17
October, 2026

A News 365Times Venture

17
Saturday
October, 2026

A News 365Times Venture

Kiren Rijiju: ‘‘యాంటీ-ఇండియా ఎవరో తెలిసిపోయింది’’.. అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి ప్రశంసలు..

Date:

Kiren Rijiju: కేంద్రమంత్రి కిరెన్ రిజిజు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై ప్రశంసలు కురిపించారు. ఓవైసీ ముస్లిం-కేంద్రీకృత విధానాలను వ్యతిరేకిస్తున్నప్పటికీ, భారతదేశ జాతీయ ప్రయోజనాల విషయంలో ఆయన చాలా హేతుబద్ధంగా మాట్లాడుతారని రిజిజు అన్నారు. ప్రతిపక్ష నేతలు ఓవైసీని చూసి నేర్చుకోవాలని, ఇప్పుడు ‘‘భారత వ్యతిరేఖ ముఠా ఎవరో అర్థమైంది’’ అని సోషల్ మీడియాలో రిజిజు పోస్ట్ పెట్టారు.

ఇటీవల, ఎలాన్ మస్క్ భారత్‌లో స్టార్‌లింక్ అనుమతులపై ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. భారతదేశానికి నిజమైన ప్రధాని ముఖేష్ అంబానీ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనిపై రాజకీయ దుమారం చెలరేగింది. రాహుల్ గాంధీ మస్క్ పోస్టుకు స్పందిస్తూ.. ‘‘ఎలాన్ భారతదేశానికి స్వాగతం. ఆ రెండో వ్యక్తి గురించి తెలిసే వరకు ఆగు’’ అంటూ వ్యాఖ్యానించారు. గౌతమ్ అదానీ గురించి రాహుల్ పరోక్షంగా ఈ కామెంట్స్ చేసినట్లు అర్థమవుతుంది.

మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఓవైసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని వ్యతిరేకించడానికీ , భారతదేశ నిర్ణయాలను ప్రశ్నించే హక్కును ఒక విదేశీ వ్యాపారవేత్తకు ఇవ్వడానికీ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఆయన ఎత్తి చూపారు. మస్క్ ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఉన్నారని, ఇకపైన ఉంటారని అన్నారు. అయితే, అంతమాత్రాన ఒక విదేశీ వ్యాపారవేత్త భారత ప్రధానిపై అలాంటి వ్యాఖ్యలు చేయడానికి అనుమతించకూడదని అన్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

അഭിജിത് ദീപ്‌കെയുടെ അറസ്റ്റ്; വാദം കേള്‍ക്കല്‍ മനപൂര്‍വം വൈകിപ്പിച്ചതായി രത്‌ന സിങ്

ന്യൂദല്‍ഹി: അഭിജിത് ദീപ്‌കെയുടെ അറസ്റ്റില്‍ കോടതി വാദം കേള്‍പ്പിക്കുന്നത് മനപ്പൂര്‍വം വൈകിപ്പിക്കുന്നതായി...

'அனுமதியின்றி அதிகாலை காட்சிகள்; விதிகளை மீறும் தியேட்டர்கள்!' – கண்டுகொள்ளாத தவெக அரசு?

தமிழகத்தில் புதிய படம் வெளியான முதல் ஒரு வாரத்திற்கும் அரசு விடுமுறை...

മിഡില്‍ ഈസ്റ്റില്‍  ആരുടെയെങ്കിലും പേരറിയില്ലെങ്കില്‍ മുഹമ്മദ് എന്ന് വിളിക്കൂവെന്ന് ട്രംപിന്റെ പരിഹാസം; കയ്യടിക്കാതെ സദസ്

വാഷിങ്ടണ്‍: മുസ്‌ലിം ലോകത്തെ മുഹമ്മദ് എന്ന പേരിനുള്ള ജനപ്രീതിയേയും ഇറാന്റെ പ്രസിഡന്റ്...

அரிசி விலை அதிகரிக்க இதுதான் காரணம் – பின்னணி பகிரும் ரைஸ்மில் உரிமையாளர்!

தமிழகத்தில் கடந்த 3 மாதங்களாக அரிசியின் விலை நாளுக்கு நாள்...