4
October, 2026

A News 365Times Venture

4
Sunday
October, 2026

A News 365Times Venture

Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..

Date:

భారతీయ రైల్వే ప్రయాణికులకు మరింత మెరుగైన, వేగవంతమైన వసతులు కల్పించే దిశగా మరో ముందడుగు వేసింది. ఇందులో భాగంగా బెంగళూరు నుంచి ముంబై మధ్య కొత్తగా రెండో వందేభారత్ స్లీపర్ రైలును నడపడానికి రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ దసరా పండుగ సందర్భంగా ఈ అత్యాధునిక ప్రీమియర్ రైలు సేవలను ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య రాకపోకలు సాగిస్తున్న ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ సుమారు 22 గంటల సమయం తీసుకుంటుండగా, ఈ కొత్త వందేభారత్ స్లీపర్ రైలు ద్వారా ఆ ప్రయాణ సమయం కేవలం 16 గంటలకు తగ్గనుంది.

ఈ నూతన వందేభారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ కేఎస్ఆర్ బెంగళూరు, ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ మధ్య నడవనుంది. ఈ రైలు ప్రయాణం ఆంధ్రప్రదేశ్ మీదుగా సాగనుండటం విశేషం. ఏపీలోని రాయలసీమ ప్రాంతమైన అనంతపురం, గుంతకల్ స్టేషన్లలో ఈ రైలుకు హాల్ట్ కల్పించారు. ఏపీలో ఈ రెండు స్టాపులతో పాటుగా రాయచూర్, కలబురగి, సోలాపూర్, పుణె, కల్యాణ్ తదితర ప్రధాన స్టేషన్లలో కూడా ఈ రైలు ఆగుతుంది.

ఈ సర్వీసును వారానికి ఆరు రోజులు క్రమం తప్పకుండా నడిపేలా ప్రణాళిక సిద్ధం చేశారు. షెడ్యూల్ ప్రకారం బెంగళూరులో ప్రతిరోజూ రాత్రి 10 గంటలకు బయలుదేరే ఈ రైలు, మరుసటి రోజు మధ్యాహ్నం 1:50 గంటలకు ముంబై చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో ముంబైలో రాత్రి 10:30 గంటలకు బయలుదేరి మర్నాడు మధ్యాహ్నం 2:50 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. బెంగళూరు నుంచి సోమవారం, ముంబై నుంచి మంగళవారం ఈ సర్వీసులు అందుబాటులో ఉండవు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഗ്യാനേഷിന്റെ രാജി: രണ്ടാം ദിനവും തലസ്ഥാനം പ്രതിഷേധച്ചൂടില്‍; 150 പേരെ ദല്‍ഹി പൊലീസ് കസ്റ്റഡിയിലെടുത്തു

ന്യൂദല്‍ഹി: മുഖ്യ തിരഞ്ഞെടുപ്പ് കമ്മീഷണര്‍ ഗ്യാനേഷ് കുമാറിന്റെ രാജി ആവശ്യപ്പെട്ട് ഗാന്ധി...

TVK: "படுத்துக் கிடக்கின்ற இந்த அரசை யார் தட்டியெழுப்புவது?" – டாக்டர் கிருஷ்ணசாமி கேள்வி

"மதுராந்தகமும் தாராபுரமும் புகட்டும் பாடத்தால் புரிந்து கொள்வார்களா, அல்லது சுய விழிப்புணர்வு...

Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!

Flydubai Attack: ఫ్లైదుబాయ్ FZ1073 విమానం ఘటనపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్...