13
November, 2026

A News 365Times Venture

13
Friday
November, 2026

A News 365Times Venture

CM Revanth: మూడు టిమ్స్ ఆసుపత్రులకు ఒకే రిక్రూట్‌మెంట్ విధానం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

Date:

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య సేవలను మరింత బలోపేతం చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ, నూతన ఆసుపత్రుల నిర్మాణం, వైద్యుల నియామకాలపై అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని మూడు టిమ్స్ ఆసుపత్రులకు ఒకే రిక్రూట్‌మెంట్ విధానం అమలు చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఉద్యోగుల బదిలీలు ఈ మూడు టిమ్స్ ఆసుపత్రుల మధ్యే జరిగేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. ఆసుపత్రులలో హౌజ్ కీపింగ్ బాధ్యతలను పూర్తిగా అవుట్ సోర్సింగ్‌కు అప్పగించాలని, తద్వారా వైద్యులు కేవలం చికిత్సలపైనే పూర్తి దృష్టి సారించేలా చూడాలని సూచించారు. హాస్పిటల్ నిర్వహణ అత్యంత కీలకమని, వైద్యులు, సిబ్బంది హాజరు విషయంలో ఆధునిక సాంకేతికతను వినియోగించాలని ఆదేశించారు.

నిమ్స్ – సనత్ నగర్ టిమ్స్ మధ్య సమన్వయం..
నిమ్స్ ఆసుపత్రిలో పడకలు ఖాళీ లేని పక్షంలో రోగులను వెంటనే సనత్ నగర్ టిమ్స్‌కు తరలించాలని, ఇందుకోసం నిమ్స్, టిమ్స్ మధ్య పటిష్టమైన సమన్వయం ఉండాలని తెలిపారు. సనత్ నగర్ టిమ్స్‌లో శాశ్వత డాక్టర్ల నియామకం పూర్తయ్యేంత వరకు, రోగులకు ఇబ్బంది కలగకుండా బయట నుంచి వైద్యులను నియమించుకోవాలని ఆదేశించారు.

వచ్చే జూన్ 2 నాటికి రాష్ట్రంలోని అన్ని టిమ్స్ ఆసుపత్రులు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రావాల్సిందేనని సీఎం తేల్చి చెప్పారు. అలాగే, ఈ డిసెంబర్ నాటికి నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం పూర్తి కావాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. టిమ్స్ ఆసుపత్రులతో పాటు ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనంగా అవసరమైన నిధులను మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

മുഖ്യ മന്ത്രിക്കും മന്ത്രിമാര്‍ക്കും പുതിയ കാറുകള്‍; 9.60 കോടിയുടെ 24 ഇന്നോവകള്‍ വാങ്ങാന്‍ സര്‍ക്കാര്‍

തിരുവന്തപുരം: മുഖ്യ മന്ത്രിക്കും മന്ത്രിമാര്‍ക്കും പുതിയ കാറുകള്‍ വാങ്ങാന്‍ വി.ഡി. സതീശന്‍...

"மேக்கேதாட்டு அணை கட்ட சட்ட ரீதியாக உதவுங்கள்" – மோடியிடம் உதவி கேட்ட DK சிவகுமார்

மேக்கேதாட்டு அணை கட்டுவதை மிகத் தீவிரமாக முன்னெடுத்து வருகிறார் கர்நாடகா முதலமைச்சர்...

Iran Crisis: కిడ్నీ నుంచి వృషణాల వరకు.. శరీర అవయవాలను అమ్ముకుంటున్న ఇరాన్ ప్రజలు!

Iran Crisis: ఇరాన్ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. అమెరికాతో యుద్ధం, అంతర్జాతీయ...

യു.ഡി.എഫ് സർക്കാരിനെ നയിക്കുന്നത് നെഹ്‌റുവിന്റെ ആശയങ്ങളല്ല, ഗീബൽസിന്റെ നുണപ്രചാരണ തന്ത്രങ്ങൾ: പിണറായി വിജയൻ

കാലടി: കാലടി സംസ്കൃത സർവകലാശാലയിലെ വിദ്യാർത്ഥി സമരത്തിന് പൂർണ പിന്തുണ പ്രഖ്യാപിച്ച്...