22
October, 2026

A News 365Times Venture

22
Thursday
October, 2026

A News 365Times Venture

PM Modi: ‘దేశమే ప్రథమం’.. దేశ శత్రువులను గుర్తించి ఓడించాలి.. విజయదశమి వేళ ప్రధాని మోదీ పిలుపు.!

Date:

PM Modi Vijayadashami Speech: దేశ గౌరవానికి భంగం కలిగించే శక్తులు, సమాజాన్ని విభజించే వ్యక్తులు, భారతీయ సంస్కృతిని ద్వేషించే మనస్తత్వం కలిగిన వారే దేశ శత్రువులని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారతమాత శత్రువులను గుర్తించి వారిని ఓడించాలని, ‘దేశమే ప్రథమం’ అనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విజయదశమి సందర్భంగా ఢిల్లీలోని ఐపీ ఎక్స్‌టెన్షన్‌లో నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

‘సియావర్ రామచంద్ర కీ జై’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ.. భారతీయ సంస్కృతి, మన పూర్వీకులు వేల సంవత్సరాలుగా శ్రీరాముడిని ఆరాధిస్తున్నారని చెప్పారు. రావణుడిని సంహరించినందుకు మాత్రమే కాకుండా మానవాళికి అమూల్యమైన ఆదర్శాలను అందించినందుకు శ్రీరాముడిని పూజిస్తున్నామని పేర్కొన్నారు. శ్రీరాముడు తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ సత్యం, ధర్మం మార్గాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదని ప్రధాని అన్నారు. రాజ్యాధికారం దక్కుతుందన్న ఆనందం కానీ, వనవాసానికి వెళ్లాల్సి వచ్చిందన్న బాధ కానీ ఆయనను ప్రభావితం చేయలేదన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మాన్ని పాటిస్తూ సత్యాన్ని నిలబెట్టారని చెప్పారు. వనవాసం అనంతరం అయోధ్యకు తిరిగివచ్చిన శ్రీరాముడు ఏర్పాటు చేసిన ‘రామరాజ్యం’ నేటికీ సుపరిపాలనకు ప్రమాణంగా నిలుస్తోందని మోదీ పేర్కొన్నారు. ఎవరి పట్ల వివక్ష లేకుండా అందరికీ న్యాయం, సమాన అవకాశాలు లభించడం, అధికారానికి ప్రజలపై పాలించడం కాకుండా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఉండటమే రామరాజ్యమని వివరించారు.

ఈ సందర్భంగా గోస్వామి తులసీదాస్ చెప్పిన మాటలను ప్రధాని గుర్తుచేశారు. ప్రజలను జనార్దనులుగా భావిస్తూ ‘నాగరిక దేవో భవః’ అనే మంత్రంతో ముందుకు సాగాలని అన్నారు. పేదలు, అణగారిన వర్గాల సేవకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. శ్రీరాముడి జీవితం నుంచి మరో ముఖ్యమైన పాఠం నేర్చుకోవాలని మోదీ పేర్కొన్నారు. సంక్షోభం ఎంత పెద్దదైనా, సవాలు ఎంత కఠినమైనదైనా ఇతరులపై ఆధారపడి ఉండకుండా మన సామర్థ్యాన్ని గుర్తించాలని చెప్పారు. మన వనరులపై విశ్వాసం ఉంచి, సంకల్పాన్ని శక్తిగా మార్చుకుని కృషితో పరిష్కారాలను కనుగొనాలని సూచించారు. సముద్రం అడ్డుగా ఉన్నా, లంక దూరంగా ఉన్నా శ్రీరాముడి సంకల్పం చెక్కుచెదరలేదని ప్రధాని అన్నారు. ప్రజల సమష్టి శక్తిని కూడగట్టి, అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని అసాధ్యంగా కనిపించిన లక్ష్యాన్ని సాధ్యం చేశారని చెప్పారు. సొంత శక్తిపై విశ్వాసం, సామర్థ్యంపై నమ్మకం, వనరుల సరైన వినియోగం, లక్ష్యం పట్ల అచంచల సంకల్పమే విజయానికి మూలమంత్రమని పేర్కొన్నారు.

దేశం ముందు ‘వికసిత్ భారత్’, ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాలు ఉన్నాయని మోదీ చెప్పారు. ప్రజాశక్తితో ప్రజా సంక్షేమాన్ని సాధిస్తూ ప్రతి పౌరుడి ఆకాంక్షలను నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ప్రయోజనాల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు. దేశ గౌరవాన్ని దెబ్బతీసే శక్తులు, సమాజాన్ని విభజించే వ్యక్తులు, భారతీయ సంస్కృతిని ద్వేషించే మనస్తత్వం దేశానికి శత్రువులని ప్రధాని పేర్కొన్నారు. అలాంటి శక్తులను ఎదుర్కోవడానికి దేశ ప్రజలంతా కలిసికట్టుగా ముందుకు సాగాలని అన్నారు. విజయదశమి సందర్భంగా దేశ ప్రజలు తమ సంకల్పాన్ని మరోసారి పునరుద్ఘాటించాలని మోదీ పిలుపునిచ్చారు. భారతమాత శత్రువులను గుర్తించి వారిని ఓడించాలని, ‘రాష్ట్ర ప్రథమ్’ సంకల్పంతో అందరూ ఐక్యంగా ముందుకు రావాలని అన్నారు. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ సమయంలో చేసిన ‘రాముడి నుంచి రాష్ట్రం.. దేవుడి నుంచి దేశం’ అనే సంకల్పాన్ని తప్పకుండా సాకారం చేస్తామని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

മോദി സര്‍ക്കാരിന്റേത് ഹിറ്റ്‌ലറുടേത് പോലുള്ള ഭരണം: ഖാര്‍ഗെ

കലബുറഗി: നരേന്ദ്ര മോദിയുടെ നേതൃത്വത്തിലുള്ള എന്‍.ഡി.എ സര്‍ക്കാര്‍ ഹിറ്റ്‌ലറുടെ ഭരണത്തിന് സമാനമാണെന്ന്...

புதுச்சேரி கைலாசா ஆசிரமத்தில் பாஜக உள்துறை அமைச்சர் – வீடியோ மூலம் நித்தியானந்தா வரவேற்ற பின்னணி!

திருவண்ணாமலையைப் பூர்வீகமாகக் கொண்ட நித்தியானந்தாவுக்கு இந்தியாவிலும், அயல் நாடுகளிலும் பல்வேறு ஆசிரமங்கள்...

നിര്‍ഭയത്വത്തിന്റെ മുഖങ്ങള്‍; ഗ്യാനേഷ് മസ്റ്റ് ഗോ എന്ന് മുദ്രാവാക്യം വിളിച്ച് സൗരവും അശുതോഷും; ചിത്രങ്ങള്‍ പങ്കുവെച്ച് ദീപ്‌കെ

ന്യൂദല്‍ഹി: സി.ജെ.പി സഹ കണ്‍വീനര്‍മാരായ സൗരവ് ദാസിനെയും അശുതോഷ് രങ്കയെയും കസ്റ്റഡിയില്‍...