27
October, 2026

A News 365Times Venture

27
Tuesday
October, 2026

A News 365Times Venture

Bengaluru IT Jobs: బెంగళూరులో ఉద్యోగాలు తెలుగు, తమిళులకేనా? యువతి ఆరోపణలపై సీఎం వార్నింగ్!

Date:

Bengaluru IT Jobs: కర్ణాటకలో స్థానిక కన్నడిగులను ఉద్దేశపూర్వకంగా ఉద్యోగాలకు దూరంగా ఉంచినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం డీకే శివకుమార్ వార్నింగ్ ఇచ్చారు. బెంగళూర్ ఐటీ కంపెనీలు కన్నడ మాతృభాషగా ఉన్న వ్యక్తులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఓ యువతి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో సీఎం స్పందించారు. ఎక్స్‌లో స్పందించిన సీఎం.. “ఏదైనా ప్రైవేట్ సంస్థ ఉద్దేశపూర్వకంగా కన్నడిగులను పక్కనపెట్టినట్లు తేలితే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది” అని అన్నారు. కర్ణాటకలో కన్నడిగులు హక్కులు, గౌరవం, ఉద్యోగావకాశాలు ఏ కారణంతో నిర్లక్ష్యం చేయడాన్ని ప్రభుత్వం అనుమతించదని అన్నారు. బెంగళూరు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారత సాంకేతిక రాజధాని అని డీకే శివకుమార్ పేర్కొన్నారు. కన్నడిగుల నైపుణ్యాలు, ప్రతిభపై తమకు గర్వం ఉందని, వారి ప్రయోజనాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

బెంగళూర్‌లోని ఐటీ కంపెనీ రిక్రూట్మెంట్ ప్రక్రియలో భాష ఆధారంగా వివక్ష చూపుతున్నారని ఓ యువతి వీడియోలో ఆరోపించింది. కన్నడ మాతృభాషగా ఉన్న అభ్యర్థులను ఇంటర్వ్యూ దశలో లేదా అంతకుముందే షార్ట్ లిస్టింగ్ సమయంలోనే తొలగిస్తున్నట్లు ఆమె చెప్పింది. తెలుగు, తమిళం మాట్లాడే వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వచ్చే యువతను తక్కువ వేతనాలకు నియమించుకుంటున్నారని కూడా ఆమె ఆరోపించింది. బెంగళూర్ కాలేజీల్లో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించడం లేదని, సమస్య పరిష్కరించాలని సీఎంను కోరారు.

యువతి ఆరోపణలు ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బీజేపీ అధికార ప్రతినిధి అశోక గౌడ స్పందిస్తూ.. ప్రైవేట్ రంగంలో కన్నడిగులకు మరిన్ని ఉద్యోగాలు కల్పించే విసయంలో కాంగ్రెస్ ఏం చర్యలు తీసుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాదని, ప్రైవేట్ రంగంలో కొత్తగా ఎన్ని ఉద్యోగాలు కల్పించారో సీఎం చెప్పాలని అడిగారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

എതിര്‍പ്പുകളെ അവഗണിച്ച് കേന്ദ്രം; പൂര്‍ണമായും എഥനോളില്‍ ഓടുന്ന വാഹനങ്ങള്‍ക്ക് അനുമതി, മോട്ടോര്‍ വെഹിക്കിള്‍ റൂള്‍സിലും ഭേദഗതി

ന്യൂദല്‍ഹി: പൂര്‍ണമായും എഥനോള്‍ ഇന്ധനമായി ഉപയോഗിച്ച് പ്രവര്‍ത്തിക്കുന്ന വാഹനങ്ങള്‍ക്ക് രാജ്യത്ത് നിരത്തിലിറങ്ങാന്‍...

“ஒரே நாளில் 17 கைதிகள் சிறையிலிருந்து தப்பிச் செல்லும் அவலநிலை நிலவுகிறது” – கனிமொழி சாடல்!

தூத்துக்குடி விமான நிலையத்தில் செய்தியாளர்களைச் சந்தித்த தூத்துக்குடி மக்களவைத் தொகுதி உறுப்பினர்...

Harmanpreet Kaur: ఇంట్లో రోజుకు మూడుసార్లు ప్రాక్టీస్ చేసేదాన్ని.. సెంచరీ వెనుక ఉన్న రహస్యం ఇదే..

భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్...

ഡാറ്റാ പ്രൊട്ടക്ഷന്‍ നിയമം: മാധ്യമസ്ഥാപനങ്ങളുടെ ഹരജിയില്‍ കേന്ദ്രത്തിന് സുപ്രീംകോടതി നോട്ടീസ്

ന്യൂദല്‍ഹി: ഡിജിറ്റല്‍ പേഴ്‌സണല്‍ ഡാറ്റാ പ്രൊട്ടക്ഷന്‍ (ഡി.പി.ഡി.പി) നിയമത്തിനെതിരായ ഹരജിയില്‍ കേന്ദ്ര...