18
October, 2026

A News 365Times Venture

18
Sunday
October, 2026

A News 365Times Venture

Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..

Date:

Kiren Rijiju: ‘‘రెజిమ్ ఛేంజ్(ప్రభుత్వ మార్పు)’’కోసం పిలుపునిస్తున్న వారికి కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు ఘాటు సమాధానం ఇచ్చారు. ఎక్స్ వేదికగా.. ‘‘ప్రభుత్వ మార్పు కోసం పిలుపునిచ్చేవారు వచ్చేశారు. జాగ్రత్తగా వినండి..భారత్ బంగ్లాదేశ్ కాదు’’ అని పోస్ట్ చేశారు. భారతదేశ యువత దేశాన్ని నిర్మిస్తుందే తప్ప నాశనం చేయదని వ్యాఖ్యానించారు. నేహా బోరా, ప్రశాంత్ భూషణ్, కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ప్రభుత్వ మార్పుపై వ్యాఖ్యలు చేసిన తరుణంలో రిజిజు తీవ్రంగా స్పందించారు.

భారతదేశ యువత మూర్ఖులు కాదని, వారు దేశ నిర్మాణంలో భాగస్వాములు అవుతున్నారని, పతకాలు సాధించడం, స్కిల్స్ పెంపొందించుకోవడం, ఆవిష్కరణలు, స్టార్టప్స్, సాంకేతిక రంగాల్లో ముందుకు సాగడం ద్వారా యువత దేశానికి సేవ చేస్తోందని కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు.

అంతకుముందు, ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) అధ్యక్షురాలు నేహా బోరా మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో జరిగిన విద్యార్థుల ఉద్యమం తమకు స్పూర్తినిచ్చిందని అనడం వివాదంగా మారింది. సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషన్ కూడా ‘‘పాలన మార్పు’’ కోసం తాము పోరాడుతున్నామని చెప్పారు. కాంగ్రెస్ నేత పవన్ ఖేరా మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఓడించి పాలన మార్చడమే కాంగ్రెస్ లక్ష్యమని అన్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ജീവിതച്ചെലവ് കുതിച്ചുയരുന്നു: തൊഴിലാളി യൂണിയനുകളുമായി ചേർന്ന് പോർച്ചുഗലിൽ ആയിരങ്ങൾ തെരുവിൽ

ലിസ്ബൺ: യൂറോപ്പിൽ സാമ്പത്തിക പ്രതിസന്ധിയും വിലക്കയറ്റവും രൂക്ഷമാകുന്നതിനിടെ, പോർച്ചുഗലിൽ തൊഴിലാളി യൂണിയനുകളുമായി...

திடீர்னு போலீஸ் கைது பண்ணிட்டாங்கன்னா… உங்களுக்கான 5 முக்கிய உரிமைகள் இதோ! சட்டம் சொல்வது என்ன?- 3

திடீர்னு போலீஸ் வந்து உங்களைக் கைது பண்ணிட்டாங்கன்னு வச்சுப்போம்... அந்த நேரத்துல...

കോഴിയെ പോറ്റാന്‍ കുറുക്കനെ ഏല്പിച്ചു; മായിന്‍ ഹാജിയെ വഖഫ് ബോര്‍ഡ് ചെയര്‍മാനാക്കിയതിനെതിരെ നാഷനല്‍ ലീഗ്

കോഴിക്കോട്: സംസ്ഥാന വഖഫ് ബോര്‍ഡ് പുനസംഘടിപ്പിച്ചതില്‍ വിമര്‍ശനവുമായി നാഷനല്‍ ലീഗ്. മുസ്‌ലിം...

புதுச்சேரி: "ஏரியில் வீட்டைக் கட்டிவிட்டு…" – மக்களின் மழைப் புகாருக்குச் சீறிய MLA ஜோஸ் சார்லஸ்

தென்கிழக்குப் பருவமழை தொடங்கிவிட்டதால் தமிழகத்தில் பல மாவட்டங்களுக்கு ஆரஞ்ச் அலர்ட் விடப்பட்டிருக்கிறது....