12
October, 2026

A News 365Times Venture

12
Monday
October, 2026

A News 365Times Venture

Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..

Date:

Mahant Rajudas: అయోధ్యలోని ప్రసిద్ధ హనుమాన్‌గఢి ఆలయ మహంత్ రాజూదాస్ కాక్రోచ్ జనతా పార్టీ(CJP) నిరసనలపై తీవ్రంగా స్పందించారు. నిరసనల్లో పాల్గొంటున్న జెన్-జీ‌పై ప్రధాని నరేంద్రమోడీ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని సీజేపీ నిరసన తెలుపుతోంది. దీనిపై రాజూదాస్ మాట్లాడుతూ.. జెన్-జీ యువత దేశాన్ని ఏకం చేయాలి, కానీ విభభించేది కాదని అన్నారు. దేశాన్ని ముక్కలు చేయాలని భావించే యువతపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో తామంతా ప్రధాని మోడీ వెంటే ఉంటామని అన్నారు. భారతదేశం ముక్కలవుతుందని నినాదాలు చేసే జెన్-జీ దేశద్రోహులు, మతద్రోహులు అవుతారని, దేశాన్ని ఏకం చేసే యువత మనకు కావాలని అన్నారు.

హిందూ జాతి, రామరాజ్యం గురించి మాట్లాడుతూ.. రామరాజ్యంలో పరస్పర సంప్రదింపులు ఉంటాయని, వివాదాలు ఉండవని, అందరూ కలిసి జీవిస్తారని, కలిసి అభివృద్ధి చెందుతారని అన్నారు. దేశంలో నివసిస్తున్న ప్రతీ పౌరుడు జాతీయవాదిగా ఉండాలని అన్నారు. మతం ఆధారంగా దేశాన్ని ముస్లింలు విభజించారని అన్నారు. ముస్లింలు ఇప్పటికే (పాకిస్తాన్) వారి దేశాన్ని తీసుకున్నారని అన్నారు. ఇదిలా ఉంటే, బెయిల్‌పై విడుదలైన సీజేపీ నేతలు ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో ఎమర్జెన్సీ ఉందని, ప్రభుత్వ యంత్రాంగం సొంత ప్రజలకు ఎదురుతిరుగుతోందని అన్నారు. పోలీసులు తమకు ఎలాంటి అధికారిక నోటీసు ఇవ్వకుండా నిర్బంధించారని, తమ మొబైల్ ఫోన్లు లాక్కుని, తమ న్యాయవాదుల్ని కలిసే అవకాశం ఇవ్వలేదని సీజేపీ నేత సౌరవ్ దాస్ ఆరోపించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

വിദ്യാർത്ഥി പ്രക്ഷോഭത്തെ നേരിടാൻ യു.ഡി.എഫ് സർക്കാർ പൊലീസിന് മദ്യവും ഇടിവളയും നൽകി ഇറക്കി: എം. ശിവപ്രസാദ്

പാലക്കാട്: ദൽഹിയിൽ എസ്.എഫ്.ഐ അഖിലേന്ത്യാ പ്രസിഡന്റ് ആദർശ് എം. സജി, ജെയ്ക്...

`எந்த விஜய்யை வைத்து நீங்கள் இழிவுபடுத்த நினைக்கிறீர்களோ, அதே விஜய்யே…' – திருமாவளவன்

திண்டிவனத்தில் விசிக மாநாடு நேற்று (அக். 11) நடைபெற்றது. இதில் கலந்துகொண்டு...

கைக்குழந்தையுடன் எம்.எல்.ஏ பல்லவி: "இது அரசியல் விளம்பரமாக தோன்றுகிறது" – கார்த்தி சிதம்பரம் சாடல்

சென்னை திரு.வி.க. நகர் தொகுதியின் எம்.எல்.ஏ. பல்லவி. இவர் பெரும்பாலும் தான்...