7
October, 2026

A News 365Times Venture

7
Wednesday
October, 2026

A News 365Times Venture

Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య

Date:

మహారాష్ట్రలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెట్రోల్ బంక్‌ను సీజ్ చేసేందుకు వెళ్లిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) అధికారిని కత్తితో పొడిచి హత్య చేశారు. హింగోలీ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఇండియన్ ఆయిల్ సేల్స్ మేనేజర్ మహేశ్ షెల్కే ప్రాణాలు కోల్పోయారు. పెట్రోల్ బంక్ ఆపరేటర్ కుటుంబంతో తలెత్తిన వివాదం ఈ హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది.

మంగళవారం సాయంత్రం చోంధి గ్రామంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గరకు మహేశ్ షెల్కేతో పాటు కంపెనీ అధికారులు వెళ్లారు. సాంకేతిక సమస్యల కారణంగా ఆ పెట్రోల్ బంక్ గత మూడు నెలలుగా మూసి ఉంది. దీంతో కంపెనీ నిబంధనల ప్రకారం బంక్‌ను సీజ్ చేసేందుకు అధికారులు అక్కడికి వెళ్లినట్లు సమాచారం. ఈ పెట్రోల్ బంక్‌ను సాహెబ్రావ్ పాండవ్‌వీర్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అధికారులు సీజ్ ప్రక్రియ చేపట్టే సమయంలో మరో నెల రోజుల గడువు ఇవ్వాలని ఆపరేటర్ కుటుంబ సభ్యులు కోరినట్లు సమాచారం. అయితే అధికారులు అందుకు అంగీకరించకపోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో సాహెబ్రావ్ పాండవ్‌వీర్ కుమారుడు ఉమేశ్ పాండవ్‌వీర్.. మహేశ్ షెల్కేపై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ఆయనను ఏకంగా ఏడుసార్లు కత్తితో పొడిచినట్లు వెల్లడించారు. ఈ దాడిలో మహేశ్ షెల్కే పొత్తికడుపు, వీపు, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలిన ఆయన.. చికిత్స అందించేలోపే ప్రాణాలు కోల్పోయారు.

దాడి అనంతరం నిందితుడు ఉమేశ్‌తో పాటు మరికొందరు వ్యక్తులు రెండు కార్లలో అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై కురుందా పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మహేశ్ షెల్కే మృతిపై ఇండియన్ ఆయిల్ చైర్మన్ అర్విందర్ సింగ్ సహ్నీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనే తమ సహోద్యోగిపై దాడి చేసి హత్య చేయడం దారుణమని పేర్కొన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన సహ్నీ.. మహేశ్ షెల్కే కుటుంబానికి కంపెనీ అండగా ఉంటుందని తెలిపారు. నిందితులపై వేగంగా, కఠిన చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు వెల్లడించారు.

హర్దీప్ పూరీ

కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహేశ్ షెల్కే హత్యను ‘షాకింగ్, ఆమోదయోగ్యం కాని హింసాత్మక చర్య’గా అభివర్ణించారు. హింగోలీ జిల్లాలో ఇండియన్ ఆయిల్ రిటైల్ అవుట్‌లెట్‌ను కంపెనీ స్వాధీనం చేసుకునే ప్రక్రియలో భాగంగా వెళ్లిన అధికారుల బృందంలో మహేశ్ షెల్కే ఉన్నారని పూరీ తెలిపారు. విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనే పదునైన ఆయుధంతో ఆయనపై దాడి చేసి హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. నిందితులపై చట్ట ప్రకారం వేగంగా, కఠిన చర్యలు తీసుకునేలా మహారాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల ఉన్నతాధికారులతో ఈ అంశాన్ని చర్చించినట్లు పూరీ తెలిపారు. దేశానికి ఇంధన సేవలు అందించేందుకు పనిచేస్తున్న సిబ్బంది భద్రత, గౌరవం, రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఆయన పేర్కొన్నారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ധ്രുവ് റാഠി വ്യാഴാഴ്ച ബെംഗളൂരുവില്‍: എസ്.ഐ.ആറിനെതിരായ പ്രതിഷേധത്തില്‍ പങ്കുചേരാന്‍ ആഹ്വാനം ചെയ്ത് പ്രകാശ് രാജ്

ബെംഗളൂരു: ബെംഗളൂരു ഫ്രീഡം പാര്‍ക്കില്‍ വ്യാഴാഴ്ച നടക്കുന്ന എസ്.ഐ.ആറിനെതിരായ പ്രതിഷേധത്തില്‍ പൊളിറ്റിക്കല്‍...

'வெற்றிப் பயணத்தால் மூன்றில் ஒரு பங்கு வருமானம் போச்சு!' – ஆட்டோ ஓட்டுநர்கள் என்ன சொல்கிறார்கள்?

முதல்வர் விஜய் தொடங்கி வைத்த வெற்றிப் பயணம் என்கிற கட்டணமில்லா பேருந்து...

സമരത്തിന് വരുന്നവര്‍ ബാഗുകളൊക്കെ പാക്ക് ചെയ്‌തോളു, നീണ്ടരാത്രിയായിരിക്കും: ദല്‍ഹി പൊലീസിന് മുന്നറിയിപ്പ് നല്‍കി സി.ജെ.പി

ന്യൂദല്‍ഹി: മുഖ്യതെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷണര്‍ ഗ്യാനേഷ് കുമാറിന്റെ രാജി ആവശ്യപ്പെട്ട് ഒക്ടോബര്‍ പത്തിന്...

`மின்வெட்டை மிஞ்சும் அளவுக்குத் தலைதூக்கும் அரிவாள் வெட்டு'- தவெக ஆட்சி குறித்து ஸ்டாலின் விமர்சனம்

"தமிழ்நாட்டின் சட்டம் ஒழுங்கு நாளாக, நாளாக மிக மிக ஆபத்தான கட்டத்தை...