15
June, 2026

A News 365Times Venture

15
Monday
June, 2026

A News 365Times Venture

KTR: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది.!

Date:

KTR: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు అభివృద్ధి, సంక్షేమానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణ ప్రస్తుతం సంక్షోభంలోకి నెట్టబడిందని అన్నారు.

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నో పాటలు రాశారని కేటీఆర్ గుర్తు చేశారు. ఉద్యమ ప్రస్థానంలో కేసీఆర్ అనేక పాత్రలు పోషించారని, తెలంగాణ సాధన కోసం తన జీవితాన్నే అంకితం చేశారని పేర్కొన్నారు. “తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో” అనే నినాదంతో ముందుకు సాగి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. కేసీఆర్ జీవిత గాథపై సినిమా తీయాలని ఒక దర్శకుడు తనను కలిసిన సందర్భాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తైన తర్వాత ఆలోచిద్దామని కేసీఆర్ చెప్పారని, తెలంగాణ ఆవిర్భావం అనేది అన్ని ప్రతికూల పరిస్థితులను ఛేదించి సాధించిన చారిత్రక విజయమని ఆ దర్శకుడు అభిప్రాయపడ్డారని తెలిపారు. కేసీఆర్ అనే మూడు అక్షరాల ముందు “ముఖ్యమంత్రి” అనే పదవి చాలా చిన్నదిగా కనిపిస్తుందని ఆయన వ్యాఖ్యానించినట్లు చెప్పారు.

ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన కేటీఆర్.. “పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది. నిష్ఫల తెలంగాణగా మారిపోయింది” అని విమర్శించారు. తెలంగాణ సాధన కోసం పదవిని మాత్రమే కాదు.. అవసరమైతే ప్రాణత్యాగానికీ సిద్ధపడ్డ నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యతో బాధపడిన ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించి వేలాది కుటుంబాల కష్టాలను తీర్చిన నాయకుడు కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన కృషిని కొందరు ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారని ఆరోపించారు.

రాజకీయ పరిస్థితులపై స్పందిస్తూ.. 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే విజయం సాధించిందని, 2023 ఎన్నికల్లో కూడా ఒంటరిగానే పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిందని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అడ్డదారిలో అధికారంలోకి వచ్చిందని ఆరోపిస్తూ, ప్రస్తుతం రాష్ట్రాన్ని వెనక్కి నెట్టే విధంగా పాలన సాగుతోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూ.. గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక, పరిపాలనా వ్యవస్థలను దెబ్బతీస్తోందని ఆరోపించారు. “వడ్డించిన విస్తరి లాంటి తెలంగాణను కుక్కలు చింపిన విస్తరిగా మార్చుతున్నారు” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంక్షేమం, అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ప్రస్తుతం సంక్షోభంలో కూరుకుపోయిందని కేటీఆర్ అన్నారు. అయితే ఈ పరిస్థితులు శాశ్వతం కాదని, 2028 డిసెంబర్‌లో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు మరోసారి బీఆర్ఎస్‌కు అవకాశం ఇస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Southwest Monsoon: రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు.. పిడుగులతో కూడిన వర్షాలకు హెచ్చరిక

Southwest Monsoon: ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు పూర్తిస్థాయిలో విస్తరించినట్లు రాష్ట్ర విపత్తుల...

RSS ಬಗ್ಗೆ ಜನರಲ್ಲಿ ಅನುಮಾನ ಮೂಡಿಸುವ ಕೆಲಸ ಇನ್ಮುಂದೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ- ಮೋಹನ್ ಭಾಗವತ್ ತಿರುಗೇಟು

ತ್ರಿಶೂರ್,ಜೂನ್,15,2026 (www.justkannada.in): ಆರ್ ಎಸ್ಎಸ್ ಬಗ್ಗೆ ಜನರಲ್ಲಿ ಅನುಮಾನ ಮೂಡಿಸುವ...

സമൂഹത്തില്‍ കുറച്ച് ബ്ലസ്ഡായ സ്ത്രീകള്‍ സൗജന്യം വേണ്ടെന്ന് വെച്ചാല്‍ പദ്ധതി വന്‍ വിജയമാവും; പ്രിയദര്‍ശിനി പദ്ധതിയെ സ്വാഗതം ചെയ്ത് സുരേഷ് ഗോപി

തൃശ്ശൂര്‍: സ്ത്രീകള്‍ക്കുള്ള സൗജന്യ യാത്ര പദ്ധതിയായ കെ.എസ്.ആര്‍.ടി.സി പ്രിയദര്‍ശിനി പദ്ധതിയെ പിന്തുണച്ച്...

`தொடர்ந்து வட மாநில இளைஞர்கள் கைதுசெய்யப்படுவது பல கேள்விகளை எழுப்பியுள்ளது!' – அண்ணாமலை

தமிழ்நாட்டில் தவெக ஆட்சி அமைந்ததிலிருந்து தொடர்ந்து சட்ட ஒழுங்கு சிக்கல்கள் நீடிப்பதாக...