23
September, 2026

A News 365Times Venture

23
Wednesday
September, 2026

A News 365Times Venture

Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!

Date:

Asian Games 2026 Final: ఆసియా క్రీడలు 2026 మహిళల క్రికెట్ ఫైనల్లో టీమిండియా బ్యాటర్లు శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. నిస్షిన్‌లోని కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో జరుగుతున్న గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో శ్రీలంక ముందు 217 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

ఈ మ్యాచ్ లో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం చేసింది. కేవలం 45 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 79 పరుగులు చేసి అదరగొట్టింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన మంధాన.. మూడో ఓవర్‌లో సిక్సర్ బాదడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో 11 వేల పరుగుల మైలురాయిని అందుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది.

మంధానకు తోడుగా మరో ఓపెనర్ షఫాలీ వర్మ కూడా ధాటిగా ఆడింది. 29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 48 పరుగులు చేసింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్‌కు శుభారంభం అందించారు. ఆ తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్ 19 పరుగులు చేయగా, రిచా ఘోష్ చివర్లో విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను పూర్తిగా భారత్ వైపు తిప్పారు.

రిచా ఘోష్ కేవలం 22 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 49 పరుగులు చేసింది. చివరి ఐదు ఓవర్లలో భారత్ 74 పరుగులు రాబట్టి స్కోరును 216కి చేర్చింది. భర్తి ఫుల్మాలి 7 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. ఇక స్మృతి మంధానకు ఇది మరో చారిత్రాత్మక మైలురాయి. ఇటీవలే మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా మిథాలీ రాజ్ రికార్డును అధిగమించిన మంధాన.. ఇప్పుడు 11 వేల అంతర్జాతీయ పరుగుల మార్క్‌ను కూడా అందుకున్నారు. ఫైనల్‌కు ముందు ఆమె ఖాతాలో 10,987 పరుగులు ఉండగా.. మరో 13 పరుగులు చేస్తే 11 వేల పరుగుల క్లబ్‌లో చేరాల్సి ఉంది. మూడో ఓవర్‌లోనే ఆ ఘనతను సాధించారు.

భారత్ తరఫున టెస్టుల్లో 788, వన్డేల్లో 5,411, టీ20ల్లో 4,788 పరుగులు సాధించిన మంధాన.. ఇటీవల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లోనూ అత్యధిక పరుగుల రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నారు. దీంతో ఆసియా క్రీడల ఫైనల్లో ఆమె మరో అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నారు. 2023 ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన భారత మహిళల జట్టు.. ఈసారి కూడా గోల్డ్ మెడల్ కోసం బరిలోకి దిగింది. మరోవైపు శ్రీలంకకు ఆసియా క్రీడల్లో ఇది తొలి స్వర్ణం కోసం జరుగుతున్న పోరు.


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

വെസ്റ്റ് ബാങ്കിലെ ഇസ്രഈല്‍ അതിക്രമങ്ങളും ഭൂമി കൈയേറ്റവും വംശീയ ഉന്മൂലന സാധ്യത വര്‍ദ്ധിപ്പിക്കുന്നു: യു.എന്‍ സെക്രട്ടറി ജനറല്‍

ന്യൂയോര്‍ക്ക്: വെസ്റ്റ് ബാങ്കില്‍ ഇസ്രഈല്‍ നടത്തുന്ന അക്രമങ്ങളും കുടിയൊഴിപ്പിക്കലും അനധികൃത കുടിയേറ്റ...

"சங் பரிவாரின் B Team ஆக மாறிவிட்டது காங்கிரஸ் அரசு" – பினராயி மீதான விசாரணைக்கு சிபிஎம் கண்டனம்

சி.எம்.ஆர்.எல் தாது மணல் கம்பெனியிடம் இருந்து மகள் மூலம் லஞ்சம் பெற்றதாக...

ഇതിഹാസങ്ങളെ ഒന്നടങ്കം വെട്ടിനിരത്തി; ഇംഗ്ലണ്ടിന്റെ ‘രാജാവ്’ ഇനി ലോകത്തിന്റെയും തലവന്‍!

ഇംഗ്ലണ്ടും ശ്രീലങ്കയും തമ്മിലുള്ള മൂന്ന് ഏകദിന മത്സരങ്ങള്‍ അടങ്ങുന്ന പരമ്പരയിലെ ആദ്യ...

"கம்யூனிஸ்ட்களின் வரலாற்றை ஆதவ் அர்ஜுனா படித்து முதல்வருக்கும் சொல்ல வேண்டும்" – வீரபாண்டியன் பதிலடி

"கம்யூனிஸ்ட் வரலாற்றை ஆதவ் அர்ஜுனா படித்து முதல்வருக்கும் சொல்ல வேண்டும்" என்று...