8
October, 2026

A News 365Times Venture

8
Thursday
October, 2026

A News 365Times Venture

Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ

Date:

నేటి కాలంలో పెళ్లికాని ప్రసాద్‌లు పెరిగిపోతున్నారు. కారణాలేంటో తెలియదు గానీ బ్యాచ్‌లర్స్ ఎక్కువైపోతున్నారు. తాజాగా కర్ణాటకలో అయితే ఓ రైతు పెళ్లి కావడం లేదని ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ దగ్గరకు వెళ్లి మొర్రపెట్టుకున్నాడు. అమ్మాయి దొరకడం లేదని ఆవేదన చెందాడు. అలాంటిది ఓ బిచ్చగాడు ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 21 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఇదెలా సాధ్యమైంది? ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన ఈ స్టోరీ ఏంటో చదివేయండి.

S54

బంగ్లాదేశ్‌కు చెందిన మోరు మియా(35) అనే యువకుడు బిచ్చగాడు. ఓ పూరి గుడిసెలో ఉంటూ భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. అలాంటి వ్యక్తిని ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 21 మంది మహిళలు పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కనీసం భార్యల పేర్లు కూడా చెప్పలేని బిచ్చగాడిని అంత మంది ఎలా పెళ్లి చేసుకున్నారని నెటిజన్లను ఆశ్చర్యానికి గురవుతున్నారు.

మోరు మియా బంగ్లాదేశ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎవరినీ పెళ్లి చేసుకోవాలని స్వయంగా కోరుకోలేదని చెప్పాడు. తనను పెళ్లి చేసుకోవాలంటూ మహిళలే తన దగ్గరకు వచ్చేవారని తెలిపాడు. ముఖ్యంగా తన కంటే వయసులో పెద్దవాళ్లు కూడా పెళ్లి ప్రతిపాదనలు చేసేవారని చెప్పాడు. తనను చూసి మహిళలకు ఏం నచ్చుతుందో తనకు తెలియదని వాపోయాడు. “నాలో వాళ్లకు ఏం కనిపిస్తుందో నాకు తెలియదు. దానికి వాళ్లే సమాధానం చెప్పాలి. మహిళలే నా దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకుందామని అడుగుతారు” అని మీడియాతో చెప్పినట్లు కథనాలు పేర్కొన్నాయి. ఎవరైనా తనను పెళ్లి చేసుకోవాలని కోరినప్పుడు వారిని తిరస్కరించడం తనకు ఇష్టం ఉండేది కాదని తెలిపాడు. మహిళల పెళ్లి ప్రతిపాదనను కాదనడం అగౌరవంగా భావించేవాడినని, అందుకే అంగీకరించేవాడినని చెప్పాడు.

21 మంది భార్యలు ఉన్నప్పటికీ మోరు మియా జీవితం మాత్రం చాలా సాధారణంగా ఉంటుందని స్థానిక కథనాలు చెబుతున్నాయి. అతను ఒకే గదితో ఉన్న చిన్న ఇంట్లో నివసిస్తున్నట్లు సమాచారం. బిచ్చమెత్తడమే అతని ప్రధాన ఆదాయ వనరు. ప్రతిరోజూ బిచ్చమెత్తేందుకు వెళ్లేటప్పుడు ఒక్కో భార్య తన వెంట వస్తుందని, భార్యలు వంతుల వారీగా తనతో కలిసి బయటకు వస్తారని మోరు తెలిపినట్లు నివేదికలు పేర్కొన్నాయి. రిపోర్టర్లు మోరు మియాను అతని 21 మంది భార్యల పేర్లు చెప్పాలని అడిగారు. అయితే అతను కొంతమంది పేర్లను మాత్రమే గుర్తు చేసుకోగలిగాడు. షీలా, నర్గిస్, సెలీనా, ఆలియా, తారా, జ్యోత్స్నా, రాబియా, పారుల్ వంటి పేర్లను చెప్పినట్లు కథనాలు వెల్లడించాయి. ఇంతమంది భార్యలు ఉండటంతో అందరి పేర్లను గుర్తుపెట్టుకోవడం తనకు కష్టంగా ఉంటుందని అంగీకరించాడు.

భిన్న స్పందనలు

మోరు మియా ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు అతడి పరిస్థితిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ కథనాన్ని మరో కోణంలో చూడాలని సూచిస్తున్నారు. సమాజంలో వివాహం కాకుండా మిగిలిపోయిన లేదా నిర్లక్ష్యానికి గురైన మహిళలకు మోరు మియా తోడుగా నిలిచి ఉండవచ్చని కొందరు అభిప్రాయపడ్డారు. “వాళ్లకు ఒక మనిషి పేరు, జీవితంపై ఆశ కావాలనే అతడిని భర్తగా అంగీకరించి ఉండొచ్చు. సమాజం తిరస్కరించిన మహిళలను అతను అంగీకరించాడు” అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరోవైపు.. “మహిళలను ఆకట్టుకోవడంలో అతడి టాలెంట్‌ను అధ్యయనం చేయాలి” అంటూ మరొకరు సరదాగా స్పందించారు. ఇంకొందరు మాత్రం ఇలాంటి ఘటనలు దక్షిణాసియా సమాజంలో మాత్రమే సాధ్యమంటూ కామెంట్లు చేశారు.

 

 

 

 

 

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഇഷ്ടമുള്ള വസ്ത്രം മൗലികാവകാശം; സ്‌കൂളില്‍ അധ്യാപികയ്ക്ക് ചുരിദാര്‍ ധരിച്ച് വരാമെന്ന് ഹൈക്കോടതി

കൊച്ചി: ഇഷ്ടമുള്ള വസ്ത്രം ധരിക്കാനുള്ള അവകാശം പൗരന്റെ മൗലികാവകാശത്തിന്റെ ഭാഗമാണെന്ന് ഹൈക്കോടതി....

தூத்துக்குடி: ஸ்ரீவைகுண்டம் தவெக எம்எல்ஏ சரவணன் மீது பணமோசடி புகார்; வைரலாகும் வீடியோ!

தூத்துக்குடி மாவட்டம், ஏரல் அருகேயுள்ள புதுமனை அம்மாள் தோப்பு பகுதியைச் சேர்ந்தவர்...

രാഹുല്‍ ഗാന്ധി എന്തുകൊണ്ട് ഗ്യാനേഷ് കുമാറുമായി കൂടിക്കാഴ്ച നടത്തുന്നില്ല: വോട്ട് ചോരിയുടെ പേറ്റന്റ് അവകാശം കോണ്‍ഗ്രസിന്: കേന്ദ്ര മന്ത്രി

ന്യൂദല്‍ഹി: മുഖ്യ തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷണര്‍ ഗ്യാനേഷ് കുമാറിനെതിരായ പ്രതിപക്ഷ പ്രതിഷേധത്തില്‍ ലോക്‌സഭാ...

தாராபுரம், மதுராந்தகம்: "தவெக 75 ஆயிரம் வாக்குகள் வித்தியாசத்தில் வெல்லும்" – செங்கோட்டையன் உறுதி

ஈரோடு மாவட்டத்தில் மக்களுக்கான நலத்திட்டங்களைத் தொடங்கி வைத்து செய்தியாளர்களிடம் பேசிய அமைச்சர்...