4
November, 2026

A News 365Times Venture

4
Wednesday
November, 2026

A News 365Times Venture

Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

Date:

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును కేవలం గెలుపుగా మాత్రమే కాకుండా, తమపై ఉంచిన మరింత పెద్ద బాధ్యతగా భావిస్తున్నామని మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ తెలిపారు. గత రెండున్నరేళ్లుగా ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనకు ప్రజలు అందించిన ఆశీర్వాదంగా ఈ తీర్పును స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులందరికీ నారా లోకేష్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమష్టిగా చేసిన కృషికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కూటమి ఐక్యత, నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు.

ఇక రాజకీయాలకు కాదు.. ప్రజాసేవకే ప్రాధాన్యం
మున్సిపల్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇక అందరి దృష్టి ప్రజాసేవపైనే ఉండాలని లోకేష్ సూచించారు. ఎన్నికల్లో గెలిచిన ప్రతి ప్రజాప్రతినిధి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సేవలందించాలని స్పష్టం చేశారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే ఇప్పుడు ముందున్న అసలైన బాధ్యత అని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు మరింత వినయంతో, మరింత బాధ్యతతో పనిచేయాలనే సంకల్పాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ఇక, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరింత అంకితభావంతో పనిచేస్తామని నారా లోకేష్ తెలిపారు. ప్రజాసేవ, రాష్ట్ర ప్రగతికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల విజయంతో మరింత బాధ్యత పెరిగిందని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ప్రతి ప్రజాప్రతినిధి పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు మంత్రి నారా లోకేష్‌..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

വിദ്യാർത്ഥികളോട് പ്രതികാരബുദ്ധി: കാലടി സർവ്വകലാശാല അധികൃതർക്കും സർക്കാരിനുമെതിരെ രൂക്ഷവിമർശനവുമായി ആർ. ബിന്ദു

തിരുവനന്തപുരം: കാലടി സംസ്കൃത സർവ്വകലാശാലയിലെ വിദ്യാർത്ഥി സമരവുമായി ബന്ധപ്പെട്ട് സർവ്വകലാശാല അധികൃതരും...

'நண்பா… நண்பீஸ் உங்களுக்கு அரசியல் வேண்டாம்!' – மாணவர்களுக்கு முதல்வர் விஜய் அட்வைஸ்!

தவெக கட்சி சார்பில் 10, 12 ஆம் வகுப்புகளில் நல்ல மதிப்பெண்...

ജി.എൻ.എ കരാറുമായി മുന്നോട്ടെന്ന്; സ്വകാര്യ കമ്പനികളെ പ്രോത്സാഹിപ്പിക്കണമെന്നും മുഖ്യമന്ത്രി

തിരുവനന്തപുരം: കുറഞ്ഞ നിരക്കിൽ വൈദ്യുതി വാങ്ങി സംസ്ഥാനത്തിന് 2232 കോടിയിലധികം രൂപയുടെ...

கேரளம்: "அதிக விலைக்கு மின்சாரம் வாங்க அவசரம் காட்டுவது ஏன்?"- பினராயி விஜயன் கேள்வி

கேரளத்தில் ஐ.ஏ.எஸ் அதிகாரிகள் இடமாற்றம் செய்யப்பட்டுள்ளனர். அதன் ஒரு பாகமாக கேரள...