5
October, 2026

A News 365Times Venture

5
Monday
October, 2026

A News 365Times Venture

Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..

Date:

భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య అక్టోబర్ 6వ తేదీ నుంచి ప్రారంభంకానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం మాజీ క్రికెటర్ చతేశ్వర్ పుజారా భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించారు. ఈ జట్టులో యవ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఆయన చోటు కల్పించకపోవడం గమనార్హం. ఇటీవల ముగిసిన ఆసియా క్రీడల్లో భారత జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన వైభవ్ సూర్యవంశీ, అత్యంత పిన్న వయసులో స్వర్ణ పతకం సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. సెమీఫైనల్‌లో శ్రీలంకపై 21 బంతుల్లో 38 పరుగులు, ఫైనల్లో పాకిస్థాన్‌పై 9 బంతుల్లో 15 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే విండీస్‌తో జరిగే టీ20 సిరీస్ కోసం పుజారా ఎంపిక చేసిన తుది జట్టులో అతనికి స్థానం దక్కలేదు.

పుజారా తన ప్లేయింగ్ ఎలెవన్‌లో ఇషాన్ కిషన్‌ను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దించాలని నిర్ణయించగా, వైభవ్ స్థానంలో ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్‌ రెడ్డికి అవకాశం కల్పించారు. అలాగే స్టార్ పేసర్ బుమ్రాకు విశ్రాంతినివ్వడంతో, ఆయన స్థానంలో అర్షదీప్ సింగ్, యువ ఆటగాడు ప్రిన్స్ యాదవ్‌లను పేస్ అటాక్‌కు ఎంపిక చేశారు. స్పిన్ విభాగంలో రవి బిష్ణోయ్ బదులుగా కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కింది.

ఇక వెస్టిండీస్‌‌తో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. చివరిదైన మూడో వన్డేలో విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ అద్భుతమైన అజేయ శతకంతో చెలరేగి జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. కేఎల్ రాహుల్ అజేయ సెంచరీ, రోహిత్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్ అర్ధశతకాలతో భారత్ భారీ స్కోరు సాధించినప్పటికీ, విండీస్ అద్భుతమైన ఛేదనతో మ్యాచ్‌ను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య జరగబోయే టీ20 సిరీస్ అత్యంత రసవత్తరంగా సాగనుందని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు.

పుజారా ఎంపిక చేసిన టీ20 జట్టు: అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ప్రిన్స్ యాదవ్, అర్షదీప్ సింగ్.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

കേരളത്തിലെ സാനിട്ടറി മാലിന്യസംസ്‌കരണം ഒരു ചെറിയ പ്രശ്നമല്ല ; സ്ത്രീകളെ കൂടുതലായി ബാധിക്കുന്നത്: സർക്കാർ പരിഹാരമുണ്ടാക്കണമെന്ന് മാലാ പാർവ്വതി

കേരളത്തിലെ സാനിട്ടറി മാലിന്യസംസ്കരണത്തിന് സർക്കാർ നയം രൂപീകരിക്കണമെന്ന് അഭിനേതാവും സാമൂഹ്യ പ്രവർത്തകയുമായ...

புதுச்சேரி தட்டாஞ்சாவடி இடைத்தேர்தல்: அனல் பறந்த இறுதிகட்ட பிரசாரம்!

துணை ராணுவத்தினர் அணிவகுப்பு துணை ராணுவத்தினர் அணிவகுப்பு Source link

 ಮೈಸೂರು ಅರಮನೆಗೆ ಎಂಟ್ರಿಕೊಟ್ಟ ಅಭಿಮನ್ಯು: ವಿಶೇಷ ಪೂಜೆ ಸಲ್ಲಿಕೆ

ಮೈಸೂರು,ಅಕ್ಟೋಬರ್,5,2026 (www.justkannada.in): ಕಳೆದ 6 ವರ್ಷಗಳ ಕಾಲ ವಿಶ್ವವಿಖ್ಯಾತ ಮೈಸೂರು...

നേഹ ബോറ തന്നേക്കാള്‍ മികച്ചതെന്ന് പറഞ്ഞതിനെ അംഗീകരിച്ച് ദീപ്‌കെ; താരതമ്യമല്ല, ഐക്യദാര്‍ഢ്യമാണ് വേണ്ടതെന്ന് നേഹ

ന്യൂദല്‍ഹി: തന്നേക്കാള്‍ കഴിവുള്ള നേതാവ് നേഹ ബോറ ആണെന്നുള്ള എക്‌സ് പോസ്റ്റ്...