9
October, 2026

A News 365Times Venture

9
Friday
October, 2026

A News 365Times Venture

PM Modi AP Visit: భోగాపురం విమానాశ్రయం చుట్టూ ఆంక్షలు.. 5 కిలోమీటర్ల మేర నో ఫ్లైయింగ్ జోన్

Date:

PM Modi AP Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భోగాపురం పర్యటన నేపథ్యంలో విజయనగరం జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఈ మేరకు భోగాపురం విమానాశ్రయం పరిసర ప్రాంతాలను 48 గంటల పాటు నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధనలు జూలై 30 రాత్రి 8 గంటల నుంచి ఆగస్టు 1 రాత్రి 8 గంటల వరకు అమల్లో ఉంటాయి. విమానాశ్రయం, సభా వేదిక, హెలిప్యాడ్ చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలో ప్రత్యేక ఆంక్షలు అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమయంలో డ్రోన్లు, యూఏవీలు (UAVలు), పారా గ్లైడర్లు, మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు వంటి ఎలాంటి గగనతల పరికరాలను వినియోగించడానికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు.

బీఎన్‌ఎస్‌ఎస్-2023 సెక్షన్ 163 ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి పర్యటన ఎలాంటి ఆటంకాలు లేకుండా సురక్షితంగా జరిగేలా ఈ చర్యలు తీసుకున్నామని చెప్పారు. భద్రతా నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, నిషేధాజ్ఞలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా యంత్రాంగం హెచ్చరించింది. కాగా, విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ హరిత విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ విచ్చేయనున్నారు.. దాదాపు 2 గంటలకుపైగా మోడీ పర్యటన కొనసాగనుంది.. ఆగస్టు 1వ తేదీన అంటే శనివారం రోజు ఉదయం 10.45 నుంచి మధ్యాహ్నం 1.05 వరకు భోగాపురం ఎయిర్‌ పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు.. ఉదయం 10.45కి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు మోడీ.. ఇక, గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు.. ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత భోగాపురం ఎయిర్‌పోర్టు టెర్మినల్‌ భవనానికి చేరుకోనున్నారు ప్రధాని.. భోగాపురం విమానాశ్రయాన్ని పరిశీలిస్తారు. అక్కడి నుంచి ఓపెన్‌ టాప్‌ జీపులో బహిరంగ సభా వేదికకు చేరుకోనున్నారు.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం, శిలా ఫలకం ఆవిష్కరణతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ..

 

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

അംബാനിയാണോ ഇന്ത്യയുടെ മുതലാളി? സ്റ്റാര്‍ലിങ്കിന് ലൈസന്‍സ് നിഷേധിക്കുന്നതില്‍ എലോണ്‍ മസ്‌ക്

ന്യൂദല്‍ഹി: ഇന്ത്യയില്‍ സ്‌പേസ് എക്‌സിന്റെ സ്റ്റാര്‍ലിങ്ക് സാറ്റലൈറ്റ് ഇന്റര്‍നെറ്റ് സേവനത്തിനുള്ള ലൈസന്‍സ്...

Infosys, TCS, HCL… நிறுவனங்களை சஸ்பெண்ட் செய்த US; Green Card-க்கு காத்திருப்போருக்கு அதிர்ச்சி!

அமெரிக்காவில் பணிபுரியும் இந்திய IT ஊழியர்களுக்கு முக்கியமான அதிர்ச்சி தகவல் வெளியாகியுள்ளது....

Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..

రైతులకు వ్యవసాయ పరికరాలు, ఉత్పత్తి సంబంధిత అవసరాల కోసం క్రెడిట్ అందించే...

സി.ജെ.പി പ്രതിഷേധത്തിനായി പോയ എ.ഐ.എസ്.എഫ് പ്രവര്‍ത്തകരെ മധ്യപ്രദേശ് പൊലീസ് കസ്റ്റഡിയിലെടുത്തു

  ഭോപ്പാല്‍: ഒക്ടോബര്‍ പത്തിന് നടക്കാനിരിക്കുന്ന സി.ജെ.പി പ്രതിഷേധത്തിന് പുറപ്പെട്ട പൂനെയില്‍...