25
June, 2026

A News 365Times Venture

25
Thursday
June, 2026

A News 365Times Venture

TSRTC Strike: ఆర్టీసీలో సమ్మె సైరన్‌.. నేడు ఎండీకి సమ్మె నోటీసులు!

Date:

తెలంగాణ ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్‌ మోగనుంది. ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టాలని నిర్ణయించుకున్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సమ్మెకు వెళ్లాలని జేఏసీ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు (జనవరి27) సాయంత్రం ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో ఎండీని కలిసి సమ్మె నోటీసులు ఇవ్వనున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌తో పాటు మరికొన్ని సమస్యలను పరిష్కరించాలని కోరనున్నారు.

ఆర్టీసీలో విద్యుత్‌ బస్సుల్ని ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ.. శుక్ర, శనివారం కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసనకు దిగారు. అయినా కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఆర్టీసీ యాజమాన్యానికి సోమవారం సమ్మె నోటీసులను ఇచ్చేందుకు ఆర్టీసీ జేఏసీ సిద్దమైంది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా.. ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోవడంపై కార్మికులు అసంతృప్తిగా ఉన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇతర సమస్యలను సైతం పరిష్కారం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Suryapet Crime News: సూర్యాపేటలో పరువు హత్య.. ప్రేమ వివాహం చేసుకుందని..!

కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణకు ఇటీవల ఆర్టీసీలో విద్యుత్‌ బస్సుల కొనుగోళ్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు డిపోలను విద్యుత్‌ బస్సులు సమకూరుస్తున్న సంస్థలకే అప్పగించే ప్రయత్నం జరుగుతోంది. ఈవీ బస్సుల రాకతో ఉద్యోగులు బస్ డిపోలు ఖాళీ చేస్తున్నారు. అధికారులు ఆర్టీసీ కార్మికుల్ని ఇతర డిపోలకు మారుస్తున్నారు. ఇక మహాలక్ష్మి పథకం ప్రవేశ పెట్టిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు పనిభారం పెరిగిందని జేఏసీ నేతలు అంటున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఈవీ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలన్న ఆలోచన విరమించుకోవాలని జేఏసీ సమ్మె బాట పట్టనుంది. నేడు ఆర్టీసీ ఎండీ నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే.. మార్చి మొదటి వారం నుంచి సమ్మెలోకి వెళ్లాలని ఉద్యోగులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಮಾಹಿತಿ ಮತ್ತು ಸಾರ್ವಜನಿಕ ಸಂಪರ್ಕ ಇಲಾಖೆ ಆಯುಕ್ತರಾಗಿ ಎಂ.ಎನ್. ಅನುಚೇತ್ ನೇಮಕ

  ಬೆಂಗಳೂರು, ಜೂನ್ 24: ರಾಜ್ಯ ಸರ್ಕಾರ ಹಿರಿಯ ಐಪಿಎಸ್ ಅಧಿಕಾರಿ...

സുവേന്ദുവുമായി ആഴത്തിലുള്ള അടുപ്പമെന്ന് മഹുവ മൊയിത്ര;ചര്‍ച്ചയായി തൃണമൂല്‍ നേതാവിന്റെ അഭിമുഖം

കൊല്‍ക്കത്ത: പശ്ചിമ ബംഗാള്‍ രാഷ്ട്രീയത്തില്‍ പുതിയ അഭ്യൂഹങ്ങള്‍ക്ക് തുടക്കം കുറിച്ച് തൃണമൂല്‍...

பாமக: `தொண்டர்களுக்கு மனக்கசப்பு இருக்கும்தான்!’ – ராமதாஸ், அன்புமணி சந்திப்பு குறித்து ஜி.கே.மணி

பாட்டாளி மக்கள் கட்சியில் மருத்துவர் ராமதாஸுக்கும், அவரது மகன் அன்புமணிக்கும் இடையேயான...