12
November, 2026

A News 365Times Venture

12
Thursday
November, 2026

A News 365Times Venture

Team India Squad: నవంబర్ 30 నుంచి ఇంగ్లాండ్‌తో సమరం.. జట్టు ప్రకటన..

Date:

ఇంగ్లాండ్ ‘ఏ’ మహిళా జట్టుతో జరగనున్న సిరీస్ కోసం భారత సెలక్టర్లు ఇండియా ‘ఏ’ మహిళా జట్లను ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక పర్యటన నవంబర్ 30 నుంచి పూణే వేదికగా ప్రారంభమై, డిసెంబర్ చివరి వరకు ముంబైలో కొనసాగనుంది. ఈ పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య టీ20, వన్డేలతో పాటు రెడ్ బాల్ (మల్టీ-డే) ఫార్మాట్ మ్యాచ్‌లు కూడా జరగనున్నాయి. ఈ సిరీస్ కోసం ప్రకటించిన జట్లలో పలువురు యువ ఆటగాళ్లతో పాటు అనుభవజ్ఞులకు కూడా చోటు దక్కింది. పరిమిత ఓవర్ల సిరీస్‌లో (టీ20, వన్డేలు) బ్యాటర్ అనుష్కా శర్మ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, ఆల్ రౌండర్ మిన్ను మణి వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇక మల్టీ-డే (రెడ్ బాల్) మ్యాచ్‌కు మిన్ను మణి కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, తేజల్ హసబ్నిస్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు.

ఈ సిరీస్ ద్వారా పలువురు కీలక ఆటగాళ్లు రీఎంట్రీ ఇస్తున్నారు. ఆల్ రౌండర్ శ్రేయాంక పాటిల్ ఆసియా క్రీడల తర్వాత మళ్లీ జాతీయ జట్టులోకి రాగా, ఆమెతో పాటు మీను మణి, శిప్రా గిరి, తనీషా సింగ్, సాయిమ ఠాకోర్ మూడు ఫార్మాట్లకూ ఎంపికయ్యారు. అలాగే గాయం కారణంగా కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్న ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్  గౌతమ్ ‘సీనియర్ విమెన్స్ టీ20 ట్రోఫీ’ ద్వారా పునరాగమనం చేసి, వైట్-బాల్ జట్లలో చోటు దక్కించుకున్నారు.

షెడ్యూల్ విషయానికి వస్తే, నవంబర్ 30న పూణేలో తొలి టీ20 మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమవుతుంది. డిసెంబర్ 3, 5 తేదీల్లో జరిగే తర్వాతి రెండు టీ20లు సాయంత్రం 6 గంటలకు మొదలవుతాయి. ఆ తర్వాత ముంబైలోని వాంఖడే స్టేడియంలో డిసెంబర్ 8, 11, 14 తేదీల్లో మూడు వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి వన్డే ఉదయం 9 గంటలకు, మిగతా రెండు మ్యాచ్‌లు మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతాయి. అలాగే డిసెంబర్ 19 నుంచి వాంఖడే వేదికగానే మల్టీ-డే రెడ్ బాల్ మ్యాచ్ ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సిరీస్ యువ మహిళా క్రికెటర్లకు అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుకోవడానికి చక్కటి వేదికగా నిలనుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

സര്‍വകലാശാലകളെ കാവിവത്കരിക്കാന്‍ ബി.ജെ.പി ഗവര്‍ണറെ ഉപയോഗിക്കുന്നു; ആര്‍.എസ്.എസിന് സര്‍ക്കാര്‍ കൂട്ടെന്ന് പി.എസ്. സഞ്ജീവ്

തിരുവനന്തപുരം: കേരളത്തിലെ സര്‍വകലാശാലകളെ കാവിവത്കരിക്കാന്‍ ബി.ജെ.പി ഗവര്‍ണറെ ഉപയോഗിക്കുകയാണെന്ന് എസ്.എഫ്.ഐ സംസ്ഥാന...

"என்றைக்காவது ஒருநாள் தமிழகத்தில் காமராஜர் ஆட்சியைக் கொண்டு வரணும்" – திருநாவுக்கரசர் நம்பிக்கை

புதுக்கோட்டையில் கட்சி நிகழ்ச்சி ஒன்றில் கலந்துகொண்டு பேசிய காங்கிரஸ் மூத்த தலைவர்...

ഹെഗ്സെത്തിന്റെ ഇംപീച്ച്മെന്റ് നീക്കം അട്ടിമറിച്ചത് 11 ഡെമോക്രാറ്റുകള്‍; പണം വാങ്ങി മുങ്ങിയതോ?

തെരഞ്ഞെടുപ്പ് ഫണ്ടിങ്ങും അമേരിക്കന്‍ രാഷ്ട്രീയത്തിലെ ലോബിയിങ് സ്വാധീനവും വീണ്ടും ചര്‍ച്ചയാകുമ്പോള്‍, ഹെഗ്സെത്തിന്റെ...