10
November, 2026

A News 365Times Venture

10
Tuesday
November, 2026

A News 365Times Venture

Eisenkot: ఇజ్రాయెల్‌ రాజకీయాల్లో కీలక పరిణామం.. ప్రభుత్వం ఏర్పాటుకు ఐసన్‌కోట్‌కు ఆహ్వానం..

Date:

ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశాధ్యక్షుడు ఇసాక్ హర్జోగ్ తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను ‘యషార్’ పార్టీ అధినేత గడి ఐజెన్‌కోట్‌కు అప్పగించారు. ఈ మేరకు ఆయన నేడు లేదా రేపు అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. పార్లమెంట్‌లో ఐజెన్‌కోట్‌కు 67 మంది సభ్యుల మద్దతు లభించగా, ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు 46 సిఫార్సులు మాత్రమే దక్కాయి. మెజారిటీ నిరూపించుకోవడానికి ఆయనకు 28 రోజుల గడువు ఉంటుంది. అయితే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఐజెన్‌కోట్‌కు అంత సులభం కాదు.
ఆయన నేతృత్వంలోని  కొన్ని పార్టీలు అరబ్ నాయకత్వ పార్టీలతో కలవడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు, అక్టోబర్ 7 దాడి సమయంలో అధికారంలో ఉన్నవారు రాజకీయాల నుంచి తప్పుకోవాలని వాదిస్తున్న ఐజెన్‌కోట్.. నెతన్యాహుతో ఎలాంటి కూటమి కట్టేది లేదని స్పష్టం చేశారు. కేవలం లికుడ్ పార్టీ , దాని మిత్రపక్షాలు ఎలాంటి షరతులు లేకుండా తమతో వస్తేనే పరిశీలిస్తామని ఆయన పార్టీ తేల్చిచెప్పింది. ఇదిలాఉంటే, ప్రధాని నెతన్యాహు మాత్రం జాతీయ ఐక్య ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.
అయితే, అరబ్ పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటయితే దేశం తీవ్ర ప్రమాదంలో పడుతుందని, వారు హమాస్‌కు మద్దతు ఇస్తున్నారని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. మరోవైపు, నెతన్యాహు వైఖరిని ఐజెన్‌కోట్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయెల్ సమాజాన్ని విభజించడమే ఆయన నైజమని ఆరోపించింది. మొత్తానికి ఇజ్రాయెల్‌లో రాజకీయ అస్థిరత కొనసాగుతున్న తరుణంలో, ఐజెన్‌కోట్ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

പുതിയ ഇസ്രഈല്‍ സര്‍ക്കാരില്‍ ഹമാസിനെ പിന്തുണക്കുന്നവരുണ്ടാവരുതെന്ന് നെതന്യാഹു

ടെല്‍ അവീവ്: പുതിയ ഇസ്രഈല്‍ സര്‍ക്കാരില്‍ ഹമാസിനെ പിന്തുണക്കുന്നവര്‍ ഉണ്ടാവരുതെന്നും അത്തരമൊരു...

Abhijeet Dipke: ‘మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను’.. దీపావళి సందర్భంగా అభిజీత్ దీప్కే భావోద్వేగ పోస్ట్..

దీపావళి పండుగ సంతోషాలను, వెలుగులను , ఆత్మీయుల సాన్నిహిత్యాన్ని మోసుకొస్తుంది. అయితే...

കൊടുങ്കാറ്റും മഴയും: ഗസയില്‍ മൂന്നര ലക്ഷത്തോളം പേര്‍ക്ക് കൂടാരങ്ങള്‍ നഷ്ടപ്പെട്ടതായി ആരോഗ്യ മന്ത്രാലയം

ഗസ സിറ്റി: ഗസയില്‍ പലായനം ചെയ്യപ്പെട്ട മൂന്നര ലക്ഷത്തോളം പേര്‍ക്ക് കൊടുങ്കാറ്റിനെയും...