങ്ങളിലും രാഷ്ട്രീയ...