19
October, 2026

A News 365Times Venture

19
Monday
October, 2026

A News 365Times Venture

AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..

Date:

ఆంధ్రప్రదేశ్‌లో ఉత్కంఠ రేకెత్తిస్తున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ గడువు ముగిసింది. చివరి రోజైన ఆదివారం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ పట్టణ స్థానిక సంస్థల (యూఎల్‌బీ) రిటర్నింగ్ అధికారి (RO) కార్యాలయాల వద్ద అభ్యర్థులు, నాయకులు భారీ సంఖ్యలో బారులు తీరారు. నిర్ణీత గడువు ప్రకారం మధ్యాహ్నం 3 గంటలలోపు ఆఫీసులకు చేరుకున్న అభ్యర్థులందరి నామినేషన్లను అధికారులు స్వీకరించారు. అయితే, పలుచోట్ల నామినేషన్లు వేయకుండా తమను అడ్డుకుంటున్నారంటూ విపక్ష వైకాపా నేతలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు చేశారు. నామినేషన్ల స్వీకరణలో ఇబ్బందులు తలెత్తిన కొన్ని జిల్లాల అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) స్వయంగా మాట్లాడి పరిస్థితిని సమీక్షించింది.

నామినేషన్ల పరిశీలన.. 21న ఉపసంహరణకు తుది గడువు

నామినేషన్ల పర్వం ముగియడంతో ఎన్నికల యంత్రాంగం తదుపరి ప్రక్రియపై దృష్టి సారించింది. సోమవారం (ఈనెల 19న) నుంచి అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన (స్క్రిూటినీ) ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆయా వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల పత్రాలను పరిశీలించి అర్హతలను ఖరారు చేయనున్నారు. ఇక నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 21వ తేదీ వరకు తుది గడువు విధించారు. ఆ రోజు మధ్యాహ్నం తర్వాత బరిలో నిలిచే తుది అభ్యర్థుల జాబితా స్పష్టమగనుంది. పట్టణ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను అక్టోబర్ 28న నిర్వహించనుండగా, అక్టోబర్ 30న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

അന്ധമായ രാഷ്ട്രീയ ആരാധന രാജ്യത്തിന്റെ അടിത്തറ തകര്‍ക്കും; ‘അന്ധങ്ങള്‍ ആകാതിരിക്കുക’; ജന്തര്‍മന്തര്‍ സമരത്തിന് പിന്തുണയുമായി ജോബ് കുര്യന്‍

  തിരുവനന്തപുരം: അന്ധമായ രാഷ്ട്രീയ കൂറും നേതാക്കളോടുള്ള ആരാധനയും രാജ്യത്തിന്റെ പുരോഗതിക്ക്...

போதைப்பொருள்: “தவெக கட்சியா இல்ல Narcos கூடாரமா?" – உதயநிதி ஸ்டாலின் கேள்வி

நாகப்பட்டினத்தில் தவெக நிர்வாகிக்கு சொந்தமான வீட்டில் 135 கிலோ எடையுள்ள 'மெத்'...

കോക്രോച്ച് ജനതാ പാർട്ടിയെ നേരിടാൻ ലാൽ ഹിറ്റ് ജനതാ പാർട്ടി

ന്യൂദൽഹി: മുഖ്യ തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷണർ ഗ്യാനേഷ് കുമാറിന്റെ രാജി ആവശ്യപ്പെട്ട് കോക്രോച്ച്...

ஆயுத பூஜை: “உழைப்பின் உயர்வையும், தொழிலின் மேன்மையையும் போற்றும்" – முதல்வர் விஜய் வாழ்த்து

நவ​ராத்​திரி நிறை​வாக கொண்​டாடப்​படும் சரஸ்​வதி பூஜை, ஆயுத பூஜை, விஜயதசமி பண்​டிகைகளை...