26
September, 2026

A News 365Times Venture

26
Saturday
September, 2026

A News 365Times Venture

LPG Cylinder: ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ ఆగిపోతుందా? అక్టోబర్ 1 నుంచి మారనున్న నిబంధనలు..

Date:

అక్టోబర్ 1 నుంచి గృహ వినియోగదారుల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల కొరకు బయోమెట్రిక్ ఆధార్ ఆథెంటికేషన్ తప్పనిసరి చేశారు. అయితే ఈ ప్రక్రియ పూర్తి చేయని వినియోగదారుల గ్యాస్ డెలివరీని నిలిపివేయరు. వారు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల డిజిటల్ ఛానెల్స్ ద్వారా దీనికి నమోదు చేసుకోవచ్చు. సబ్సిడీ లేకుండా మార్కెట్ ధరపై 5 లేదా 10 కేజీల సిలిండర్లు పొందవచ్చు. డెలివరీ సమయంలో సిబ్బంది ద్వారా లేదా డిస్ట్రిబ్యూటర్ దుకాణానికి వెళ్లి ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. వినియోగదారులు తమ మొబైల్ యాప్స్ ద్వారా కూడా ఈ-కేవైసీ పూర్తి చేసే సదువు కల్పించారు.

ఇండేన్ కోసం ఇండేన్ ఆయిల్ వన్, భారత్ గ్యాస్ కోసం హలో బీపీసీఎల్, హెచ్‌పీ గ్యాస్ కోసం హెచ్‌పీ పే యాప్ ఉపయోగించాలి. ఈ ఆథెంటికేషన్ ప్రధాన ఉద్దేశం సబ్సిడీ సిలిండర్లు అర్హులైన కుటుంబాలకే అందేలా చూడటం. దీనివల్ల డూప్లికేట్, అనర్హమైన కనెక్షన్‌లను తొలగించవచ్చు. అంతేకాకుండా సబ్సిడీ సిలిండర్లను కమర్షియల్, పారిశ్రామిక అవసరాలకు మళ్లించకుండా అడ్డుకోవడంతో పాటు సబ్సిడీ పంపిణీలో పారదర్శకత పెరుగుతుంది.

ఈ బయోమెట్రిక్ ఆధార్ ఆథెంటికేషన్ పూర్తి చేయడానికి ప్రభుత్వం మొదట జూన్ 30 గడువు విధించింది. వినియోగదారుల సౌలభ్యం కోసం ఈ గడువును జూలై 31, ఆగస్టు 7, 15, 23, 31, సెప్టెంబర్ 7, సెప్టెంబర్ 14 వరకు పలుమార్లు పొడిగించారు. చమురు మార్కెటింగ్ కంపెనీలు దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, 12 కోట్లకు పైగా ఎస్ఎంఎస్, వాట్సాప్ సందేశాలను పంపాయి. గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి డెలివరీ సిబ్బంది ద్వారా నేరుగా సంప్రదించారు.

సెప్టెంబర్ 2026 నాటికి ప్రతి 14.2 కేజీల సిలిండర్‌పై సబ్సిడీ దాదాపు రూ. 210గా ఉంది. వినియోగదారులు సకాలంలో ఈ ఆధార్ ఆథెంటికేషన్ పూర్తి చేయడం ద్వారా ఎలాంటి అంతరాయం లేకుండా సిలిండర్లను పొందవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఈ నూతన నిబంధనల వల్ల గ్యాస్ పంపిణీ వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ദല്‍ഹിയില്‍ ഭജന്‍ ക്ലബ്ബിങ്ങില്‍ പങ്കെടുത്ത് മോദി; വിമര്‍ശനവുമായി ദീപ്‌കെ

ന്യൂദല്‍ഹി: ദല്‍ഹിയില്‍ ഭജന്‍ ക്ലബ്ബിങ്ങില്‍ പ്രധാനമന്ത്രി നരേന്ദ്ര മോദി പങ്കെടുക്കുന്നതിന്റെ വീഡിയോ...

"என்ன பெத்த தாயை தவறா பேசும்போது கூட பொறுத்துகிட்டேன், ஆனா..!"- திமுகவை காட்டமாக விமர்சித்த விஜய்

அக்டோபர் 6 ஆம் தேதி மதுராந்தகம், தாராபுரம் தொகுதியில் இடைத்தேர்தல் நடைபெற...

ದಸರಾ ದೀಪಾಲಂಕಾರ ಹೆಚ್ಚು ಆಕರ್ಷಕ, ಹೊಸತನದಿಂದ ಕೂಡಿರಲಿ -ಸಚಿವ ಕೆ.ಜೆ.ಜಾರ್ಜ್

ಮೈಸೂರು, ಸೆಪ್ಟಂಬರ್‌,25, 2026 (wwww.justkannada.in) ನಾಡಹಬ್ಬ ಮೈಸೂರು ದಸರಾ ಅಂಗವಾಗಿ...

സയണിസം വംശീയത; ഇസ്രഈലിനെ എതിര്‍ക്കുന്നത് ജൂത വിരുദ്ധതയല്ലെന്ന് ജൂത സമുദായാംഗമായ ഗ്രീന്‍ പാര്‍ട്ടി നേതാവ്

ലണ്ടന്‍: സയണിസം ഒരുതരം വംശീയതയാണെന്നും താന്‍ ഒരു സയേണിസ്റ്റ് വിരുദ്ധനാണെന്നും ബ്രിട്ടനിലെ...