6
October, 2026

A News 365Times Venture

6
Tuesday
October, 2026

A News 365Times Venture

FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..

Date:

హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో బీజేపీకి చెందిన మాజీ BJYM జాతీయ కోశాధికారి, రౌడీ షీటర్ పీఎం సాయి ప్రసాద్‌పై ఆరోపణలతో కేసు నమోదైంది. బీజేపీ మహిళా మోర్చా సోషల్ మీడియా కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సొంత పార్టీకి చెందిన మహిళా నేతను, ఆమె కుటుంబాన్ని వేధించడం, బెదిరింపులకు గురిచేయడం వంటి తీవ్రమైన అంశాలు ఈ కేసుకు దారితీశాయి.

ఈ ఘటనకు సంబంధించి నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (BNS), ఐటీ చట్టం, అలాగే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కఠినమైన సెక్షన్లను పోలీసులు చేర్చారు. మహిళల పట్ల అనుచిత ప్రవర్తనకు పాల్పడినందుకు BNS సెక్షన్ 75, పదేపదే వెంబడించినందుకు సెక్షన్ 78, మహిళ గౌరవానికి భంగం కలిగించినందుకు సెక్షన్ 79 కింద కేసులు నమోదయ్యాయి. అలాగే ప్రాణహాని లేదా తీవ్రమైన బెదిరింపులకు పాల్పడినందుకు సెక్షన్ 351(3), ఉద్దేశపూర్వకంగా అవమానించినందుకు సెక్షన్ 352 వర్తింపజేశారు.

ఇలాగే ఇతరుల సమాచారాన్ని, పాస్‌వర్డ్‌లను అనధికారికంగా ఉపయోగించినందుకు ఐటీ చట్టం సెక్షన్ 66C, మహిళల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా వ్యవహరించినందుకు సెక్షన్ 66E కింద కేసులు నమోదు చేశారు. వీటితో పాటు బాధితురాలి సామాజిక వర్గాన్ని ఉద్దేశించి బహిరంగంగా అవమానించడం, కులం పేరుతో దూషించడం, మహిళలపై బలప్రయోగం లేదా లైంగిక స్వభావంతో కూడిన దాడులకు పాల్పడిన ఆరోపణలపై ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్ 3(1)(r), 3(1)(s), మరియు 3(1)(w)(i, ii) కింద కూడా కేసులు పెట్టారు.

సొంత పార్టీకి చెందిన మహిళా నాయకురాలే ఈ విధంగా వేధింపులకు గురికావడం, అది కూడా రౌడీ షీటర్‌గా పేరున్న వ్యక్తిపై ఫిర్యాదు చేయడం రాజకీయ వర్గాల్లో.. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై సాయి ప్రసాద్‌‌తో పాటు ఆయన అనుచరులపై కూడా అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు కావడంతో, పోలీసులు ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

എങ്ങനെ കഥ പറയണമെന്നുള്ളതും പ്രധാനമാണ്: മാധ്യമപ്രവര്‍ത്തകര്‍ക്ക് മാര്‍ഗനിര്‍ദേശമിറക്കി ദല്‍ഹി പൊലീസ്

ന്യൂദല്‍ഹി: തലസ്ഥാനത്ത് എസ്.ഐ.ആറിനെതിരെയും മുഖ്യതെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷണര്‍ക്കെതിരെയും നടക്കുന്ന പ്രതിഷേധം റിപ്പോര്‍ട്ട് ചെയ്യാനെത്തുന്ന...

“செவிலியர்களை ஏமாற்றியிருக்கிறது இந்த ரீல் அரசு..!" – எம்.பி கனிமொழி

தமிழ்நாடு இடைநிலை சுகாதாரப் பணியாளர்கள் பொறுப்பில் இருக்கும் செவிலியர்கள் ஆயிரக்கணக்கானோர் சென்னை...

Dool In-Depth: ഒരു വീട്ടില്‍ നിന്ന് തുടങ്ങിയ പ്രതിഷേധം; സ്പെയിന്‌നെ തെരഞ്ഞെടുപ്പിലേക്ക് തള്ളിയ ഭവനപ്രതിസന്ധി എന്താണ്?

ഒരു വീട് നഷ്ടപ്പെട്ട 87കാരിയുടെ കണ്ണീരില്‍ നിന്ന് ആരംഭിച്ച പ്രതിഷേധം ഒടുവില്‍...

தவெக: 'மெழுகுவர்த்தி சண்டை இல்ல; கௌரவச் சண்டை?' – சர்ச்சையான நவல்பட்டு விஜி; பின்னணி என்ன?

திருச்சியில் நடந்த அரசு சமுதாய வளைகாப்பு நிகழ்ச்சி ஒன்றில் தனக்கு முன்பாக...