16
August, 2026

A News 365Times Venture

16
Sunday
August, 2026

A News 365Times Venture

BJP: ఏపీపై బీజేపీ స్పెషల్ ఫోకస్.. పార్టీ ఎదుగుదలకు కొత్త వ్యూహాలు!

Date:

ఇప్పటికే అత్యధిక రాష్ట్రాల్లో పాగా వేసిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ).. ఏపీపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఏపీలో పార్టీ ఎదుగుదలకు బీజేపీ కేంద్ర నాయకత్వం కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే గతంలో కంటే భిన్నంగా మోడీ సర్కార్ ఏపీ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కూటమిలో ఉంటూనే.. రాష్ట్రంలో సొంతంగా ఎదిగే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా పార్టీ పరంగా ప్రక్షాళన చేయడానికి సిద్దమైంది. బీజేపీ పార్టీకి కొత్త అధ్యక్షుడు నియామకంపై అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది.

ఇటీవలి కాలంలో కేంద్రం నుంచి ఏపీకి వరుసగా సాయం అందుతోంది. ఆ నిర్ణయాలు ప్రజల్లో సానుకూలత పెంచుతుండగా.. ఈ సమయంలోనే పార్టీ బలోపేతం దిశగా వ్యూహాలు రచిస్తోంది. ఏపీకి కేంద్రం నుంచి అమరావతి, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు అనుకూలంగా ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించింది. దీంతో బీజేపీ పైన గతం కంటే రాష్ట్ర ప్రజల్లో సానుకూలత పెరిగింది. వీటి అన్నిటిపై నోవాటేల్లో ఈరోజు ఉదయం 8 గంటలకు ఏపీ బీజేపీ నేతలతో కేంద్రహోంమంత్రి అమిత్ షా కీలక సమావేశం నిర్వహించనున్నారు. అలానే ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. సరైన నాయకుడి కోసం కేంద్ర నాయకత్వం వెతుకుతోంది. ఏపీ ఇక బీజేపీకి కీలక అంశాలపై అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

അമ്മ ആരെന്ന് അറിയാത്തവരാണ് വന്ദേമാതരം എതിർക്കുന്നതെന്ന് കേരള വി.സി; ആർ.എസ്.എസിന്റെ ‘ഓസി’ എന്ന് മറുപടി

തിരുവനന്തപുരം: വന്ദേ മാതരത്തെക്കുറിച്ച് വിവാദ പരാമർശവുമായി കേരള വൈസ് ചാൻസലർ ഡോ....

'தாய் மீதும், தாய் நாட்டின் மீதும்…' – முதல்வர் குறித்த சர்ச்சைப் பேச்சுக்கு நயினார் விளக்கம்

"சட்டமன்றத்தில் அப்பாவைக் காணோம் எனத் தேடுபவர்களின் ஆட்சி நடக்கிறது. வீட்டில் போய்...

കോൺഗ്രസിന്റെ പ്രത്യയശാസ്ത്ര ശൂന്യതയിൽ സംഘപരിവാർ കസേരയിട്ട് ഇരിക്കുന്നു: എ.എ. റഹീം

  തിരുവനന്തപുരം: കോൺഗ്രസിന്റെ പ്രത്യയശാസ്ത്ര ശൂന്യതയാണ് എ.ഐ.സിസി ആസ്ഥാനത്ത് വന്ദേമാതരം പൂർണമായി...