23
September, 2026

A News 365Times Venture

23
Wednesday
September, 2026

A News 365Times Venture

High Court Serious: కార్పొరేషన్‌ అధికారులు కళ్లు మూసుకుని తిరుగుతుంటారా..? అధికారుల నిర్లక్ష్యంపై హైకోర్టు ఆగ్రహం..!

Date:

High Court Serious: హైదరాబాద్ నగరంలో పెరిగిపోతున్న అక్రమ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యంపై ప్రశ్నలు గుప్పిస్తూ, వారి వ్యవహార శైలిపై న్యాయస్థానం కఠినంగా స్పందించింది. ఒక భవన నిర్మాణ దారుడి పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు.. భవనం పూర్తయ్యేంతవరకూ మున్సిపల్‌ అధికారులు ఏమి చేస్తున్నారు? అంటూ ప్రశ్నించింది. నిర్మాణం జరుగుతున్న సమయంలో కార్పొరేషన్‌ అధికారులు కళ్లు మూసుకుని తిరుగుతుంటారా? అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

Read Also: Jawahar Navodaya: కొత్తగా ఏడు కొత్త నవోదయ విద్యాలయాలు.. జూలై 14 నుండి ప్రారంభం..!

కోర్టు ఆదేశాలపై స్పందించడంలో కూడా అధికారులు తారతమ్యం చూపిస్తున్నారంటూ.. ఆదేశాలు జారీ అయిన తర్వాతే స్పీకింగ్ ఆర్డర్ ఇస్తారు, అప్పటికే భవనం నిర్మాణం పూర్తైపోతుంది. తర్వాత కూల్చివేత పేరుతో డ్రామాలు మొదలవుతాయి అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రాంతాల వారీగా అధికారులు ఉన్నప్పటికీ, అక్రమ నిర్మాణాలు ఎలా వెలుసుతున్నాయో న్యాయస్థానం ప్రశ్నించింది. ఒకవైపు పన్నులు వసూలు చేసే సమయానికి ఆ భవనానికి సంబంధించిన సమస్త వివరాలు తెలిసిపోతాయన్న హైకోర్టు వ్యాఖ్యలు మున్సిపల్ యంత్రాంగంపై విమర్శలు ప్రదర్శించాయి.

Read Also: Digvesh Rathi: సంచలనం.. 5 బంతుల్లో 5 వికెట్లు తీసిన LSG స్పిన్నర్.. వీడియో వైరల్

ఈ వ్యవహారంలో భాగంగా శేరిలింగంపల్లి గుట్టల బేగంపేటలోని ఓ భవన నిర్మాణదారుడి పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు, బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు సూచనలు, అభ్యంతరాలు మున్సిపల్ శాఖలపై ఒత్తిడిని పెంచనున్నాయని భావిస్తున్నారు. అక్రమ నిర్మాణాల నిరోధనకు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని కోర్టు స్పష్టంగా తెలిపింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

കേരളത്തില്‍ സി.ജെ.പിയുടെ ഫ്യൂച്ചര്‍ പ്ലാന്‍: ഏതെല്ലാം വിഷയം ഏറ്റെടുക്കും, സ്‌കൂള്‍ ഠീക് കരോ എവിടെയെല്ലാം

കോക്രോച്ച് ജനതാ പാര്‍ട്ടി (സി.ജെ.പി) രാജ്യത്താകെ അവരുടെ പ്രവര്‍ത്തനം വ്യാപിപ്പിക്കാനൊരുങ്ങുകയാണ്. ഇതിന്റെ...

`நான் இருக்கேன்' கையில் முத்தமிட்டு ஆறுதல் சொன்ன விஜய்; உருகிய வி.எஸ்.பாபு… 10 நிமிட சந்திப்பு!

75 வயதாகும் வி.எஸ்.பாபுவுக்கு சமீபத்தில் மூச்சுத்திணறல் ஏற்பட்டு, சென்னை நெல்சன் மாணிக்கம்...

iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్‌.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..

స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఐకూ (iQOO) తన బడ్జెట్ 5G డివైజ్...

വിവാഹത്തിനും കുടുംബ ചടങ്ങിനും ഹെലികോപ്റ്റര്‍; മുഖ്യമന്ത്രിയെ പരിഹസിച്ച് വി. ശിവന്‍കുട്ടി

തിരുവനന്തപുരം: മുഖ്യമന്ത്രിയുടെ ചാര്‍ട്ടേഡ് വിമാനയാത്രയില്‍ പരിഹാസവുമായി മുന്‍ മന്ത്രി വി ശിവന്‍കുട്ടി....