2
October, 2026

A News 365Times Venture

2
Friday
October, 2026

A News 365Times Venture

Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..

Date:

Range Rover Sport Electric: JLR (జాగ్వార్ ల్యాండ్ రోవర్) రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్‌ను ఆవిష్కరించింది. ఈ SUV కోసం బుకింగ్స్ ప్రారంభయ్యాయి. రేంజ్ రోవర్ స్పోర్ట్స్ లైనప్‌లో ఇది తొలి ఎలక్ట్రిక్ మోడల్. ఇందులో 118.5kWh బ్యాటరీ ప్యాక్‌ను అందిస్తున్నారు. ఇది ఒక్క ఛార్జ్‌తో 609 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీల పేర్కొంటోంది. ఈ ఎలక్ట్రిక్ SUV రెండు మోటార్లతో ఆల్-వీల్ డ్రైవ్(AWD)తో వస్తోంది. 550 hp పవర్, 850 Nmను అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ICE వెర్షన్ రేంజ్ రోవర్ స్పోర్ట్‌లోని V8 ఇంజన్ మోడల్‌తో తీసుపోని విధంగా పవర్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్‌ను 00-వోల్ట్ ఫ్లెక్సిబుల్ మాడ్యులర్ లాంగిట్యూడినల్ ఆర్కిటెక్చర్‌పై నిర్మించారు. ఇందులోని బ్యాటరీపై 8 ఏళ్ల లేదా 1.6 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీ అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4.5 సెకన్లలోనే అందుకుంటుంది. 350kW వరకు DC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీంతో 10 శాతం నుంచి 80 శాతం వరకు బ్యాటరీని కేవలం 22 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. 10 నిమిషాల ఛార్జింగ్‌తోనే 220 కిలోమీటర్ల వరకు రేంజ్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది.

ఇక లగ్జరీ, ఇంటీరియర్ విషయంలో ఈ కారు మరింత అట్రాక్టివ్‌గా కనిపిస్తోంది. కొత్తగా వస్తున్న ఎలక్ట్రిక్ మోడల్, ICE వెర్షన్‌ను దాదాపుగా పోలి ఉంటుంది. క్యాబిన్‌లో 3-స్పోక్ స్టీరింగ్ వీల్, టచ్-సెన్సిటివ్ కంట్రోల్స్ ఉన్నాయి. 13.1 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్, 13.7 అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే ఉంటుంది. హీటెడ్, వెంటిలేడెట్ పవర్డ్ సీట్లు, 4-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, రియర్ సన్‌బ్లైండ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. దీనిని వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేసే అవకాశం ఉంది. దీని ధర సుమారుగా రూ. 2.5 కోట్లు ఉంటుందని అంచనా.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

മുംബൈക്ക് ശേഷം മറ്റ് നഗരങ്ങളിലേക്കും പ്രക്ഷോഭം വ്യാപിപ്പിക്കും; ഗ്യാനേഷ് രാജിവെക്കാതെ പിന്‍മാറില്ലെന്ന് സി.ജെ.പി

മുംബൈ: ഒക്ടോബര്‍ രണ്ടിന് മുംബൈയില്‍ ആരംഭിക്കുന്ന ജയില്‍ നിറയ്ക്കല്‍ സമരത്തിന് പുറമെ...

'புள்ளையைத்தான் இழந்துட்டோம்; நீதியையாச்சு கொடுங்களேன்…' – கண்ணீருடன் கவினின் தாய்!

கவினின் ஆணவப்படுகொலை வழக்கில் கொலை செய்த சுர்ஜித்தின் பெற்றோர்களின் பெயரை குற்றப்பத்திரிகையில்...

ಮೈಸೂರಿನಲ್ಲಿ ವಿಶ್ವದ ಮೊದಲ ಸ್ವತಂತ್ರ 8K LED ಡೋಮ್ ಪ್ಲಾನೆಟೇರಿಯಂ – COSMOS

  ಮೈಸೂರು, ಅ.01,2026: ಖಗೋಳ ವಿಜ್ಞಾನ ಮತ್ತು ಬಾಹ್ಯಾಕಾಶ ಸಂಶೋಧನೆಯನ್ನು ಜನಸಾಮಾನ್ಯರು,...

എസ്.ഐ.ആര്‍ ഫോം ഏഴ്: വോട്ടര്‍മാരുടെ പേര് ഒഴിവാക്കിയത് ഗൂഢാലോചന; അന്വേഷണം ആവശ്യപ്പെട്ട് ഡി.കെ. ശിവകുമാര്‍

ബെംഗളൂരു: സംസ്ഥാനത്ത് എസ്.ഐ.ആറിന്റെ ഭാഗമായി ‘ഫോം ഏഴ്’ ഉപയോഗിച്ച് അര്‍ഹരായ വോട്ടര്‍മാരുടെ...