11
November, 2026

A News 365Times Venture

11
Wednesday
November, 2026

A News 365Times Venture

CM Revanth Reddy : కేటీఆర్‌పై రేవంత్ ఫైర్.. పది జన్మలెత్తినా కాలేవంటూ..

Date:

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు రోజుల కొడంగల్ పర్యటన విజయవంతంగా ముగిసింది. పర్యటన ముగింపులో భాగంగా లగచర్ల నుంచి రోడ్డు మార్గంలో ఆయన హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు. లగచర్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధి, పాలమూరు వలసలు , ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నాయకుల వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

పాలమూరుకు పదేళ్లు కక్షగట్టి అన్యాయం చేశారు

బూర్గుల రామకృష్ణారావు కాలం నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది నాయకులు పాలమూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినా ఈ ప్రాంతంలో వలసలు ఆగలేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. మన ప్రాజెక్టులు పూర్తి కాలేదని, పొలాలకు నీళ్లు అందలేదని తెలిపారు. తెలంగాణ వస్తే కష్టాలు తీరుతాయని కేసీఆర్‌ను గెలిపిస్తే.. ముఖ్యమంత్రి అయ్యాక పాలమూరు జిల్లా గుండెలపై తన్ని గజ్వేల్‌కు పోయాడని విమర్శించారు. పదేళ్ల పాటు పాలమూరు అభివృద్ధిని కక్షగట్టి అడ్డుకున్నారని, అయితే 2023లో ముక్కోటి దేవతల ఆశీస్సులతో కొడంగల్ బిడ్డ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే అవకాశం తనకు దక్కిందని చెప్పారు. తానూ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నానని స్పష్టం చేశారు.

పది జన్మలెత్తినా కేటీఆర్.. రేవంత్ రెడ్డి కాలేడు

కేసీఆర్ పాలనలో రూ. 8.11 లక్షల కోట్ల అప్పులు చేసి ఫామ్‌హౌస్‌లో పడుకున్నారని, తమకు అప్పులు చేసే అలవాటు కానీ, అబద్ధాలు చెప్పే అలవాటు కానీ లేవని సీఎం వ్యాఖ్యానించారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభస్తుంటే బీఆర్‌ఎస్ నాయకులకు కడుపుమంటగా ఉందన్నారు. బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. “కేటీఆర్‌కు గడ్డం రావడానికి 50 ఏళ్లు పట్టింది, బుద్ధి రావడానికి ఎన్ని ఏళ్లు పడుతుందో! పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే నక్క ఎప్పటికీ పులి కాదు. గడ్డం మోకాళ్ల వరకు పెంచుకున్నా కేటీఆర్ ఎప్పటికీ రేవంత్ రెడ్డి కాలేడు. రేవంత్ రెడ్డి కావాలంటే గుండె ధైర్యం ఉండాలి, నమ్ముకున్న వారి కోసం నిలబడే తెగువ కావాలి” అని ఎద్దేవా చేశారు.

డిసెంబర్ నాటికి కొడంగల్‌కు కృష్ణా జలాలు

ఎవరు అడ్డువచ్చినా తొక్కుకుంటూ వెళ్తామని, ఈ డిసెంబర్ నాటికి కృష్ణా జలాలు తీసుకొచ్చి కొడంగల్ బీడు భూములను తడిపి పచ్చని పంటలు పండిస్తానని పోలేపల్లి ఎల్లమ్మతల్లి సాక్షిగా ప్రమాణం చేశారు. ఒకప్పుడు చదువుకోడానికి పక్క జిల్లాలకు వెళ్లే పరిస్థితి నుంచి, నేడు రూ. 9,000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టి కొడంగల్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.

ప్రజాబలంతో సునామీ సృష్టిస్తాం.. ఢిల్లీ మోదీనైనా, కేడీనైనా ఎదిరిస్తా

ఉద్యోగుల కష్టాలు గుర్తించి 2024 జనవరి 1 నుంచి ప్రతి నెలా మొదటి తారీఖున 11 లక్షల మంది ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు వేస్తున్నామని సీఎం గుర్తుచేశారు. కేసీఆర్ చేసిన అప్పులకు ఈ 34 నెలల్లో రూ. 2 లక్షల కోట్లకు పైగా వడ్డీలు కట్టామని చెప్పారు. కొడంగల్ ప్రజల అండ ఉంటే ఢిల్లీలో మోదీనైనా, ఇక్కడ కేడీనైనా ఎదిరిస్తానని ధీమా వ్యక్తం చేశారు. సంక్రాంతి తర్వాత ‘ప్రజాబలం’ పేరుతో ప్రజల్లోకి వస్తామని, ఆ ప్రజాబలంతో సునామీ సృష్టిస్తే మోడీ, కేడీలు కొట్టుకుపోవడం ఖాయమన్నారు. చివరగా, జర్నలిస్టులు ఎవ్వరూ అధైర్యపడొద్దని, వారి సమస్యలను పరిష్కరించే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

സമ്പുഷ്ടീകരിച്ച യുറേനിയം മാറ്റില്ല; ആണവ പദ്ധതിയുമായി ബന്ധപ്പെട്ട ചര്‍ച്ചകളില്‍ വിട്ടുവീഴ്ച്ചയില്ലെന്ന് ഇറാന്‍

ടെഹ്റാന്‍: രാജ്യത്തുള്ള സമ്പുഷ്ടീകരിച്ച യുറേനിയം വിദേശത്തേക്ക് മാറ്റണമെന്ന നിര്‍ദേശം തള്ളി ഇറാന്‍....

'அட்டாக் பரந்தாமன்' லைப்ரரி மேட்டரை விட்றாதீங்க! – தவெக செய்தித் தொடர்பாளர்களுக்கு புது அசைன்மெண்ட்!

சென்னை தி.நகரில் உள்ள அமைச்சர் ஆதவ் அர்ஜூனாவின் 'வாய்ஸ் ஆப் காமன்'...

AP Cabinet Meeting: మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్? రేపటి కేబినెట్ భేటీపై ఉత్కంఠ

AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రేపు అనగా...

ഇസ്രഈലിന്റെ നിയന്ത്രണങ്ങള്‍: ഗസയില്‍ അഞ്ച് ലക്ഷം കുട്ടികള്‍ സുരക്ഷിതമായ പാര്‍പ്പിടമില്ലാതെ കഴിയുന്നു: സേവ് ദി ചില്‍ഡ്രന്‍

ഗസ സിറ്റി: ഗസയില്‍ അഞ്ച് ലക്ഷത്തിലധികം കുട്ടികള്‍ സുരക്ഷിതമായ പാര്‍പ്പിടമില്ലാതെ കഴിയുകയാണെന്ന്...