6
July, 2026

A News 365Times Venture

6
Monday
July, 2026

A News 365Times Venture

Babar Azam: దిక్కుతోచని స్థితిలో పాకిస్థాన్ జట్టు.. కెప్టెన్‌గా బాబర్ రీఎంట్రీ..

Date:

Babar Azam: పాకిస్థాన్ టెస్టు జట్టు కెప్టెన్సీలో మరోసారి పెను మార్పు చోటుచేసుకుంది. పేలవమైన ప్రదర్శనతో నిరాశపరిచిన షాన్ మసూద్‌పై పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్) వేటు వేసింది. అతని స్థానంలో స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్‌ను తిరిగి టెస్టు జట్టు కెప్టెన్‌గా నియమిస్తూ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు మూడేళ్ల క్రితం పాక్ సుదీర్ఘ ఫార్మాట్ పగ్గాలు చేపట్టిన షాన్ మసూద్.. తన కెప్టెన్సీలో జట్టును సరైన దిశలో నడిపించలేకపోయాడు. అతని నాయకత్వంలో ఆడిన 16 టెస్టుల్లో పాకిస్థాన్ ఏకంగా 12 మ్యాచ్‌ల్లో ఘోర పరాజయాలను చవిచూసింది. ఈ నేపథ్యంలోనే పీసీబీ మళ్లీ పాత సారథి వైపే మొగ్గు చూపడం గమనార్హం. అయితే, ఇలా పదే పదే బాబర్ ఆజమ్‌కే కెప్టెన్సీ అప్పగిస్తుండటం పాక్ జట్టులో సరైన నాయకత్వ ప్రత్యామ్నాయాలు లేవనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.

కెప్టెన్‌గా బాబర్ ఆజమ్‌కు రీ-ఎంట్రీ ఇస్తూ ఎదురవబోయే మొదటి సవాలు వెస్టిండీస్ పర్యటన. ఈ పర్యటనలో భాగంగా పాకిస్థాన్ జట్టు కరేబియన్ గడ్డపై రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. జూలై 25 నుంచి తారౌబా వేదికగా మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఆగస్టు 2 నుంచి పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. బాబర్ మళ్లీ పగ్గాలు చేపట్టడంతో ఈ సిరీస్ ద్వారా పాక్ జట్టు తన వైఫల్యాలను అధిగమించి, కొత్త ఉత్సాహంతో రాణిస్తుందని బోర్డు భావిస్తోంది. మసూద్‌ను తొలగించి బాబర్‌కు కెప్టెన్సీ ఇవ్వడంపై పాకిస్థాన్ హై-పర్‌ఫార్మెన్స్ డైరెక్టర్ ఆకిబ్ జావేద్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జట్టు ప్రదర్శనలు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్లే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.

“షాన్ మసూద్ కెప్టెన్సీలో మనం చాలా క్లోజ్ మ్యాచ్‌లు చూశాం. కానీ కొన్ని కీలకమైన లోపాలు అలాగే ఉండిపోయాయి, వాటిని ఎవరూ సరిచేయలేకపోయారు. ఉదాహరణకు సెంచూరియన్ టెస్టులో సౌతాఫ్రికాకు చెందిన 10వ నంబర్ బ్యాటర్లు ఇద్దరు ఏకంగా 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. గెలవాల్సిన మ్యాచ్ అది. అలాగే హోమ్ గ్రౌండ్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌ల్లోనూ, మొల్తాన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులోనూ మన జట్టు చాలా సులువుగా చేతులెత్తేసింది. మ్యాచ్‌లను విజయవంతంగా ముగించాల్సిన పూర్తి బాధ్యత కెప్టెన్‌పై ఉంటుంది. అక్కడ మనం విఫలమయ్యాం” అని ఆకిబ్ జావేద్ వివరించారు.

వెస్టిండీస్ పర్యటనకు పాకిస్థాన్ టెస్ట్ జట్టు ఇదే:
బాబర్ ఆజమ్ (కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్లా ఫజల్, అలీ ఉస్మాన్, అజాన్ అవైస్, ఇమామ్ ఉల్ హక్, ఖుర్రమ్ షాజాద్, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ అలీ, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ అవైస్ జఫర్, ముహమ్మద్ ఘాజీ ఘోరీ, సాజిద్ ఖాన్, సల్మాన్ అలీ ఆఘా, షాన్ మసూద్, ఉబైద్ షా.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Eluru: తీవ్ర విషాదం.. రైలు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!

Eluru: ఏలూరు జిల్లా చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం రాత్రి...

‘അധികാരത്തിലുള്ളത് ഹിന്ദുക്കളെ കൊള്ളയടിക്കുന്നവര്‍’; രാമക്ഷേത്ര തട്ടിപ്പില്‍ കേന്ദ്രത്തിനെതിരെ ഉദ്ധവ് താക്കറെ

മുംബൈ: അയോധ്യ രാമക്ഷേത്ര ഫണ്ട് തട്ടിപ്പില്‍ കേന്ദ്ര സര്‍ക്കാരിനും ബി.ജെ.പിക്കുമെതിരെ വീണ്ടും...

மேகதாது: டெல்டா விவசாயிகள் அச்சத்தைப் போக்க அனைத்து கட்சிக் கூட்டத்தைக் கூட்ட வேண்டும்! – அன்புமணி

காவிரி ஆற்றின் குறுக்கே மேகதாது அணை கட்டுவதற்கான நடவடிக்கைகளை கர்நாடக அரசு...

Vaibhav Sooryavanshi: ‘మీ ప్రేమ ఎప్పటికీ మర్చిపోను’.. తొలి మ్యాచ్ తర్వాత వైభవ్ ఎమోషనల్ సందేశం..

Vaibhav Sooryavanshi: భారత క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన వండర్ కిడ్...