13
November, 2026

A News 365Times Venture

13
Friday
November, 2026

A News 365Times Venture

Kareena Kapoor: కరీనా లాకెట్‌పై ఖురాన్ వచనాలు.. కాంగ్రెస్ నేత లీగల్ నోటీసులు!

Date:

Kareena Kapoor: బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ వివాదంలో చిక్కుకున్నారు. ఆమె ధరించిన ఓ రాజవంశ ఆభరణం వివాదానికి దారితీసింది. దీపావళి సందర్భంగా ఆమె ధరించిన 30 క్యారెట్ల పచ్చ లాకెట్టుపై పవిత్ర ఖురాన్‌లోని ‘ఆయత్ అల్-కుర్సీ’ వచనం చెక్కి ఉండటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ మీడియా కోఆర్డినేటర్ అబ్బాస్ హఫీజ్ కరీనా కపూర్, ఆమె స్టైలిస్ట్ రియా కపూర్‌లకు లీగల్ నోలీసులు పంపించారు.

దీపావళి సందర్భంగా కరీనా కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన ఫోటో వివాదానికి కారణమైంది. ఆమె ధరించిన 30 క్యారెట్ల పచ్చ లాకెట్‌పై ఖురాన్‌లోని ఆయత్ అల్ కుర్సీ వచనం చెక్కి ఉందని, కరీనా ధరించిన ఆభరణాలు దాదాపు 200 ఏళ్ల చరిత్ర కలిగినవని ఆమె స్టైలిస్ట్ రికా కపూర్ పేర్కొన్నారు. ఈ ఆభరణాలు భోపాల్ రాజకుటుంబ వారసత్వ సంపదగా, సైఫ్ అలీ ఖాన్ కుటుంబం ద్వారా కరీనాకు చేరినవిగా రియా వివరించారు.

అయితే, లాకెట్‌ ఫోటోలు, వీడియోలు, సోషల్ మీడియా పోస్టులపై కాంగ్రెస్ నేత అబ్బాస్ హఫీజ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సంబంధిత ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించాలని, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నోటీసులో కోరారు. పవిత్ర ఖురాన్ వచనం చెక్కిన ఆభరణాన్ని మతపరమైన గౌరవానికి భంగం కలిగించే విధంగా ప్రదర్శించబోమని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లాకెట్ను సోషల్ మీడియాలో ప్రదర్శించిన తీరు ముస్లిం సమాజంలోని కొంతమంది సభ్యులతో పాటు భోపాల్ పూర్వ రాజకుటుంబ సంప్రదాయాలకు సంబంధించిన వారి మనోభావాలను దెబ్బతీసిందని అబ్బాస్ హఫీజ్ తన నోటీసులో ఆరోపించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഛത് പൂജയ്ക്കായി ശുദ്ധജലം നിറച്ച് കൃത്രിമ കുളങ്ങള്‍: യമുന ശുദ്ധീകരണം എവിടെയെത്തിയെന്ന് ചോദ്യമുയരുന്നു

ന്യൂദല്‍ഹി: നവംബര്‍ 13 മുതല്‍ 16 വരെ ഉത്തരേന്ത്യയില്‍ ആചരിക്കുന്ന ഛത്...

ஆந்திராவைப் பின்னுக்குத் தள்ளி ரூ.2000 கோடி முதலீடு; அள்ளிய தமிழகம்; சந்திரபாபுவின் புது ரூட் என்ன?

தமிழ்நாட்டிற்கு வரும் முதலீடுகள் ஆந்திரப் பிரதேசத்திற்கு ரூட் மாறுகின்றன என்கிற குற்றச்சாட்டு...

വിമര്‍ശനങ്ങളെയും ജനകീയ സമരങ്ങളെയും അധികാരം ഉപയോഗിച്ച അടിച്ചമര്‍ത്താമെന്നത് സര്‍ക്കാരിന്റെ വ്യാമോഹം മാത്രം: പിണറായി

തിരുവനന്തപുരം: വിമര്‍ശനങ്ങളെയും ജനകീയ സമരങ്ങളെയും അധികാരം ഉപയോഗിച്ച് അടിച്ചമര്‍ത്താമെന്നത് യു.ഡി.എഫ് സര്‍ക്കാരിന്റെ...

மோகன் (எ) சிங்கம்! – கடல் முழுங்கிய காசிமேட்டு மீனவரின் கதை

ஆந்திராவில் கரையைக் கடந்த முரசு புயலின் சூறாவளிக் காற்றுக்கு 9 மீனவர்களை...