2
November, 2026

A News 365Times Venture

2
Monday
November, 2026

A News 365Times Venture

CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం

Date:

దేశంలో పేదలు, దళితులు, గిరిజనులు , మహిళలకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కాలరాసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించిన ‘ఇండియా’ (INDIA) కూటమి మెగా ర్యాలీలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన ఆయనకు తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కులాలు, మతాల పేరుతో ప్రజలను విభజించి ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు దేశంలో దాదాపు 20 కోట్ల ఓట్లను తొలగించేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు.

400 సీట్లు రాకపోవడంతో కక్ష సాధింపు.. సీఈసీని అడ్డుపెట్టుకుని ఓట్ల కోత

2024 లోక్‌సభ ఎన్నికల్లో 400 కంటే ఎక్కువ సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లను రద్దు చేయడంతో పాటు పేదలు, దళితులు, గిరిజనులు, మహిళల ఓట్లను తొలగించాలని బీజేపీ భావించిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. అయితే ప్రజలు బీజేపీకి ఆ సంఖ్యను ఇవ్వకపోవడంతో ప్రధాని మోదీ వారిపై కక్ష పెంచుకున్నారని ఆరోపించారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన ఓటు హక్కును లాక్కునేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను కేంద్రం అడ్డుపెట్టుకుందని ధ్వజమెత్తారు. దేశంలో ఇప్పటికే 13.50 కోట్ల ఓట్లు తొలగించారని, మరో 20 కోట్ల ఓట్లను (మొత్తం ఓట్లలో 15 నుంచి 20 శాతం) తొలగించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని మండిపడ్డారు. బీహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లలో ప్రయోగాత్మకంగా ఓట్ల తొలగింపునకు పాల్పడే బీజేపీ అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు.

కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకోలేకపోయారు.. తెలంగాణ గళం ముందు తలవంచక తప్పలేదు

రామ్‌లీలా మైదాన్ సభకు తెలంగాణ నుంచి దాదాపు 15 వేల మంది కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చేలా పీసీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తే, చివరి నిమిషం వరకు నమ్మించి ఆ రైళ్లను రద్దు చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రైళ్లు లేకపోయినా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా సొంత ఏర్పాట్లతో ఢిల్లీకి చేరుకున్నారని తెలిపారు. నరేంద్ర మోదీ, అమిత్ షా, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కలసి ఎంత కుట్ర చేసినా తెలంగాణ బలమైన గళం ముందు, కాంగ్రెస్ శ్రేణుల కార్యదీక్ష ముందు తలవంచక తప్పలేదని పేర్కొన్నారు.

రాముడికి వానరసేనలా.. మోదీని దించేందుకు కాంగ్రెస్ సైన్యం

“పూర్వం రావణాసురుడిని ఓడించేందుకు శ్రీరాముడికి వానర సేన ఎలాగైతే తోడ్పడిందో, నేడు నరేంద్ర మోదీ అహంకార పాలనకు స్వస్తి పలికి ఆయనను అధికార పీఠం నుంచి గద్దె దించేందుకు కాంగ్రెస్ సైన్యం నిరంతరం పోరాడుతుంది” అని రేవంత్ రెడ్డి ఉద్బోధించారు. ఈ ప్రజాస్వామ్య పోరాటంలో విజయం సాధించే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్ నుంచి ఇండియా కూటమి ఇచ్చే పిలుపును, సందేశాన్ని తెలంగాణలోని ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికీ చేరవేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ജീന്‍സും ടീ ഷര്‍ട്ടും വേണ്ട, അധ്യാപകര്‍ മാന്യമായി വസ്ത്രം ധരിക്കണം: അധ്യാപകര്‍ക്ക് ഡ്രസ് കോഡുമായി ബീഹാര്‍ സര്‍ക്കാര്‍

പാട്‌ന: ബീഹാറില്‍ വിദ്യാഭ്യാസ സ്ഥാപനങ്ങളില്‍ പുതിയ ഡ്രസ് കോഡുമായി സര്‍ക്കാര്‍. അധ്യാപകര്‍ക്കും...

കാലടി സര്‍വകലാശാലയിലെ സമരം; വിദ്യാര്‍ത്ഥികളെ പരീക്ഷ എഴുതിക്കണമെന്ന ഹൈക്കോടതി ഉത്തരവിനെതിരെ അപ്പീലുമായി വൈസ് ചാന്‍സലര്‍

തിരുവനന്തപുരം: കാലടി സംസ്‌കൃത സര്‍വകലാശാലയില്‍ സസ്‌പെന്‍ഷന്‍ നടപടി നേരിട്ട വിദ്യാര്‍ത്ഥികള്‍ക്ക് പരീക്ഷ...

பெருந்துறை: அரசு நலத்திட்ட உதவிகளை வழங்க ஜெயக்குமார் யார்? ஆதரவு அமைச்சர்களால் சிக்கலில் அதிகாரிகள்!

2026 தமிழ்நாடு சட்டமன்றப் பொதுத்தேர்தலில் ஈரோடு மாவட்டம் பெருந்துறை சட்டமன்றத் தொகுதியில்...