6
November, 2026

A News 365Times Venture

6
Friday
November, 2026

A News 365Times Venture

AP MPTC, ZPTC Elections: ఈ మండలాల్లో రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్.. అక్కడ రీపోలింగ్‌కు ఎస్ఈసీ ఆదేశాలు!

Date:

AP MPTC, ZPTC Elections: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐదు మండలాల్లో ఇవాళ జరగాల్సిన పోలింగ్‌ను రేపటికి వాయిదా వేసింది. ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం జిల్లా పరిధిలోని పోలవరం, తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం మండలాల్లో రేపు పోలింగ్ నిర్వహించనున్నారు. ఆయా ప్రాంతాల్లో అనివార్య కారణాలతో ఇవాళ జరగాల్సిన ఎన్నికలను రేపటికి మారుస్తూ ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంది. ఇక, వాయిదా పడిన ఈ ఐదు మండలాల్లో ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన జిల్లాలోని మిగిలిన ప్రాంతాలతో పాటే ఎల్లుండి నిర్వహించనున్నారు. అయితే ఈ ఐదు మండలాల్లో ఏదైనా మండలంలో రీపోలింగ్ అవసరమైతే, ఆ మండలానికి సంబంధించిన ఓట్ల లెక్కింపును తాత్కాలికంగా నిలిపివేస్తారు. అనంతరం రీపోలింగ్‌కు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త తేదీని ఖరారు చేయనుంది.

కోసిగిలోని ZPTC పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్
మరోవైపు కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని ఆర్లబండ గ్రామంలో ఉన్న ZPTC పోలింగ్ స్టేషన్ నంబర్ 2లో రీపోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరిగిందనే ఫిర్యాదులు రావడంతో ఎస్ఈసీ విచారణ చేపట్టింది. విచారణ అనంతరం రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రంలో తిరిగి పోలింగ్ జరగనుంది.

శ్రీకాకుళం జిల్లాలోనూ రీపోలింగ్
ఇదిలా ఉండగా శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం రూరల్ మండలం పొన్నం పోలింగ్ కేంద్రం నంబర్ 2లో శుక్రవారం రీపోలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టనున్నారు. మొత్తంగా రాష్ట్రంలో ఐదు మండలాల్లో పోలింగ్ వాయిదా, కోసిగి మండలంలోని ఆర్లబండలో రీపోలింగ్, శ్రీకాకుళం రూరల్ మండలం పొన్నంలో మరో రీపోలింగ్‌కు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

‘വോട്ട് ചോരി’ ക്യാമ്പെയ്ന്‍ ബി.ജെ.പിയെ അപകീര്‍ത്തിപ്പെടുത്താന്‍: മോദിജിയെ ജനാധിപത്യപരമായി തോല്‍പ്പിക്കാന്‍ കഴിയില്ലെന്ന് ബോധ്യമുള്ളതിനാലാണ് ഈ നീക്കം: ബി.ജെ.പി

ന്യൂദല്‍ഹി: കോണ്‍ഗ്രസ് രാജ്യവ്യാപകമായി പ്രചരിപ്പിക്കുന്ന ‘വോട്ട് ചോരി’ കാമ്പെയ്ന്‍, ബി.ജെ.പിയുടെയും പ്രധാനമന്ത്രി...

சடலமாக மீட்கப்பட்ட 5 மீனவர்கள்: “புயல் நேரத்தில் கடலுக்குள் செல்ல அனுமதி தந்தது யார்?" – உதயநிதி

சென்னை காசிமேடு துறைமுகத்திலிருந்து கடந்த அக்டோபர் 29-ம் தேதி செல்வழகன் என்பவருக்குச்...

ഹോര്‍മുസില്‍ മാത്രമല്ല യു.എസ് ഇടക്കാല തെരഞ്ഞെടുപ്പിലും ട്രംപിന് പരാജയം സമ്മാനിച്ചു: ഇറാന്‍ ദേശീയ സുരക്ഷാ സെക്രട്ടറി

ടെഹ്‌റാന്‍: ഹോര്‍മുസ് കടലിടുക്കിലും യു.എസ് ഇടക്കാല തെരഞ്ഞെടുപ്പിലും ഡൊണാള്‍ഡ് ട്രംപിന് ഇറാന്‍...

திருப்பரங்குன்றம்: உயர் நீதிமன்றக் கிளை உத்தரவை எதிர்த்து தர்கா தரப்பில் உச்ச நீதிமன்றத்தில் மனு!

மதுரை மாவட்டம், திருப்பரங்குன்றம் மலை உச்சியில் உள்ள கல் தூணில் கார்த்திகை...