23
October, 2026

A News 365Times Venture

23
Friday
October, 2026

A News 365Times Venture

SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!

Date:

SA vs AUS: గ్క్వెబెర్హాలో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 31 పరుగుల తేడాతో కంగారూ జట్టును చిత్తుగా ఓడించింది. వర్షం కారణంగా తొలి రెండు రోజుల్లో ఆటకు అంతరాయం కలిగినా.. దక్షిణాఫ్రికా బౌలర్లు, కెప్టెన్ టెంబా బవుమా అద్భుత బ్యాటింగ్ పటిమతో మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకున్నారు. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా 214 పరుగుల తేడాతో గెలిచింది.

టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా ఒక దశలో 110 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఈ సమయంలో కెప్టెన్ టెంబా బవుమా జట్టును ఆదుకున్నాడు. 334 బంతులు ఎదుర్కొని 18 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 179 పరుగులు చేశాడు. అతనికి తోడుగా మార్కో జాన్సెన్ 100 బంతుల్లో 85 పరుగులు, సైమన్ హార్మర్ 157 బంతుల్లో 82 పరుగులతో బవుమాకు అద్భుత సహకారం అందించారు. దీంతో దక్షిణాఫ్రికా 127.1 ఓవర్లలో 9 వికెట్లకు 425 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్ బోలాండ్ 5 వికెట్లు పడగొట్టగా.. మిచెల్ స్టార్క్ 3 వికెట్లు తీశాడు. అయినప్పటికీ దక్షిణాఫ్రికాను తక్కువ స్కోరుకు పరిమితం చేయడంలో ఆస్ట్రేలియా విఫలమైంది.

425 పరుగుల భారీ స్కోరుకు బదులుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి కేవలం 42.3 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటైంది. మార్కో జాన్సెన్ 5 వికెట్లతో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ను దెబ్బతీయగా.. వియాన్ ముల్డర్ 2, కగిసో రబడా 2 వికెట్లు తీశారు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో స్టీవ్ స్మిత్ 28 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో 326 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన దక్షిణాఫ్రికా.. ఆస్ట్రేలియాను ఫాలోఆన్‌కు పంపింది. ఫాలోఆన్ ఆడిన ఆస్ట్రేలియాకు ట్రావిస్ హెడ్ అద్భుత పోరాటం చేశాడు. 190 బంతుల్లో 15 ఫోర్లతో 121 పరుగులు చేసి శతకం సాధించాడు. అతడితో పాటు స్కాట్ బోలాండ్ 166 బంతుల్లో 40 పరుగులు చేశాడు. అలెక్స్ క్యారీ అజేయంగా 37 పరుగులు చేశాడు. అయితే మిగతా బ్యాటర్లు దక్షిణాఫ్రికా బౌలర్లను ఎదుర్కోలేకపోయారు. చివరకు ఆస్ట్రేలియా 107.1 ఓవర్లలో 295 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇన్నింగ్స్ 31 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా విజయాన్ని అందుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో కగిసో రబడా 4 వికెట్లు పడగొట్టగా.. వియాన్ ముల్డర్ 3, సైమన్ హార్మర్ 2 వికెట్లు తీశారు. మార్కో జాన్సెన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. కెప్టెన్ టెంబా బవుమాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఈ విజయంతో దక్షిణాఫ్రికా అరుదైన ఘనత సాధించింది. ఆస్ట్రేలియాకు ఫాలోఆన్ ఇచ్చి టెస్టు మ్యాచ్ గెలవడం 56 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరిసారిగా 1970లో డర్బన్ వేదికగా ఆస్ట్రేలియాపై ఫాలోఆన్ ఇచ్చిన తర్వాత దక్షిణాఫ్రికా విజయం సాధించింది. 1902లో కూడా దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాకు ఫాలోఆన్ ఇచ్చింది. అయితే ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇప్పుడు 2026లో గ్క్వెబెర్హాలో మరోసారి అదే తరహాలో విజయం సాధించి చరిత్రను పునరావృతం చేసింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഫ്രാന്‍സിലെ പ്രക്ഷോഭം: രാജ്യത്ത് ‘നിയമവിരുദ്ധമായ’ പ്രകടനങ്ങള്‍ നിരോധിക്കുമെന്ന് മാക്രോണ്‍

പാരീസ്: രാജ്യത്ത് ‘നിയമവിരുദ്ധമായ’ പ്രതിഷേധ പ്രകടനങ്ങള്‍ നിരോധിക്കുമെന്ന് ഫ്രഞ്ച് പ്രസിഡന്റ് ഇമ്മാനുവല്‍...

போராட்டங்களால் தடுமாறும் தவெக மேலிடம்? புலம்பும் உளவுத்துறை; திணறும் போலீஸ்

தலைநகரான சென்னையில் போராட்டங்களுக்கு அனுமதி கொடுக்கும் விவகாரங்களில் தவெக அரசின் 'மேலிடம்'...

മൈസൂരു ദസറ; ദളിത് മന്ത്രിമാര്‍ പൂജ നടത്തുന്നത് തടഞ്ഞ് പൊലീസ്: വീഡിയോ, വിവാദം

ബെംഗളൂരൂ: മൈസൂരു ദസറ ആഘോഷങ്ങളില്‍ പങ്കെടുക്കുന്നതില്‍ നിന്ന് ദളിത് സമുദായത്തില്‍ നിന്നുള്ള...

விழுப்புரம்: செஞ்சி சிறுமி மாயமான விவகாரத்தில் பின்தங்கிய காவல்துறை; களமிறங்கிய சிபிசிஐடி போலீஸார்!

விழுப்புரம் மாவட்டம், செஞ்சி ஆலம்பூண்டி ஊராட்சிக்குட்பட்ட ஒரு கிராமத்தைச் சேர்ந்த 7...