High Court Serious: హైదరాబాద్ నగరంలో పెరిగిపోతున్న అక్రమ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై ప్రశ్నలు గుప్పిస్తూ, వారి వ్యవహార శైలిపై న్యాయస్థానం కఠినంగా స్పందించింది. ఒక భవన నిర్మాణ దారుడి పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు.. భవనం పూర్తయ్యేంతవరకూ మున్సిపల్ అధికారులు ఏమి చేస్తున్నారు? అంటూ ప్రశ్నించింది. నిర్మాణం జరుగుతున్న సమయంలో కార్పొరేషన్ అధికారులు కళ్లు మూసుకుని తిరుగుతుంటారా? అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
Read Also: Jawahar Navodaya: కొత్తగా ఏడు కొత్త నవోదయ విద్యాలయాలు.. జూలై 14 నుండి ప్రారంభం..!
కోర్టు ఆదేశాలపై స్పందించడంలో కూడా అధికారులు తారతమ్యం చూపిస్తున్నారంటూ.. ఆదేశాలు జారీ అయిన తర్వాతే స్పీకింగ్ ఆర్డర్ ఇస్తారు, అప్పటికే భవనం నిర్మాణం పూర్తైపోతుంది. తర్వాత కూల్చివేత పేరుతో డ్రామాలు మొదలవుతాయి అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రాంతాల వారీగా అధికారులు ఉన్నప్పటికీ, అక్రమ నిర్మాణాలు ఎలా వెలుసుతున్నాయో న్యాయస్థానం ప్రశ్నించింది. ఒకవైపు పన్నులు వసూలు చేసే సమయానికి ఆ భవనానికి సంబంధించిన సమస్త వివరాలు తెలిసిపోతాయన్న హైకోర్టు వ్యాఖ్యలు మున్సిపల్ యంత్రాంగంపై విమర్శలు ప్రదర్శించాయి.
Read Also: Digvesh Rathi: సంచలనం.. 5 బంతుల్లో 5 వికెట్లు తీసిన LSG స్పిన్నర్.. వీడియో వైరల్
ఈ వ్యవహారంలో భాగంగా శేరిలింగంపల్లి గుట్టల బేగంపేటలోని ఓ భవన నిర్మాణదారుడి పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు, బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు సూచనలు, అభ్యంతరాలు మున్సిపల్ శాఖలపై ఒత్తిడిని పెంచనున్నాయని భావిస్తున్నారు. అక్రమ నిర్మాణాల నిరోధనకు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని కోర్టు స్పష్టంగా తెలిపింది.