10
November, 2026

A News 365Times Venture

10
Tuesday
November, 2026

A News 365Times Venture

Cyber Crime: హైదరాబాద్‌లో భారీ సైబర్ దోపిడీ.. ‘పిన్ సర్వే’ సంస్థ నుంచి రూ. 8 కోట్లు లూటీ..

Date:

హైదరాబాద్ వేదికగా కార్పొరేట్ సంస్థలను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు సాగిస్తున్న దోపిడీలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా మాదాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ‘పిన్ సర్వే’ సంస్థను టార్గెట్ చేసిన హ్యాకర్లు, కేవలం గంట వ్యవధిలోనే ఏకంగా రూ. 8 కోట్లను కొల్లగొట్టారు. కంపెనీ బ్యాంకింగ్ నెట్‌వర్క్ భద్రతా లోపాలను ఆసరాగా చేసుకున్న సైబర్ కేటుగాళ్లు, కంపెనీ అధికారిక ఖాతాలను హ్యాక్ చేశారు. విషయం కంపెనీ ఆర్థిక విభాగానికి బోధపడేలోపే, కేవలం ఒక్క గంటలోనే ఈ మొత్తాన్ని వివిధ రాష్ట్రాల్లోని సుమారు 39 ‘మ్యూల్ అకౌంట్లకు’  మళ్లించారు. అనుమానాస్పద లావాదేవీలను గుర్తించిన యాజమాన్యం వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇటీవలే నగరంలోని ‘ఎన్‌బీసీ’ సంస్థ నుంచి కూడా ఇదే తరహాలో రూ. 8 కోట్లు కాజేసిన ఘటన మరువకముందే, మళ్లీ అదే స్థాయిలో దోపిడీ జరగడం అధికారులను విస్మయానికి గురిచేస్తోంది. గతంలో నకిలీ ఈమెయిళ్లు, మాల్‌వేర్లు పంపడం ద్వారా పాస్‌వర్డ్‌లు చోరీ చేసి నిధులు మళ్లించిన దాఖలాలు ఉన్నాయి. పిన్ సర్వే సంస్థ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. డబ్బులు బదిలీ అయిన 39 బ్యాంకు ఖాతాలను తక్షణమే ఫ్రీజ్ చేయాలని బ్యాంకులను ఆదేశించారు. అలాగే హ్యాకింగ్‌కు వాడిన ఐపీ అడ్రస్‌లు, సర్వర్ రికార్డులను ఫోరెన్సిక్ టీమ్‌లు పరిశీలిస్తున్నాయి. అంతర్రాష్ట్ర లేదా విదేశీ సైబర్ ముఠాలు ఈ నేరానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు జరిపే కార్పొరేట్ సంస్థలే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. సైబర్ ముప్పుల నుండి తప్పించుకోవడానికి కంపెనీలు తమ సిస్టమ్స్‌లో మల్టీ-ఫ్యాక్టర్ అథెంటికేషన్, రోజూవారీ సెక్యూరిటీ ఆడిట్స్, భారీ బదిలీల సమయంలో డ్యుయల్ ధ్రువీకరణ వంటి భద్రతా పద్ధతులను తప్పక పాటించాలని హెచ్చరించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

പിടിച്ചെടുത്തത് 44,250 വെടിയുണ്ടകള്‍: ‘ആര്‍.എസ്.എസും ബി.ജെ.പിയും രാജ്യത്തിന് ചില ഉത്തരങ്ങള്‍ നല്‍കേണ്ടതുണ്ടെന്ന് പ്രിയങ്ക് ഖാര്‍ഗെ

ബെംഗളൂരു: ബിഹാറിലും ഹരിയാനയിലുമായി 44,250 വെടിയുണ്ടകള്‍ കണ്ടെത്തിയ സംഭവത്തിലെ പ്രതികള്‍ക്ക് ആര്‍.എസ്.എസുമായുള്ള...

கோவை: பெரியார் நூலகத்தில் லஞ்ச ஒழிப்புத் துறை சோதனை; பின்னணி என்ன?

கோவை பெரியார் நூலகத்திற்கான புத்தகங்கள் கொள்முதல் செய்ததில் கோடிக்கணக்கான ரூபாய் ஊழல்...

Chairman’s Desk: భక్తి విప్లవానికి కొత్త బాటలు..! జాతీయ స్థాయిలో ఎందుకు చర్చనీయాంశం అయింది..?

Chairman’s Desk: ఇళ్లలో రెండు దీపాలు వెలిగించడం సహజం. ఆలయాల్లో మరికొన్ని...