31
October, 2026

A News 365Times Venture

31
Saturday
October, 2026

A News 365Times Venture

YS Jagan: స్థానిక ఎన్నికల్లో అక్రమాలు.. శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి..

Date:

ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నాయకులకు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వంలో గతంలో ఎన్నడూ చూడని విధంగా నామినేషన్ల ఘట్టం నుంచే అక్రమాలు, దాడులు మొదలయ్యాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నామినేషన్ కేంద్రాలను ఆక్రమించడం, బి-ఫారాలను మాయం చేయడం, ఫోర్జరీ సంతకాలతో ఉపసంహరణలు చేయించడం, చివరికి రిటర్నింగ్ ఆఫీసర్లే నామినేషన్ పత్రాలను చింపేయడం వంటి దారుణాలు తొలిసారిగా చూస్తున్నామని విమర్శించారు. అధికారులను, పోలీసులను అడ్డుపెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వం ఒక మాఫియా ముఠాలా వ్యవహరిస్తోందని, ప్రజల రాజ్యాంగ హక్కులను హరిస్తోందని ఆరోపించారు.

రాబోయే పోలింగ్, లెక్కింపు సమయంలో కూడా రిగ్గింగ్ చేయడం, బ్యాలెట్ బాక్సులను మార్చడం వంటి చర్యలకు అధికార పక్షం దిగవచ్చని, అందుకే పార్టీ శ్రేణులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతి తప్పును వీడియోల రూపంలో రికార్డు చేయాలని, సీసీ కెమెరాలు లేని చోట ప్రైవేటుగానైనా కెమెరాలు ఏర్పాటు చేసి సాక్ష్యాలు సేకరించాలని సూచించారు. పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్లకు ప్రత్యేక ఓరియెంటేషన్ ఇచ్చి సమర్థవంతంగా పనిచేసేలా చూడాలని తెలిపారు.

జిల్లా అధ్యక్షులు రోజూ రెండుసార్లు అసెంబ్లీ కోఆర్డినేటర్లతో రివ్యూ నిర్వహించాలని, ఏవైనా సమస్యలు ఎదురైతే లీగల్ సెల్ ద్వారా వెంటనే న్యాయపోరాటం చేయాలని ఆదేశించారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగే పరిస్థితి లేదని, ఒక రాక్షసుడితో యుద్ధం చేస్తున్నామనే భావనతో పనిచేయాలని పేర్కొన్నారు. నామినేషన్ల సమయంలో జరిగిన అక్రమాలపై ఆధారాలు సేకరించి కోర్టు మెట్లుక్కుతామని, తప్పు చేసిన అధికారులు, నాయకులు భవిష్యత్తులో వడ్డీతో సహా చెల్లించుకుంటారని, తప్పకుండా శిక్ష అనుభవిస్తారని హెచ్చరించారు.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

‘മലിനമല്ല,’ യമുനയില്‍ ഇറങ്ങി വെള്ളം കുടിച്ച് ബി.ജെ.പി എം.പി; കെജ്‌രിവാളിനും രാഹുല്‍ ഗാന്ധിക്കും വെല്ലുവിളി!

ന്യൂദല്‍ഹി: യമുനാ നദിയിലെ മലിനീകരണ തോത് കഴിഞ്ഞ ഒരു വര്‍ഷത്തിനിടെ പകുതിയായി...

'போலீஸ் கஸ்டடி வேண்டாம்; வீட்டு சாப்பாடு வேணும்!' – புன்னகையோடு புழலுக்கு திரும்பிய அன்பில்!

தனியார் பள்ளிகளுக்கு உரிமம் வழங்கிய வழக்கில் நீதிமன்றத்தில் காவலில் புழல் சிறையில்...

ലോകത്തിലെ ഏറ്റവും വലിയ ക്രിപ്‌റ്റോ കറന്‍സി കൊള്ള; ബിനാന്‍സില്‍ നിന്ന് മോഷ്ടിക്കപ്പെട്ടത് 6.3 ബില്യണ്‍

വാഷിങ്ടണ്‍: ലോകത്തിലെ ഏറ്റവും വലിയ ക്രിപ്റ്റോകറന്‍സി എക്സ്ചേഞ്ചായ ബിനാന്‍സില്‍ നിന്ന് ഏകദേശം...

'சாப்பாடு சரியில்லை என்பதற்காக ஜாமீனா?'- அன்பில் மகேஸ் குறித்து மரிய வில்சன் பேசியதென்ன?

கடந்த திமுக ஆட்சியில் தனியார் பள்ளிகளுக்கு நிரந்தர அங்கீகாரம் வழங்க கோடிக்கணக்கில்...