1
November, 2026

A News 365Times Venture

1
Sunday
November, 2026

A News 365Times Venture

Mitchell Santner: 259 స్కోర్ చేసినా టీమిండియా ఫామ్ చూసి భయమేసింది.. ఆ ఒక్కటే మ్యాచ్‌ను మలుపుతిప్పింది: కివీస్ కెప్టెన్

Date:

నాలుగో టీ20 మ్యాచ్‌లో సాధించిన భారీ విజయంపై న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ సంతృప్తి వ్యక్తం చేశాడు. టాస్ ఓడిపోయినప్పటికీ, మైదానంలో వీచిన గాలి వల్ల మంచు ప్రభావం పెద్దగా లేకపోవడం తమకు కలసివచ్చిందని తెలిపాడు. స్కోరు బోర్డుపై 260 పరుగులు ఉంచడం మంచి పరిణామమే అయినప్పటికీ, టీమిండియా ఫామ్ వల్ల కాస్త భయమేసిందన్నారు. అయితే బలమైన బ్యాటింగ్ లైనప్‌ను అడ్డుకోవడానికి సరైన ప్రాంతాల్లో బౌలింగ్ చేయడం అత్యంత కీలకమని, తమ బౌలర్లు ఆ పనిని అద్భుతంగా పూర్తి చేశారని కొనియాడాడు.

పిచ్ తీరును త్వరగా అర్థం చేసుకుని, దానికి తగ్గట్టుగా బౌన్స్ అస్త్రాన్ని ఉపయోగించామని సాంట్నర్ తెలిపాడు. ప్రారంభంలోనే లభించిన పిచ్ బౌన్స్‌ను సద్వినియోగం చేసుకుంటూ సరైన లెంగ్త్‌లలో బౌలింగ్ చేశామని, పవర్ ప్లేలోనే కీలక వికెట్లు తీయడం మ్యాచ్‌ను తమ వైపు తిప్పిందని పేర్కొన్నాడు. మంచి బౌన్స్ ఉన్న పిచ్‌పై సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసినప్పుడు అనుకూల ఫలితాలు వస్తాయని, తమ బౌలర్లు ఈ వ్యూహాన్ని పూర్తిస్థాయిలో అమలు చేశారని చెప్పాడు.

జట్టులో ఆల్‌రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్ విరుచుకుపడిన తీరును సాంట్నర్ ప్రత్యేకంగా అభినందించాడు. తాము ఇప్పటికే మంచి స్థితిలో ఉన్నప్పటికీ, తొలి బంతి నుంచే అతడు ఆడిన విధానం జట్టు స్కోరును 220 పరుగుల నుంచి ఏకంగా 259కి చేర్చడంలో కీలక పాత్ర పోషించిందని ప్రశంసించాడు. గ్లెన్ ఫిలిప్స్ సెంచరీకి తోడుగా బ్రేస్‌వెల్ మెరుపులు జట్టుకు కొండంత బలాన్ని ఇచ్చాయని తెలిపాడు.

ఈడెన్ పార్క్ మైదానంలో బౌలింగ్ చేయడం ఎప్పుడూ సవాలేనని, అయినప్పటికీ మార్పులు చేర్పులు చేస్తూ భారత బ్యాటర్లను కష్టతరమైన షాట్లు ఆడేలా ఒత్తిడి తెచ్చామని సాంట్నర్ వివరించాడు. పవర్ ప్లేలో ఒకరి తర్వాత ఒకరికి ఒకే ఓవర్ స్పెల్స్ ఇస్తూ వైవిధ్యం ప్రదర్శించామని, బౌలర్లు మైదానంలోకి అడుగుపెట్టిన వెంటనే అనుకున్న ప్రణాళికను సరిగ్గా అమలు చేశారని కొనియాడాడు. ముఖ్యంగా పేసర్ జాకబ్ డఫీ మంచి లెంగ్త్‌తో బౌలింగ్ చేసి వికెట్లు తీసి శుభారంభం ఇచ్చాడని, ఈ విజయం జట్టులో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని సాంట్నర్ స్పష్టం చేశాడు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

അങ്ങ് പറഞ്ഞത് പോലെ കടക്ക് പുറത്തെന്നോ വീട്ടില്‍ പോയി ചോദിക്കാനോ പറഞ്ഞില്ല: പിണറായിയെ പരിഹസിച്ച് റോജി എം.ജോണ്‍

തിരുവനന്തപുരം: മഹാരാജാസ് കോളേജിലെ ബിരുദദാനച്ചടങ്ങിനിടെ നടന്ന സംഭവത്തില്‍ എസ്.എഫ്.ഐ പ്രവര്‍ത്തകയ്‌ക്കെതിരെ കോണ്‍ഗ്രസ്-...

தங்கை மகளின் திருமணம்; எலஹங்கா அரண்மனையை மறுத்த ஜெகன்; `கீழ்த்தரமானவள் நான் அல்ல' – ஷர்மிளா வேதனை

ஆந்திரப் பிரதேச காங்கிரஸ் தலைவரும், முன்னாள் முதல்வர் ஜெகன் மோகன் ரெட்டியின்...

ഇന്ത്യയുടെ ‘പ്രോക്‌സി വാര്‍’ അവസാനിപ്പിക്കുക: ഇംഫാലില്‍ വന്‍ മാര്‍ച്ച്

  ഇംഫാല്‍: മണിപ്പൂരില്‍ ഇന്ത്യ ഗവണ്‍മെന്റിന്റെ പ്രോക്‌സി യുദ്ധം അവസാനിപ്പിക്കണമെന്നും കുക്കി-സോ...