28
August, 2026

A News 365Times Venture

28
Friday
August, 2026

A News 365Times Venture

Hash Oil : హైదరాబాద్‌లో తొలిసారిగా కోటిన్నర విలువైన హాష్ ఆయిల్ సీజ్‌

Date:

నగరంలోని ఎల్బీనగర్‌ పోలీసులకు డ్రగ్ మాఫియాపై భారీ విజయం లభించింది. రాష్ట్రంలోనే తొలిసారిగా రూ.1.2 కోట్ల విలువైన 20 కిలోల హాష్‌ ఆయిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరాంధ్ర నుంచి గంజాయిని హాష్ ఆయిల్‌గా మార్చి, చిన్న చిన్న బాటిళ్లలో గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తున్న స్మగ్లర్లు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. గంజాయి స్మగ్లర్లు కొత్త తంత్రాన్ని ఎంచుకున్నారు. భారీగా ప్యాకెట్లు తరలించడం కష్టంగా మారడంతో హాష్ ఆయిల్ రూపంలో గంజాయిని మారుస్తున్నారు. హాష్ ఆయిల్‌కు ప్రత్యేక వాసన ఉండదు, తక్కువ సమయంలోనే ‘కిక్’ ఎక్కువగా ఉంటుందని వినియోగదారులు చెబుతారు. దీంతో ముంబై, ఢిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్ వంటి మేజర్ నగరాల్లో దీని డిమాండ్ భారీగా పెరిగింది.

స్మగ్లర్లు 10 గ్రాముల చిన్న బాటిళ్లలో హాష్ ఆయిల్‌ను బహిరంగంగా సరఫరా చేస్తున్నారు. పార్టీలు, రిసార్ట్‌లు, ప్రైవేట్ ఈవెంట్లకు వీటి డిమాండ్ పెరుగుతోంది. పాకెట్‌లో వేసుకుని తేలికగా తరలించే వీలుండటంతో గంజాయి మాఫియా దీనివైపు మొగ్గుచూపుతోంది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు పంగి కేశవరావు అలియాస్‌ కేశవ్. ఇతను అల్లూరి సీతారామరాజు జిల్లా కిన్నెరలోయకు చెందినవాడు. గతంలో డ్రగ్స్ కేసులో అనకాపల్లి పోలీసులకు చిక్కిన ఇతను ఇప్పుడు మళ్లీ అదే రూట్లోకి వెళ్లాడు. ఇతని స్నేహితుడు ఆర్టీఏ ఏజెంట్ కృష్ణతో కలిసి ఏపీ నుంచి హాష్ ఆయిల్‌ను హైదరాబాద్ మీదుగా బెంగుళూరుకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ నేపథ్యంలో, ఎల్బీనగర్‌ ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, అబ్దుల్లాపూర్‌మెట్‌ ఇన్‌స్పెక్టర్ అశోక్‌రెడ్డి బృందాలు పెద్దఅంబర్‌పేట్ సమీపంలోని ఓ హోటల్ వద్ద ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. తనిఖీలో వారి వద్ద 20 కిలోల హాష్ ఆయిల్ బయటపడింది. ఇప్పటికే కేశవ్, జయరాంలను అరెస్ట్ చేసిన పోలీసులు, బెంగుళూరు నుంచి వచ్చే పార్టీల కోసం ఎదురు చూస్తున్న సమయంలో పట్టుకున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆర్టీఏ ఏజెంట్ కృష్ణ కోసం గాలింపు కొనసాగుతోంది. హైదరాబాద్‌లో డ్రగ్స్ సరఫరాను అడ్డుకునేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా గంజాయి, హాష్ ఆయిల్ తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించారు. నగరంలో పార్టీలు, ఈవెంట్‌లు జరిగే ప్రాంతాల్లో నిఘా బలపడనుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

പ്രതിപക്ഷ ഉപനേതാവ് തര്‍ക്കം തുടരുന്നു; പ്രസ്താവനകളില്‍ നേതാക്കള്‍ മിതത്വം പാലിക്കണമെന്ന് ടി.പി രാമകൃഷ്ണന്‍

തിരുവനന്തപുരം: പ്രതിപക്ഷ ഉപനേതാവ് തര്‍ക്കത്തിലെ പ്രസ്താവനകളില്‍ നേതാക്കള്‍ മിതത്വം പാലിക്കണമെന്ന് എല്‍.ഡി.എഫ്...

கருப்புச் சட்டையில் திமுக கவுன்சிலர்கள்; முதல்வர் விஜய்க்கு கடிதம் எழுதிய மேயர் பிரியா; விவரம் என்ன?

சென்னை மாநகராட்சியின் மாதாந்திரக் கூட்டம் இன்று ரிப்பன் மாளிகையில் நடந்து வருகிறது....

Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?

Off The Record: పాజిటివో, నెగెటివో… పార్టీలో కొండా సురేఖ ఎపిసోడ్‌కి...

ಆ.29ಕ್ಕೆ ಡಾ. ಶಿವರಾತ್ರಿ ರಾಜೇಂದ್ರ ಶ್ರೀಗಳ 111ನೇ ಜಯಂತಿ: ಭಾಗಿಯಾಗಲಿದ್ದಾರೆ ಸಿಎಂ ಡಿಕೆಶಿ, ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಮೈಸೂರು, ಆಗಸ್ಟ್,27,2026 (www.justkannada.in): ಸುತ್ತೂರು ಜಗದ್ಗುರು ಶ್ರೀ ವೀರಸಿಂಹಾಸನ ಮಹಾಸಂಸ್ಥಾನ...