15
October, 2026

A News 365Times Venture

15
Thursday
October, 2026

A News 365Times Venture

Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్

Date:

జర్మనీలోని బోఖుమ్ నగరంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ నివాస భవనంలో చెలరేగిన మంటల్లో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి అదే భవనంలో నివసిస్తున్న 41 ఏళ్ల రొమేనియా దేశస్థుడిని పోలీసులు హత్య అనుమానంతో అరెస్ట్ చేశారు. అగ్నిప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఉద్దేశపూర్వకంగా నిప్పంటించారా? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఈ ప్రమాదంలో 25, 27 ఏళ్ల వయసున్న ఇద్దరు మహిళలు, 26 ఏళ్ల యువకుడు మరణించారు. వీరంతా భారతీయులు. మంటలను అదుపు చేసేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బంది భవనం రెండో అంతస్తులోని ఓ అపార్ట్‌మెంట్‌లో మృతదేహాలను గుర్తించారు. ఈ ఘటనలో మరో ఐదుగురు పొగ పీల్చడంతో అస్వస్థతకు గురయ్యారు. కిత్స కోసం బోఖుమ్‌లోని ఆసుపత్రులకు తరలించారు. అయితే గాయపడిన వారి జాతీయతకు సంబంధించిన వివరాలను స్థానిక మీడియా వెల్లడించలేదు. అగ్నిప్రమాదానికి సంబంధించి పోలీసులు అదే భవనంలో నివసించే 41 ఏళ్ల రొమేనియా దేశస్థుడిని అదుపులోకి తీసుకున్నారు. హత్య కోణంలో అరెస్ట్ చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి.

ప్రాథమిక దర్యాప్తులో భవనంలో సాంకేతిక లోపం కారణంగా మంటలు చెలరేగినట్లు కనిపించడం లేదని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఎవరో ఉద్దేశపూర్వకంగా నిప్పంటించి ఉండవచ్చనే అనుమానంతో దర్యాప్తు చేపట్టారు. అయితే మంటలు కావాలనే పెట్టారా? లేక ప్రమాదవశాత్తు చెలరేగాయా? అనే విషయంపై దర్యాప్తు జరుగుతోంది. ముగ్గురు భారతీయుల ప్రాణాలను బలిగొన్న ఈ ఘటనపై జర్మనీ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అగ్నిప్రమాదానికి అసలు కారణం, అరెస్టయిన వ్యక్తి పాత్ర, మంటలు ఉద్దేశపూర్వకంగా పెట్టారా అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ചിരിക്കൂ, നിങ്ങള്‍ നിരീക്ഷണത്തിലാണ്; ദല്‍ഹി പൊലീസിനെതിരെ വീഡിയോ പങ്കുവെച്ച് ധ്രുവ് റാഠി

ന്യൂദല്‍ഹി: ദല്‍ഹി പൊലീസും ഇന്റലിജന്‍സും ബ്യൂറോയും തന്നെ നിരന്തരം നിരീക്ഷിക്കുകയും പിന്തുടരുകയും...

ദല്‍ഹിയില്‍ പ്രതിഷേധക്കാര്‍ക്ക് നേരെ അക്രമം അഴിച്ചുവിട്ട ഹിന്ദു രക്ഷാ ദള്‍ പ്രവര്‍ത്തകന് മണിക്കൂറുകള്‍ക്കകം ജാമ്യം; മാലയിട്ട് സ്വീകരിച്ച് അനുയായികള്‍

  ന്യൂദല്‍ഹി: ദല്‍ഹിയില്‍ പ്രതിഷേധ പ്രകടനത്തിനിടെ സ്ത്രീകള്‍ ഉള്‍പ്പെടെയുള്ളവര്‍ക്ക് നേരെ ക്രൂരമായ...

'நான் முதல்வர் விஜய்யை பாராட்டவே இல்லை!' – வழக்கிலிருந்து விலகிய உச்சநீதிமன்ற நீதிபதி!

உச்ச நீதிமன்ற நீதிபதி சஞ்சய் குமார் தமிழக முதல்வர் விஜய் மிகச்சிறப்பாக...