22
October, 2026

A News 365Times Venture

22
Thursday
October, 2026

A News 365Times Venture

AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!

Date:

AP Local Elections: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నామినేషన్ల దాఖలు విషయంలో తలెత్తిన వివాదాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25 వరకు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించకుండా నిలిపివేయాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులను పూర్తిగా పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పలుచోట్ల తమ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీసు యంత్రాంగానికి పలు ఆదేశాలు ఇచ్చింది. నామినేషన్లు దాఖలు చేయలేకపోయినట్లు ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాలకు సంబంధించిన పత్రాలు, ఎలక్ట్రానిక్ ఆధారాలను పరిశీలించాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆయా ప్రాంతాల్లో నామినేషన్ల గడువు పొడిగించాలా లేదా అనే అంశంపై ఈ నెల 22లోగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. గడువు పొడిగించాలని నిర్ణయిస్తే అభ్యర్థులకు కనీసం 48 గంటల అదనపు సమయం ఇవ్వాలని పేర్కొంది.

అవసరమైన ప్రాంతాల్లో కలెక్టరేట్ల వద్ద కూడా నామినేషన్లు స్వీకరించేందుకు అదనపు ఏర్పాట్లు చేయాలని సూచించింది. నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు సీసీటీవీ నిఘా, వీడియో రికార్డింగ్ ద్వారా అభ్యర్థులకు రక్షణ కల్పించాలని ఆదేశించింది. ఈ వ్యవహారంలో పిడుగురాళ్ల, గురజాల, దర్శి, పుంగనూరు, మైదుకూరు, కమలాపురం, ఎర్రగుంట్ల, రాయచోటి, దాచేపల్లి, గుత్తి, రాజంపేట, పులివెందుల, బద్వేల్, ప్రొద్దుటూరు, కనిగిరి, తాడిపత్రి, జమ్మలమడుగు మున్సిపాలిటీలతో పాటు వైఎస్సార్ కడప, తిరుపతి కార్పొరేషన్లు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

മോദി സര്‍ക്കാരിന്റേത് ഹിറ്റ്‌ലറുടേത് പോലുള്ള ഭരണം: ഖാര്‍ഗെ

കലബുറഗി: നരേന്ദ്ര മോദിയുടെ നേതൃത്വത്തിലുള്ള എന്‍.ഡി.എ സര്‍ക്കാര്‍ ഹിറ്റ്‌ലറുടെ ഭരണത്തിന് സമാനമാണെന്ന്...

புதுச்சேரி கைலாசா ஆசிரமத்தில் பாஜக உள்துறை அமைச்சர் – வீடியோ மூலம் நித்தியானந்தா வரவேற்ற பின்னணி!

திருவண்ணாமலையைப் பூர்வீகமாகக் கொண்ட நித்தியானந்தாவுக்கு இந்தியாவிலும், அயல் நாடுகளிலும் பல்வேறு ஆசிரமங்கள்...

നിര്‍ഭയത്വത്തിന്റെ മുഖങ്ങള്‍; ഗ്യാനേഷ് മസ്റ്റ് ഗോ എന്ന് മുദ്രാവാക്യം വിളിച്ച് സൗരവും അശുതോഷും; ചിത്രങ്ങള്‍ പങ്കുവെച്ച് ദീപ്‌കെ

ന്യൂദല്‍ഹി: സി.ജെ.പി സഹ കണ്‍വീനര്‍മാരായ സൗരവ് ദാസിനെയും അശുതോഷ് രങ്കയെയും കസ്റ്റഡിയില്‍...