24
September, 2026

A News 365Times Venture

24
Thursday
September, 2026

A News 365Times Venture

Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన

Date:

దేశంలో మహిళలపై పెరుగుతున్న నేరాలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు భద్రత కల్పించలేని పరిస్థితుల్లో ఎన్ని పెద్ద పథకాలు, కార్యక్రమాలు ప్రకటించినా ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు. ఢిల్లీ కల్కాజీ ఆలయం సమీపంలో 17 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు పోలీసులుగా నటిస్తూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలు, బీహార్‌లోని జముయ్‌లో ఇద్దరు మైనర్ విద్యార్థులను ఓ గుంపు వేధించిందనే ఆరోపణల నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

ఏం లాభం?

వయనాడ్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడిన ప్రియాంక గాంధీ.. మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని అన్నారు. ‘‘ఇది చాలా దారుణం. మహిళలపై నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. మహిళలకు దేశంలో భద్రత లేకుండా పోతోంది. గతంలోనూ పరిస్థితి పూర్తిగా సురక్షితంగా లేదు. కానీ ఇప్పుడు మహిళలపై హింస మరింత పెరుగుతోంది. మన వీధుల్లోనే మహిళలకు భద్రత కల్పించలేకపోతే పెద్ద పథకాలు, కార్యక్రమాల గురించి మాట్లాడటంలో ప్రయోజనం ఏముంది? దీనిపై మనందరం ఆలోచించాలి’’ అని ఆమె అన్నారు. మహిళలు సురక్షితంగా ఉన్నామనే భావన కలిగేలా కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

కల్కాజీ ఘటనలో ముగ్గురు అరెస్ట్

ఢిల్లీలోని కల్కాజీ మందిర్ సమీపంలోని ఆస్తా కుంజ్ పార్క్‌లో సోమవారం సాయంత్రం 17 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. తాము పోలీసులమంటూ బాలిక, ఆమెతో ఉన్న ఓ యువకుడిని నిందితులు సంప్రదించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు మంగళవారం వెల్లడించారు. ప్రధాన నిందితుడు అసిఫ్ బాలికను తుపాకీ, కత్తితో బెదిరించి అత్యాచారం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అతనితో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు కూడా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని, అనంతరం బాలికతో పాటు ఆమె స్నేహితుడిని బెదిరించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రాత్రి సుమారు 8.45 గంటలకు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందినట్లు పోలీసులు చెప్పారు. దీంతో అమర్ కాలనీ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ, సిబ్బంది ఆస్తా కుంజ్ పార్క్‌కు చేరుకున్నారు. అక్కడ బాలిక తన స్నేహితుడితో ఉన్నట్లు గుర్తించారు.

బాధితురాలికి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఘటనాస్థలాన్ని క్రైమ్, ఫోరెన్సిక్ బృందాలు పరిశీలించి ఆధారాలను సేకరించాయి. అమర్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత (BNS), పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

జముయ్‌లో..

ఇదిలా ఉండగా బీహార్‌లోని జముయ్‌లో సెప్టెంబర్ 19న ఓ టీనేజ్ బాలుడు, బాలికను ఓ గుంపు అడ్డుకుని వేధించిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల ఆధారంగా సుమారు ఏడుగురిని గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న నందన్ యాదవ్‌ను మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഗ്യാനേഷ് കുമാറിനെ ജയിലിലടക്കണം; ബാലറ്റ് പേപ്പറുകള്‍ ഉപയോഗിച്ച് തെരഞ്ഞെടുപ്പുകള്‍ വീണ്ടും നടത്തണം: ഉദ്ധവ് താക്കറെ

ന്യൂദല്‍ഹി: മുഖ്യ തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷണര്‍ ഗ്യാനേഷ് കുമാറിനെതിരെ രൂക്ഷവിമര്‍ശനവുമായി ശിവസേന (യു.ബി.ടി)...

`தேர்தல் முடிவுகள் மீது கடும் சந்தேகங்களை எழுப்புகிறது; ஞானேஷ் குமார் பதவி விலக வேண்டும்!'- ஸ்டாலின்

வாக்காளர் சிறப்பு தீவிர திருத்தம் (SIR) மூலம் வாக்காளர் பட்டியலிலிருந்து சுமார்...

ശമ്പളം കൊടുക്കാതിരിക്കാൻ എന്താണ് മാർഗം എന്ന നിലയിലേക്കാണ് ‘മാധ്യമം’ മാനേജ്‌മന്റ് പോകുന്നത് – ആർ. ചന്ദ്രശേഖരൻ

കോഴിക്കോട്: ശമ്പളസമരം ഒത്തുതീർക്കണമെന്നാവശ്യപ്പെട്ട് സംയുക്ത ട്രേഡ് യൂണിയ​ന്റെ നേതൃത്വത്തിൽ ‘മാധ്യമം’ ദിനപത്രത്തിന്റെ...

“தவெக வெற்றி பெறுவதால் எந்த ஆட்சி மாற்றமும் வரப்போவதில்லை" – சிபிஎம் சண்முகம்

மதுராந்தகம், தாராபுரம் சட்டமன்றத் தொகுதிகளில் இடைத்தேர்தல் நடைபெறவிருக்கிறது. தவெக- ஆட்சி அமைக்க...