15
October, 2026

A News 365Times Venture

15
Thursday
October, 2026

A News 365Times Venture

AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్

Date:

AP MPTC, ZPTC Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం.. మరోవైపు.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన అంశంపై హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు వీలుగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో లేదా ఎన్నికల అధికారి కార్యాలయాల్లో తగిన ఏర్పాట్లు చేయాలని వైఎస్సార్సీపీ తన పిటిషన్‌లో విజ్ఞప్తి చేసింది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు నామినేషన్ల ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. ఇదిలా ఉండగా, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు, నో డ్యూస్ సర్టిఫికెట్లు జారీ చేయడానికి సంబంధించిన అంశంపై మరో పిటిషన్ కూడా దాఖలైంది. ఈ రెండో పిటిషన్‌పై విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. దీంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లపై హైకోర్టు తదుపరి చర్యలు ఎలా ఉండనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

മാപ്പാക്കണം; ദല്‍ഹിയിലെ ഇന്റര്‍നെറ്റ് നിരോധനത്തില്‍ സുപ്രീം കോടതിയില്‍ നിരുപാധികം മാപ്പപേക്ഷിച്ച് സുപ്രീം കോടതി

  ന്യൂദല്‍ഹി: സി.ജെ.പി പ്രതിഷേധത്തോടനുബന്ധിച്ച് ദല്‍ഹിയില്‍ ഇന്റര്‍നെറ്റ് റദ്ദാക്കിയ നടപടിയില്‍ സുപ്രീം...

ചിരിക്കൂ, നിങ്ങള്‍ നിരീക്ഷണത്തിലാണ്; ദല്‍ഹി പൊലീസിനെതിരെ വീഡിയോ പങ്കുവെച്ച് ധ്രുവ് റാഠി

ന്യൂദല്‍ഹി: ദല്‍ഹി പൊലീസും ഇന്റലിജന്‍സും ബ്യൂറോയും തന്നെ നിരന്തരം നിരീക്ഷിക്കുകയും പിന്തുടരുകയും...