17
November, 2026

A News 365Times Venture

17
Tuesday
November, 2026

A News 365Times Venture

Koti Deepotsavam 2026 Day 2: అంగరంగ వైభవంగా తిరుచెందూరు శ్రీసుబ్రహ్మణ్యస్వామి కల్యాణం.. రెండో రోజు విశేషాలివే..!

Date:

కార్తీక మాస శోభతో, అశేష భక్తజన సందోహం మధ్య భక్తి టీవీ నిర్వహిస్తున్న మహా ఆధ్యాత్మిక వేడుక ‘కోటి దీపోత్సవం – 2026’ రెండవ రోజు కార్యక్రమాలు అత్యంత వైభవంగా ముగిశాయి. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మహోత్సవంలో భాగంగా రెండవ రోజైన కార్తీక ఆదివారం – స్కంద షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచేందుకు నిర్వహించిన విశేష కార్యక్రమాలు అద్భుతంగా సాగాయి.

పీఠాధిపతుల అనుగ్రహ భాషణం.. ప్రవచనామృతం

రెండవ రోజు వేడుకల్లో భాగంగా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్ర తీర్థ స్వామీజీ, రాజస్థాన్‌లోని హరి కృపా ధామ్ మహారాజ్ శ్రీ హరిచైతన్యపురి మహరాజ్ భక్తులకు తమ దివ్య అనుగ్రహ భాషణాన్ని అందించారు. అలాగే ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త శ్రీ తాడేపల్లి పతంజలి శాస్త్రి గారి ప్రవచనామృతం భక్తులకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచింది.

విశేష పూజలు , దివ్య కల్యాణోత్సవం

వేదికపై అత్యంత భక్తిశ్రద్ధలతో ‘వేలాయుధ కావడి పూజ’, ‘శ్రీ గురురాఘవేంద్ర ఆరాధన’ నిర్వహించారు. అలాగే ప్రాంగణానికి విచ్చేసిన భక్తులందరూ స్వయంగా పాల్గొనేలా శివపుత్రునికి ‘కోటి పుష్పార్చన’ కార్యక్రమం కనులపండువగా జరిగింది. నేటి ప్రధాన ఘట్టంగా తిరుచెందూరు శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం అత్యంత వైభవోపేతంగా, అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ దివ్య ఘట్టం అనంతరం సప్తహారతులు, స్వర్ణలింగోద్భవం కనులవిందుగా సాగాయి. రెండో రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. సురేందర్ సతీసమేతంగా విచ్చేశారు.

వాహన సేవ

కల్యాణోత్సవానంతరం స్వామివారికి అత్యంత విశిష్టమైన ‘పల్లకీ’ వాహన సేవను నిర్వహించారు. తొలి రోజు శివనామస్మరణతో మార్మోగిన ప్రాంగణంలో, నేడు స్కంద షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకుని సుబ్రహ్మణ్య స్వామి నామస్మరణతో కోటి దీపోత్సవ వేదిక పులకించింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ దివ్య వేడుకల్లో పాల్గొని తరించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

അജിത് പവാറിന്റെ മരണം; വിമാനം ഓപ്പറേറ്റ് ചെയ്ത കമ്പനിയുടെ ഉടമയെ ഫട്‌നാവിസ് സംരക്ഷിക്കുന്നു: രോഹിത് പവാര്‍

മുംബൈ: മഹാരാഷ്ട്ര മുന്‍ ഉപമുഖ്യമന്ത്രി അജിത് പവാര്‍ അപകടത്തില്‍ മരിക്കാനിടയായ വിമാനം...

சாட்ஜிபிடி மூலம் புத்தகங்கள்; ஒரே நாளில் ISBN பெற்ற நூல்கள், அதே நாளில் ஒப்புதல்! – FIR முழு விவரம்!

தமிழ்நாடு பொது நூலக இயக்ககம் மற்றும் கோவை பெரியார் அறிவுலகம் உள்ளிட்ட...

Kishan Reddy : డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణమే ప్రధాని మోదీ లక్ష్యం

దేశ భవిష్యత్తుకు పెను సవాలుగా మారిన డ్రగ్స్ మహమ్మారిని రూపుమాపేందుకు ప్రధానమంత్రి...

രാജ്യത്ത് ആദിവാസികള്‍ ആരുമില്ലെന്ന് ബി.ജെ.പി എം.എല്‍.എ; ബി.ജെ.പിയുടെ ആദിവാസി വിരുദ്ധത വെളിപ്പെട്ടെന്ന് കോണ്‍ഗ്രസ്

ഭോപ്പാല്‍: രാജ്യത്ത് ആദിവാസികള്‍ എന്ന് ആരുമില്ലെന്ന പരാമര്‍ശവുമായി മധ്യപ്രദേശിലെ ബി.ജെ.പി എം.എല്‍.എ...