17
October, 2026

A News 365Times Venture

17
Saturday
October, 2026

A News 365Times Venture

Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?

Date:

Minister Rekha Arya Files FIR Against Husband: ఉత్తరాఖండ్ కేబినెట్‌ మంత్రి రేఖా ఆర్య తన భర్త గిర్ధారి లాల్ సాహుపై తీవ్ర ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. తనకు, తన పిల్లలకు ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.. ఈ వ్యవహారంపై ఆమె ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించడంతో పాటు, తన వాదనలను వివరిస్తూ కన్నీళ్లతో కూడిన వీడియోను కూడా విడుదల చేశారు.

భర్తపై తీవ్ర ఆరోపణలు
ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, తమ వివాహ సమయంలో తన భర్త గత వివాహం గురించి తనకు తెలియకుండా దాచిపెట్టారని రేఖా ఆర్య ఆరోపించారు. ఇతర మహిళలతో సంబంధాలు పెట్టుకున్నారని, తనను శారీరకంగా, మానసికంగా వేధించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.. అంతేకాకుండా, తనను చంపేస్తానని బెదిరించడంతో పాటు కులపరమైన దూషణలకు పాల్పడ్డారని కూడా ఆరోపించారు.

ఆడియో రికార్డింగ్‌తో ఆందోళన
ఈ వివాదంలో ఒక ఆడియో రికార్డింగ్‌ కీలకంగా మారిందని రేఖా ఆర్య పేర్కొన్నారు.. తనను, తన పిల్లలను లక్ష్యంగా చేసుకుని కుట్ర పన్నినట్లు ఆ రికార్డింగ్‌ ద్వారా తెలిసిందని ఆమె ఆరోపించారు.. ఆడియో విన్న తర్వాత తన కుటుంబ భద్రతపై ఆందోళన పెరిగిందని, అందుకే పోలీసులను ఆశ్రయించినట్టు పేర్కొన్నారు..

సంతకం ఫోర్జరీ చేశారన్న ఆరోపణ
తనను ఒక కంపెనీ డైరెక్టర్‌ పదవి నుంచి తొలగించేందుకు భర్త తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని కూడా రేఖా ఆర్య ఆరోపించారు. ఈ వ్యవహారంలో తనకు అన్యాయం జరిగిందని ఆమె చెబుతున్నారు.. ఈ ఆరోపణలు వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదంతో పాటు, కంపెనీ వ్యవహారాలపైనా ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.

మహిళలకు రేఖా ఆర్య విజ్ఞప్తి
తన ఆరోపణలపై వివరణ ఇస్తూ రేఖా ఆర్య విడుదల చేసిన వీడియోలో భావోద్వేగానికి గురయ్యారు.. తనకు, తన పిల్లలకు భద్రత కల్పించుకోవాలనే ఉద్దేశంతోనే పోలీసులను ఆశ్రయించినట్లు ఆమె చెప్పారు.. గృహ హింస, వేధింపులను మహిళలు మౌనంగా భరించవద్దని, అవసరమైనప్పుడు తమ సమస్యలను బయటపెట్టి న్యాయ సహాయం తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.. భయం లేదా ఒత్తిడి కారణంగా మహిళలు అన్యాయాన్ని సహించాల్సిన అవసరం లేదని, తమ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని రేఖా ఆర్య సూచించారు..

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

അഭിജിത് ദീപ്‌കെയുടെ അറസ്റ്റ്; വാദം കേള്‍ക്കല്‍ മനപൂര്‍വം വൈകിപ്പിച്ചതായി രത്‌ന സിങ്

ന്യൂദല്‍ഹി: അഭിജിത് ദീപ്‌കെയുടെ അറസ്റ്റില്‍ കോടതി വാദം കേള്‍പ്പിക്കുന്നത് മനപ്പൂര്‍വം വൈകിപ്പിക്കുന്നതായി...

'அனுமதியின்றி அதிகாலை காட்சிகள்; விதிகளை மீறும் தியேட்டர்கள்!' – கண்டுகொள்ளாத தவெக அரசு?

தமிழகத்தில் புதிய படம் வெளியான முதல் ஒரு வாரத்திற்கும் அரசு விடுமுறை...

Kiren Rijiju: ‘‘యాంటీ-ఇండియా ఎవరో తెలిసిపోయింది’’.. అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి ప్రశంసలు..

Kiren Rijiju: కేంద్రమంత్రి కిరెన్ రిజిజు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ...

മിഡില്‍ ഈസ്റ്റില്‍  ആരുടെയെങ്കിലും പേരറിയില്ലെങ്കില്‍ മുഹമ്മദ് എന്ന് വിളിക്കൂവെന്ന് ട്രംപിന്റെ പരിഹാസം; കയ്യടിക്കാതെ സദസ്

വാഷിങ്ടണ്‍: മുസ്‌ലിം ലോകത്തെ മുഹമ്മദ് എന്ന പേരിനുള്ള ജനപ്രീതിയേയും ഇറാന്റെ പ്രസിഡന്റ്...