2
October, 2026

A News 365Times Venture

2
Friday
October, 2026

A News 365Times Venture

Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..

Date:

Divya Mittal: 2027 ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు మాజీ ఐఏఎస్ అధికారిణి దివ్యా మిట్టల్ సంచలనంగా మారారు. ఆమె రాజకీయాల్లో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమెను తమ పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. దివ్యా మిట్టల్ తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు, ప్రజలతో కలిసి తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తానని ప్రకటించారు.

2013 బ్యాచ్‌కు చెందిన యూపీ కేడర్ ఐఏఎస్ అధికారి దివ్య మిట్టల్, 13 ఏళ్ల సివిల్ సర్వీస్‌కు ఆగస్టు 30న రాజీనామా చేశారు. ఆ తర్వాత నుంచి ఆమె రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 29న ఆమె ఓ వీడియోలో తర్వాతేంటి అనే ప్రశ్నకు తన సమాధానం ‘‘రాజకీయాలు’’ అని ప్రకటించారు. పార్టీతో కాదు ప్రజలతో కలిసి రాజకీయాలు చేస్తాను అని ఆమె వ్యాఖ్యానించడం రాజకీయంగా సంచలనంగా మారాయి.

ఇదిలా ఉంటే, ఆమె కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల రాహుల్ గాంధీతో రహస్యంగా భేటీ అయ్యారనే వార్తలు కూడా వినిపించాయి. ఇదే కాకుండా రాజా భయ్యాకు చెందిన జనసత్తా దళ్ లోక్‌తాంత్రిక్ పార్టీ పోస్టర్‌లో ఏకంగా దివ్యా మిట్టల్ ఫోటో కనిపించడం సంచలనంగా మారింది. యూపీలో దివ్యా మిట్టల్‌కు పాజిటివ్ ఇమేజ్ ఉండటంతో తమ పార్టీలో చేర్చుకుని పోటీలో నిలబెట్టాలని ఎస్పీ, కాంగ్రెస్ భావిస్తున్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

കെ.എം. ബഷീർ കൊലക്കേസ്: മുഖ്യമന്ത്രിയും ചീഫ് സെക്രട്ടറിയും ഒത്തുകളിച്ച് കേസ് അട്ടിമറിക്കാൻ ശ്രമിക്കുന്നുവെന്ന് എ. സൈഫുദ്ദീൻ ഹാജി

തിരുവനന്തപുരം: മാധ്യമപ്രവർത്തകൻ കെ.എം. ബഷീറിന്റെ കൊലപാതകക്കേസ് അട്ടിമറിക്കാൻ മുഖ്യമന്ത്രിയും ചീഫ് സെക്രട്ടറിയും...

ಮಹಾತ್ಮ ಗಾಂಧೀಜಿ ಹಾಗೂ ಲಾಲ್ ಬಹದ್ದೂರ್ ಅವರ ಜೀವನ ಎಲ್ಲರಿಗೂ ಮಾದರಿ – ನ್ಯಾ. ಸಿ ಚಂದ್ರಶೇಖರ್

ಮಂಡ್ಯ,ಅಕ್ಟೋಬರ್,2,2026 (www.justkannada.in): ಶಾಸ್ತ್ರೀ ಅವರ ಸತ್ಯ, ಅಹಿಂಸೆ, ಶಾಂತಿ, ಸರಳತೆ,...

നോക്യാപ് ഫേസ്ബുക്ക് പേജ് വിലക്ക്: യു.ഡി.എഫ് സർക്കാർ മാധ്യമവേട്ട നടത്തുന്നുവെന്ന് പിണറായി വിജയൻ

തിരുവനന്തപുരം: പ്രമുഖ ഡിജിറ്റൽ മാധ്യമമായ നോക്യാപിന് നേരിടേണ്ടി വന്ന ഫേസ്ബുക്ക് വിലക്ക്...