6
October, 2026

A News 365Times Venture

6
Tuesday
October, 2026

A News 365Times Venture

Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!

Date:

Hyderabad: హైదరాబాద్‌లో హనీట్రాప్ పేరుతో జరిగిన సైబర్ మోసం కేసును పోలీసులు ఛేదించారు. ఓ వయోవృద్ధ రిటైర్డ్ ఉద్యోగిని టార్గెట్ చేసిన సైబర్ నేరగాడు.. మహిళ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతా సృష్టించి బాధితుడితో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత వివిధ రకాలుగా బెదిరించి ఏకంగా రూ.38 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. నిందితుడు మహిళ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను సృష్టించి వయోవృద్ధ రిటైర్డ్ ఉద్యోగికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. బాధితుడితో పరిచయం పెంచుకుని నమ్మకం సంపాదించాడు. తొలుత గృహ అవసరాలు, ఇతర కారణాలను చెబుతూ డబ్బులు తీసుకున్నాడు. ఆ తర్వాత బాధితుడితో అసభ్యకరంగా చాటింగ్ చేసి, ఆ సంభాషణలను అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడ్డాడు. మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని బెదిరించాడు.

పోలీసులమంటూ ఫోన్ కాల్స్ చేయడం, కేసులు పెడతామని భయపెట్టడం వంటి పద్ధతులతో బాధితుడి నుంచి దశలవారీగా భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. మొత్తంగా రూ.38 లక్షలు వసూలు చేసినట్లు కేసు దర్యాప్తులో వెల్లడైంది. మోసాన్ని గుర్తించిన బాధితుడు సైబర్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాల ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

ఈ కేసులో పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన 26 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ సోషల్ మీడియా ఖాతాలు, ఫోన్ కాల్స్, చాటింగ్ ద్వారా బాధితుడిని ఎలా ట్రాప్ చేశాడనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో వృద్ధులను లక్ష్యంగా చేసుకుని నకిలీ సోషల్ మీడియా ఖాతాలతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మహిళల పేరుతో ఫేక్ ప్రొఫైల్స్ సృష్టించి ఫ్రెండ్ రిక్వెస్టులు పంపడం, పరిచయం పెంచుకుని నమ్మకం సంపాదించడం, ఆ తర్వాత వైద్యం, గృహ అవసరాలు, బహుమతులు వంటి కారణాలతో డబ్బులు డిమాండ్ చేయడం వంటి పద్ధతులను నేరగాళ్లు అనుసరిస్తున్నారని తెలిపారు.

డబ్బులు ఇచ్చిన తర్వాత లైంగిక వేధింపుల కేసులు, క్రిమినల్ కేసుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారని పోలీసులు పేర్కొన్నారు. కొందరు నిందితులు పోలీసులమంటూ ఫోన్ చేసి బాధితులను భయపెట్టి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఈ కేసులో నిందితుడిపై ఐటీ చట్టంలోని 66సి, 66డి సెక్షన్లతో పాటు 308(2), 318(4), 319(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సోషల్ మీడియాలో పరిచయం లేని వ్యక్తుల ఫ్రెండ్ రిక్వెస్టులను అంగీకరించే విషయంలో జాగ్రత్తగా ఉండాలని, బెదిరింపులకు భయపడి డబ్బులు చెల్లించకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Dool In-Depth: ഒരു വീട്ടില്‍ നിന്ന് തുടങ്ങിയ പ്രതിഷേധം; സ്പെയിന്‌നെ തെരഞ്ഞെടുപ്പിലേക്ക് തള്ളിയ ഭവനപ്രതിസന്ധി എന്താണ്?

ഒരു വീട് നഷ്ടപ്പെട്ട 87കാരിയുടെ കണ്ണീരില്‍ നിന്ന് ആരംഭിച്ച പ്രതിഷേധം ഒടുവില്‍...

தவெக: 'மெழுகுவர்த்தி சண்டை இல்ல; கௌரவச் சண்டை?' – சர்ச்சையான நவல்பட்டு விஜி; பின்னணி என்ன?

திருச்சியில் நடந்த அரசு சமுதாய வளைகாப்பு நிகழ்ச்சி ஒன்றில் தனக்கு முன்பாக...

MYSORE PALACE: ನಟಿ ಕಾಜಲ್ ಅಗರ್ವಾಲ್ ಭೇಟಿ; ಅರಮನೆ ವೈಭವಕ್ಕೆ ಮನಸೋತ ನಟಿ

  ಮೈಸೂರು, ಅ.5: ದಕ್ಷಿಣ ಭಾರತದ ಖ್ಯಾತ ಚಿತ್ರನಟಿ ಕಾಜಲ್ ಅಗರ್ವಾಲ್...

‘വോട്ട് ബച്ചാവോ ദേശ് ബച്ചാവോ’; ഗ്യാനേഷ് കുമാറിനെതിരെ കോണ്‍ഗ്രസിന്റെ രാജ്യവ്യാപക പ്രക്ഷോഭം ഒക്ടോബര്‍ 10 മുതല്‍

ന്യൂദല്‍ഹി: മുഖ്യ തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷണര്‍ ഗ്യാനേഷ് കുമാറിനെതിരെ പ്രതിഷേധം ശക്തമാക്കി കോണ്‍ഗ്രസ്....