2
November, 2026

A News 365Times Venture

2
Monday
November, 2026

A News 365Times Venture

Pune: కొడుకుతో సహా 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మరో పెళ్లి చేసుకోవాలని లేఖ!

Date:

Pune:  మహారాష్ట్ర పూణేలో విషాదం చోటుచేసుకుంది. పింప్రి-చించ్వాడ్‌లోని ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్ 18వ అంతస్తు నుంచి 33 ఏళ్ల మహిళ తన 6 ఏళ్ల కుమారుడితో దూకి ఆత్మహత్య చేసకుంది. ఈ ఘటన శుక్రవారం జరిగింది. మహిళ ఇంట్లో పోలీసులు 8 పేజీల లేఖ స్వాధీనం చేసుకున్నారు. మృతురాలని ఏక్తా బంగాడ్‌గా గుర్తించారు. ఆమె భర్త మనోజ్ బంగాడ్ పుణెలోని ఓ ఐటీ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఆరేళ్ల కుమారుడు మాధవ్ ఉన్నాడు. ఈ కుటుంబం పింప్రి-చించ్వాడ్‌లోని సిగ్నేచర్ పార్క్‌లో నివాసం ఉంటోంది. శుక్రవారం సాయంత్రం సుమారు 6.30 గంటలకు ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ముందుగా ఏక్తా భవనంలోని 18వ అంతస్తుకు తన కుమారుడిని తీసుకెళ్లి, అక్కడి కారిడార్ నుంచి డక్ట్‌లోకి దూకినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటన తర్వాత తల్లీబిడ్డ మరణించినట్లు గుర్తించారు.

భర్త మళ్లీ పెళ్లి చేసుకోవాలని లేఖ..

ఈ కేసులో ఏక్తా రాసినట్లు భావిస్తున్న లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో తన భర్త పట్ల ఉన్న భావాలను వ్యక్తం చేయడంతో పాటు, తన మరణం తర్వాత భర్త మరో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కోరినట్లు తెలుస్తోంది. తాను లేకపోతే, తన కుమారుడు తన గురించి పదేపదే అడిగితే భర్తకు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో అనే భయాన్ని ఆమె లేఖలో వ్యక్తపరించింది. అందుకు తనతో పాటే తన కుమారుడిని కూడా తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు లేఖలో పేర్కొంది. పిల్లవాడు ఉంటే మళ్లీ పెళ్లికి కష్టమవుతుందని రాసినట్లు సమాచారం.

కొన్నేళ్లుగా వెన్నుముక సమస్యతో బాధపడుతున్న ఏక్తా..

ప్రాథమిక నివేదికల ప్రకారం.. కొన్నేళ్లుగా ఏక్తా వెన్నెముక సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఆమె దీని కోసం వివిధ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటోంది. అయితే, ఎన్నో ఆస్పత్రులకు వెళ్లినప్పటికీ ఈ సమస్యకు పరిష్కారం లభించలేదు. తన దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల్ని కూడా ఏక్తా సూసైడ్ నోట్‌లో ప్రస్తావించింది. ఈ ఘటనపై వాకడ్ పోలీస్ స్టేషన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిని యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్‌గా నమోదు చేశారు.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

കാലടി സര്‍വകലാശാലയിലെ സമരം; വിദ്യാര്‍ത്ഥികളെ പരീക്ഷ എഴുതിക്കണമെന്ന ഹൈക്കോടതി ഉത്തരവിനെതിരെ അപ്പീലുമായി വൈസ് ചാന്‍സലര്‍

തിരുവനന്തപുരം: കാലടി സംസ്‌കൃത സര്‍വകലാശാലയില്‍ സസ്‌പെന്‍ഷന്‍ നടപടി നേരിട്ട വിദ്യാര്‍ത്ഥികള്‍ക്ക് പരീക്ഷ...

பெருந்துறை: அரசு நலத்திட்ட உதவிகளை வழங்க ஜெயக்குமார் யார்? ஆதரவு அமைச்சர்களால் சிக்கலில் அதிகாரிகள்!

2026 தமிழ்நாடு சட்டமன்றப் பொதுத்தேர்தலில் ஈரோடு மாவட்டம் பெருந்துறை சட்டமன்றத் தொகுதியில்...

സിദ്ധരാമയ്യ സ്റ്റിങ് ക്യാമറ ഓപ്പറേഷന്‍ വിവാദം: ഉപയോഗിച്ച ഫോണ്‍ കൈമാറിയത് കേന്ദ്രമന്ത്രിയുടെ വസതിയില്‍ വെച്ചാണെന്ന് റിപ്പോര്‍ട്ട്

ന്യൂദല്‍ഹി: കര്‍ണാടക മുന്‍ മുഖ്യമന്ത്രി സിദ്ധരാമയ്യയ്‌ക്കെതിരെ സ്റ്റിങ് ഓപ്പറേഷന്‍ നടത്താന്‍ ഉപയോഗിച്ച...

“தமிழ்நாட்டுக்கென தனிக்கொடி" – அமைச்சர் ஆதவ் அர்ஜுனா பேசியது என்ன?

இந்தியாவில் உள்ள பல்வேறு மாநிலங்களைப் போல, தமிழை முதன்மைப்படுத்தி தமிழ்நாட்டிற்கும் ஒரு...